స్టైలిష్ స్టార్.. ఈ పేరుకు తగ్గట్లుగానే ఎపుడూ తన కొత్త లుక్స్‌తో అభిమానుల్ని సర్ప్రైజ్ చేస్తుంటాడు అల్లు అర్జున్. ప్రతి సినిమాకు కొత్త గెటప్‌లో కనిపిస్తుంటాడు. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఈ హీరో ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించబోతున్నాడు. అందుకోసం మాస్ లుక్ ట్రై చేస్తున్నాడు. ఈ మధ్యనే ఇతడు ఉంగరాల జట్టుతో ఉన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. తాజాగా మరోసారి బన్నీ స్టైల్ వైరల్‌గా మారింది.
రింగుల జట్టు, మాసిన గడ్డంతో బన్నీ మాస్ లుక్ అదిరిపోయింది. ఈ సందర్భంగా అతడిని చూడటానికి వచ్చిన అభిమానులు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అవి కాస్తా వైరల్‌గా మారాయి.
ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివతో కొత్త చిత్రం చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది.