ETV Bharat / sitara

సినిమా గెలవాల్సిన సమయమిది: బన్నీ - telugu new movies

Rowdy Boys song: ప్రముఖ నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా తెరకెక్కిన చిత్రం 'రౌడీబాయ్స్‌'. తాజాగా ఈ సినిమాలోని 'డేట్‌ నైట్‌' పాటను ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్‌ విడుదల చేశారు. ఈ క్రమంలో మాట్లాడిన బన్నీ.. "సంక్రాంతికీ చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది సినిమా గెలవాల్సిన సమయం" అని పేర్కొన్నారు.

Rowdy Boys cinema
Rowdy Boys cinema
author img

By

Published : Jan 11, 2022, 6:50 AM IST

Rowdy Boys song: "డిసెంబర్‌లో విడుదలైన తెలుగు సినిమాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. సంక్రాంతికీ చాలా సినిమాలు వస్తున్నాయి. అదీ ఇదీ అని కాదు.. సినిమా గెలవాల్సిన సమయమిది" అన్నారు ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన 'రౌడీబాయ్స్‌' డేట్‌ నైట్‌ పాట విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. దిల్‌రాజు - శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వేడుకని ఉద్దేశించి అల్లు అర్జున్‌ మాట్లాడారు. "నా జీవితంలో దిల్‌రాజు ఓ ముఖ్యమైన భాగం. 'ఆర్య' లేకపోతే నేను లేను. దిల్‌రాజు లేకపోతే 'ఆర్య' లేదు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆశిష్‌ని చూశా. హర్షిత్‌, హన్షిత నిర్మాతలుగా, ఆశిష్‌ హీరోగా ఎదగడం ఎంతో ఆనందంగా ఉంది" అన్నారు.

Date Night song: దర్శకుడు హర్ష మాట్లాడుతూ "కాలేజీలో జరిగే ఫ్రెషర్స్‌ పార్టీని దృష్టిలో ఉంచుకుని డేట్‌ నైట్‌ సాంగ్‌ అనే కాన్సెప్ట్‌తో ఈ పాట చేశాం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా" అని పేర్కొన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ "ఈ సంక్రాంతికి వస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మా చిత్రం. 15 నుంచి 25 ఏళ్ల కుర్రకారు వరకు అందరూ ఆస్వాదించేలా ఉంటుంది. మా సంస్థ నుంచి సంక్రాంతికి ఐదు సినిమాలు వచ్చాయి, విజయవంతమయ్యాయి. ఆరో సినిమాగా వస్తున్న ఈ చిత్రంతో రెండో హ్యాట్రిక్‌ కొడతాం" అన్నారు. ఈ కార్యక్రమంలో శిరీష్‌, హన్షితరెడ్డి, హర్షిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: విజయ్ దేవరకొండతో బాలయ్య కిక్​ బాక్సింగ్​.. అదరగొట్టేశారుగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.