ETV Bharat / sitara

'బన్నీ సినిమాలో పాట పాడటం నా కల' - అల్లు అర్జున్ గురించి ఆస్థా గిల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​ సినిమాలో పాట పాడటం తన కల అని అంటోంది గాయని ఆస్థా గిల్. త్వరలోనే ఆ అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

grooving to my songs is my dream says Singer Aastha Gill
బన్నీకి పాట పాడటం నా కల: ఆస్థా గిల్
author img

By

Published : Dec 20, 2020, 12:07 PM IST

ఇప్పటివరకు బాలీవుడ్​లో సినిమా చేయకపోయినా పాన్ ఇండియా రేంజ్​లో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన డ్యాన్స్​లు, నటనతో ఎందరో అభిమానుల్ని అలరిస్తున్నాడు. ఇతర ఇండస్ట్రీల్లోనూ బన్నీకి ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా గాయని ఆస్థా గిల్​ కూడా అర్జున్​కు వీరాభిమానినని అంటోంది. అతడి సినిమాలో పాట పాడటం తన కల అని వెల్లడించింది.

"అల్లు అర్జున్ సినిమాలో ఓ పాట పాడాలని కోరుకుంటున్నా. అప్పుడు బన్నీ నా పాటను హమ్ చేస్తాడు. ఇది నా కల. తెలుగు భాష తెలియకపోయినా పాటల్ని పాటడం మాత్రం ఆస్వాదిస్తా" అని తెలిపింది గిల్.

పాపులర్ సింగర్స్ దిల్జీత్ దోసాంజే, బాద్​షాలతో కలిసి చాలా పాటలు పాడింది ఆస్థా గిల్. తనదైన గొంతుతో అభిమానుల్ని సంపాదించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.