'పుష్ప' సినిమాలో తెలుగమ్మాయినే హీరోయిన్‌గా పెట్టాలని అల్లు అర్జున్ పట్టుబట్టాడని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. బన్ని అంతటి పెద్ద హీరో తెలుగు హీరోయిన్ కావాలని కోరడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. అయితే.. వేరే కారణాల వల్ల రష్మికను తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో వచ్చిన 'ప్లేబ్యాక్' చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సుకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించిన తెలుగు అమ్మాయి అనన్యపై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. ఇందులో అనన్య ఎంతో చక్కగా నటించిందని అన్నారు. తన సినిమాల్లో తెలుగు సరిగా రాని హీరోయిన్లను పెట్టుకుంటే వాళ్లు డైలాగులు చెప్పడానికి ఎంతో ఇబ్బందిపడేవారని ఆయన అన్నారు. అందుకే.. ఇక నుంచి తెలుగు వచ్చిన వాళ్లనే పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 'రంగస్థలం'లో కూడా సమంత, ప్రకాశ్‌రాజ్ తప్పితే మిగిలిన వాళ్లంతా తెలుగు వాళ్లేనని గుర్తు చేశారు. వాళ్లిద్దరూ కూడా తెలుగు ఎంతో బాగా మాట్లాడతారన్న కారణంతోనే వాళ్లను తీసుకున్నానని చెప్పుకొచ్చారు. తన తర్వాతి సినిమాలో కచ్చితంగా తెలుగమ్మాయినే హీరోయిన్‌గా పెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అల్లుఅర్జున్ 'పుష్ప' టీజర్.. ఆరోజేనా?
ఇదీ చూడండి: 'పుష్ప'లో బన్నీ మేకప్ కోసం అన్ని గంటలా?