సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన దక్షిణాది నటుడిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఘనత సాధించాడు. ఫేస్బుక్లో తాజాగా 18 మిలియన్ల ఫాలోవర్స్ మైలురాయిని చేరుకోగా.. ఇన్స్టాగ్రామ్లో 8.8 మిలియన్లు, ట్విట్టర్లో మరో 5.2 మిలియన్ల అభిమానులను సంపాదించుకున్నాడు. బన్నీకి ఈ మూడు డిజిటల్ వేదికలతో కలిపి మొత్తంగా 32 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ అంతటా భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'తో ఉత్తరాదిన పాగా వేయాలని చూస్తున్నాడు బన్నీ.