ETV Bharat / sitara

'బుట్టబొమ్మ' పాటకు ఆ చిన్నారి ఫిదా! - ఏక్తా కపూర్​ తనయుడు బుట్టబొమ్మకు పాటకు డ్యాన్స్​

ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న బాలీవుడ్​ నిర్మాత ఏక్తా కపూర్​ తనయుడు.. 'బుట్టబొమ్మ' పాటకు డ్యాన్స్ చేశాడు. చూడముచ్చటగా ఉన్న ఆ వీడియోకు విశేష స్పందన లభిస్తోంది.

ekta kapoor
ఏక్తా కపూర్​
author img

By

Published : Jun 3, 2020, 4:36 PM IST

ఇప్పటికే దేశంతో సంబంధం లేకుండా ఎంతోమంది సెలబ్రిటీల మనసు దోచిన 'బుట్టబొమ్మ' పాటకు, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ తనయుడు ఫిదా అయ్యాడు.​ ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న ఆ చిన్నారి.. టీవీలో వస్తున్న గీతానికి అనుగుణంగా, కాలు కదుపుతూ ఆనందం వ్యక్తం చేశాడు. ఆ వీడియోను ఏక్తా తన ఇన్​స్టాలో పంచుకున్నారు. తన కుమారుడికి ఇష్టమైన పాట ఇదంటూ రాసుకొచ్చారు.

దీనిపై స్పందించిన హీరోయిన్​ పూజాహెగ్డే.. చిన్నపిల్లలతో పాటు ప్రతిఒక్కరూ ఈ పాటను అభిమానిస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందనే వ్యాఖ్య జోడించింది. ఆర్మాన్​ మాలిక్​, కార్తిక్​ ఆర్యన్​ సహా పలువురు ఈ వీడియోపై కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

'డ్రీమ్​గర్ల్​', 'రాగిని ఎమ్​ఎమ్​ఎస్'​, 'డర్టీ పిక్చర్', 'హాఫ్​ గర్ల్​ఫ్రెండ్'​, 'గ్రేట్​ గ్రాండ్​ మస్తీ', 'ఉడ్తా పంజాబ్'​ వంటి హిట్​ సినిమాలు నిర్మించారు ఏక్తా కపూర్​. దీనితో పాటే పలు సీరియళ్లకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్​ దర్శకుడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విశేషాదరణ సొంతం చేసుకుని కలెక్షన్లలో నాన్-బాహుబలి రికార్డులను సృష్టించింది.

ఇదీ చూడండి : 'ఆ​ వెబ్​సిరీస్​ కోసం 45 రోజులు మేకప్​ భరించా'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.