ETV Bharat / sitara

Allu arjun 'Pushpa': ''పుష్ప'.. పది 'కేజీఎఫ్'​లతో సమానం'

ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించిన విధంగా బన్నీ 'పుష్ప' సినిమాలో ఉండనున్నారని అంచనాల్ని పెంచేశారు యువ డైరక్టర్ బుచ్చిబాబు. పది 'కేజీఎఫ్'లకు సమానంగా ఇది ఉంటుందని అన్నారు.

allu arjun pushpa equal to 10 Kgf movies: buchi babu
అల్లు అర్జున్ పుష్ప
author img

By

Published : Jun 14, 2021, 10:38 AM IST

Updated : Jun 14, 2021, 11:44 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ 'పుష్ప' టీజర్​ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగా దర్శకుడు బుచ్చిబాబు చేసిన తాజా వ్యాఖ్యలు, బన్నీ అభిమానులకు పట్టరాని సంతోషాన్ని కలిగిస్తున్నాయి. తాను 'పుష్ప' చూశానని పది 'కేజీఎఫ్'లు కలిస్తే ఈ సినిమా అని అన్నారు.

"అల్లు అర్జున్.. టాలీవుడ్​లో ఏ హీరో చేయని సాహసం చేశారు. బన్నీ క్యారక్టరైజేషన్, ఎలివేషన్స్​ ఆ లెవల్​లో ఉంటాయి. పది 'కేజీఎఫ్'లు కలిస్తే 'పుష్ప' సినిమా. డీఎస్పీ మ్యూజిక్ ఎలా కొట్టారంటే నాకు ఇప్పుడే ఆ పాటలు పాడేయాలని అనిపిస్తోంది" అని బుచ్చిబాబు చెప్పారు.

buchi babu with allu arjun
అల్లు అర్జున్​తో దర్శకుడు బుచ్చిబాబు

'ఉప్పెన'తో దర్శకుడిగా మారి హిట్​ కొట్టిన బుచ్చిబాబు.. సుకుమార్​ శిష్యుడు. అతడి దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్​గా చేసిన ఈ ఏడాది వచ్చిన 'ఉప్పెన'తో డైరెక్షన్​ చేశారు. దీని తర్వాత ఎన్టీఆర్​తో కలిసి పనిచేయనున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

లాక్​డౌన్​ వల్ల ఆగిన 'పుష్ప' షూటింగ్.. ఈనెలాఖరు నుంచి తిరిగి మొదలుకానుంది. త్వరలో దానిని పూర్తి చేసి, ముందే చెప్పినట్లు ఆగస్టు 13న థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశముంది. లేదంటే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా!

ఇది చదవండి: Allu arjun: 'పుష్ప' కోసం బన్నీ.. ఈ నెలాఖరు నుంచే

Last Updated : Jun 14, 2021, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.