షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా తీరిక దొరికితే చాలు పిల్లలతో గడిపేందుకు సమయం కేటాయిస్తుంటాడు హీరో అల్లు అర్జున్. ఆ ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లోనూ పంచుకుంటూ ఉంటాడు. కూతురు అర్హ.. తాను స్వయంగా తయారు చేసిన చిన్న పూలకుండీని తనకు బహుమతిగా ఇచ్చిందని చెప్పాడు బన్నీ.
"నా స్వీట్హార్ట్.. ఓ చిన్న పూలకుండీని నాకు బహుమతిగా ఇచ్చింది." -ఇన్స్టాలో అల్లు అర్జున్
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడీ హీరో. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. నివేదా పేతురాజ్, సుశాంత్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: వారి జీవితమే బాగుందన్న బన్నీ