స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం అభిమానులు ఏడాదిపైగా ఎదురు చూస్తున్నారు. మేకప్‌కు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ హీరో ఒకేసారి మూడు చిత్రాలకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న బన్నీ... అనంతరం సుకుమార్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు.
తాజాగా అల్లు అర్జున్‌కు సంబంధించిన మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే అట్లీని బన్నీ కలిశాడని.. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని అంటున్నారు.
ఎప్పటినుంచో ద్విభాషా చిత్రం చేయాలని భావిస్తోన్న బన్నీ ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయాలని భావిస్తున్నాడట. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.
ఇవీ చూడండి.. 'సోనాక్షి.. పాఠశాలకు వెళ్లి చదువుకో'