ETV Bharat / sitara

ఆమె యాక్టింగ్‌ చూసి మురిసిపోయిన బన్నీ దంపతులు - శాకుంతలం సెట్​లో అల్లు అర్జున్​

అల్లు అర్జున్​ ముద్దుల తనయ అల్లు అర్హ.. గుణశేఖర్​ దర్శకత్వంలోని శాకుంతలం చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఆ సినిమా సెట్​కు వెళ్లిన అల్లు అర్జున్​ దంపతులు కూతురు నటన చూసి మురిసిపోతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

allu arjun, allu arha
అల్లు అర్జున్​, అల్లు అర్హ
author img

By

Published : Aug 7, 2021, 6:00 PM IST

తన ముద్దుల కూతురు అల్లు అర్హ నటన చూసి అల్లు అర్జున్‌ దంపతులు మురిసిపోయారు. డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' చిత్రంలో అర్హ నటిస్తుంది. గతంలో గుణశేఖర్‌ రూపొందించిన 'రుద్రమదేవి'లో బన్నీ 'గోన గన్నారెడ్డి'గా కనిపించి సందడి చేశాడు. ఇప్పుడు ఆ డైరెక్టర్‌ చిత్రంలోనే బన్నీ తనయ అర్హ నటిస్తోంది. ఈ చిత్రంలో అక్కినేని సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ఓ కీలకపాత్రలో అర్హ కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

కాగా.. తన కూతురి నటన దగ్గరుండి చూడాలని బన్నీ-స్నేహ దంపతులు 'శాకుంతలం' సెట్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే అర్హ నటన చూసిన బన్నీ తెగ మురిసిపోయాడు. ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు.. బన్నీ సినిమాల కోసం వినియోగించే వాహనం 'ఫాల్కనో'ను కూతురి సౌకర్యం కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దిల్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌, గుణాటీమ్‌ వర్క్స్‌ పతాకాలపై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో అలరించేందుకు సిద్ధమవుతోంది.

allu-arjun-and-sneha-enjoys-arha-acting-on-shaakuntalam
అర్హతో బన్నీ

కూతురుతో అల్లు అర్జున్​

ఇదిలా ఉండగా మరోవైపు అల్లు అర్జున్‌ 'పుష్ప' పనుల్లో బిజీగా ఉంటున్నాడు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం ఈ ఏడాది డిసెంబరులో క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

అల్లు అర్హతో బన్నీ సెల్ఫీ

శాకుంతలం సెట్​లో బన్నీ దంపతులు

ఇదీ చదవండి: Raj Kundra: 'అతడు తప్పుడు పనులు చేయిస్తాడనుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.