ETV Bharat / sitara

అమ్మాయిలు చిత్ర పరిశ్రమలోకి రావాలి: అల్లుఅర్జున్ - నాగశౌర్య వరుడు కావలెను మూవీ

'వరుడు కావలెను' ప్రీ రిలీజ్​ వేడుకకు విచ్చేసిన అల్లుఅర్జున్.. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అమ్మాయిలో మరింత మంది చిత్రపరిశ్రమలోకి రావాలని అన్నారు.

allu arjun at varudu kavalenu pre release event
అల్లుఅర్జున్
author img

By

Published : Oct 28, 2021, 6:40 AM IST

"చిత్ర పరిశ్రమల్లో అన్ని సమస్యలూ తొలగిపోతున్నాయి. ప్రేక్షకులు థియేటర్‌కు వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే ఉత్సాహం ఇలా కొనసాగాలని కోరుకుంటున్నా" అని ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌ అన్నారు. ఆయన ముఖ్య అతిథిగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో 'వరుడు కావలెను' ముందస్తు విడుదల వేడుక జరిగింది. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రమిది. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

"ఇందులోని 'దిగుదిగు..' పాట మా ఇంట్లో వినిపిస్తూనే ఉంది. నాగశౌర్య సినిమాలన్నీ చూశా. చాలా అందగాడు. తనలో ఒక అమాయకత్వం ఉంటుంది. తను మంచి మనిషి. చాలా పెద్ద హీరో అవుతాడు. తనలా స్వతంత్య్రంగా ఎదిగినవాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఎలాంటి నేపథ్యం లేకపోయినా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. 'పెళ్లిచూపులు' చూసిన వెంటనే రీతూవర్మ గురించి కనుక్కున్నా. తను ఇందులో చాలా బాగుంది. లక్ష్మీసౌజన్య దర్శకురాలు కావడం చాలా ఆనందంగా ఉంది. అమ్మాయిలు చిత్ర పరిశ్రమకు రావాలి. ముంబయిలో సినిమా చేసేటప్పుడు సెట్లో 50 శాతం అమ్మాయిలు కనిపిస్తుంటారు. మన దగ్గర ఇలా ఎప్పుడు కనిపిస్తారా అనుకుంటుంటాం. ఆ రోజుల వచ్చాయని నమ్ముతున్నా. గీతాఆర్ట్స్‌ తర్వాత మా సొంత సంస్థల్లా అనిపించేది హారిక హాసిని, సితార సంస్థలే. చిత్ర పరిశ్రమకు ఈ సీజన్‌ చాలా కీలకం. అన్ని భాషల్లోనూ సినిమాలు విజయవంతంగా ఆడాలి. ఈ ఏడాది ముగిసే సమయంలో మేం కూడా 'పుష్ప'తో వస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటాను" అని బన్నీ అన్నారు.

allu arjun at varudu kavalenu pre release event
అల్లు అర్జున్- 'వరుడు కావలెను' చిత్రబృందం

"ఈ సినిమా నేను చూశాను. సినిమా చూశాక మనతో పాటే ఇంటికొస్తాయి కొన్ని పాత్రలు. మన ఇళ్లల్లో జరిగే, మనకు తెలిసిన ఆడపిల్లల తాలూకు కథ ఇది. మన గుండెలకు దగ్గరగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సన్నివేశాల్లో నాగశౌర్య చాలా బాగా చేశాడు. రీతూ పెళ్లి నేపథ్యంలో సాగే కథల్లోనే నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత చీర కట్టుకున్న ఓ హీరోయిన్‌ను చూశా" అని త్రివిక్రమ్ అన్నారు.

"రెండేళ్ల తర్వాత ఒక వేడుకలో ఇంత మందిని చూడటం చాలా సంతోషంగా ఉంది. దర్శకురాలు సౌజన్య 15 ఏళ్లు కష్టపడింది. ఈ చిత్రంతో తను తప్పక విజయం అందుకుంటుంది. అల్లు అర్జున్‌ ఈ తరానికి ఓ స్ఫూర్తి. ఆయన వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 29న 'రొమాంటిక్‌' సినిమా కూడా వస్తుంది. రెండూ విభిన్నమైన సినిమాలు. ఆకాశ్​కు ఆల్‌ ది బెస్ట్‌. కలిసి గెలుద్దాం" అని హీరో నాగశౌర్య అన్నారు.

"నా తొలి సినిమా నుంచి చాలా ప్రోత్సహించారు అల్లు అర్జున్‌. ఆయనతో కలిసి పనిచేయడం గురించి ఎదురు చూస్తున్నా" అని హీరోయిన్ రీతూవర్మ అన్నారు. "మాటకీ, మనిషికీ చాలా విలువనిచ్చే నిర్మాత చినబాబు. నాగశౌర్య కెమెరా ముందు మాత్రమే నటిస్తారు. తనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనిపించే కథానాయకుడు" అని డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య అన్నారు. కార్యక్రమంలో నదియా, తమన్‌, విశాల్‌ చంద్రశేఖర్‌, ప్రవీణ్‌, శరత్‌ చంద్ర, నవీన్‌ నూలి తదితరులు పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.