ETV Bharat / sitara

బాలీవుడ్​ కాదు.. నా టార్గెట్​ అదే: అల్లు అర్జున్ - అల్లు అర్జున్

Pushpa Movie: తన సినిమాలకు బాలీవుడ్​లో విశేష స్పందన లభిస్తున్నా.. తనకు మాత్రం కోలీవుడ్​లోనే గెలవాలని ఉందని చెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 'పుష్ప' ప్రమోషన్లలో భాగంగా చెన్నై వెళ్లిన ఆయన.. తన హోమ్​ స్టేట్​లో విజయం అందుకోవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నట్లు తెలిపారు.

pushpa movie
అల్లు అర్జున్
author img

By

Published : Dec 14, 2021, 8:00 PM IST

Pushpa Movie: బాలీవుడ్‌ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నా.. కోలీవుడ్‌లో విజయం అందుకోవడమే తన కల అని అల్లు అర్జున్‌(Allu arjun) అన్నారు. 'పుష్ప'(Pushpa) టీమ్‌ చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొని ఆయన మాట్లాడారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రమిది. రష్మిక కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 17న విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తమిళ ప్రేక్షకులు, హీరోల గురించి అల్లు అర్జున్‌ ఏమన్నారంటే..

pushpa movie
ప్రెస్​మీట్​లో అల్లు అర్జున్

ఆయన గురించి తర్వాత చెప్తా..

"'అల వైకుంఠపురములో' సినిమా పూర్తయ్యాక 'పుష్ప' మొదలుపెట్టా. 45 రోజుల్లో పుష్పరాజ్‌గా మారా. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డా. మేకప్‌ వేసుకునేందుకు 2 గంటలు, దాన్ని తీసేందుకు 40 నిమిషాల సమయం పట్టేది. ఫహద్ ఫాజిల్‌ నటన అద్భుతం. ఆయన పెర్ఫామెన్స్‌కి ఫిదా అయిపోయా. తన గురించి ఇంకా చాలా విశేషాలు కేరళ (మలయాళ భాషకు సంబంధించి) ప్రచారంలో పంచుకుంటా. కథానాయిక రష్మిక తన పాత్రతో మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా"

pushpa movie
రష్మిక, బన్నీ

ఎప్పటి నుంచో అనుకుంటున్నా..

"నా తెలుగు చిత్రాలు డబ్‌ అయి యూట్యూబ్‌ వేదికగా హిందీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. నన్ను పరోక్షంగా బాలీవుడ్‌కి పరిచయం చేశాయి. అయినా నాకు మాత్రం ఇక్కడే (తమిళనాడు) గెలవాలనుంది. నా హోమ్‌ స్టేట్‌లో విజయం అందుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. పాటల వల్ల ఈ సినిమా కోలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇందుకు నా స్నేహితుడు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి థ్యాంక్స్‌"

pushpa movie
'పుష్ప'లో ఐకాన్ స్టార్

బెస్ట్‌ డ్యాన్సర్స్‌..

"తమిళ చలన చిత్ర పరిశ్రమలో కమల్‌ హాసన్‌, విజయ్‌, ధనుష్‌, శింబు, శివకార్తికేయన్‌ బాగా డ్యాన్స్‌ చేస్తారనేది నా అభిప్రాయం. శివకార్తికేయన్‌ నటించిన 'డాక్టర్‌' సినిమాని ఇటీవల చూశాను. ఆ సినిమా నన్నెంతగానో ఆకట్టుకుంది. ఇందులోని 'చెల్లమ్మ' పాట నా మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది" అని అల్లు అర్జున్‌ అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి:

అది చేసింది నేనేనా అనిపిస్తుంది: రష్మిక

ఫ్యాన్స్ పై లాఠీఛార్జ్​.. స్పందించిన బన్నీ

Case on pushpa pre release event: "పుష్ప" ప్రీ రిలీజ్​ ఈవెంట్​.. నిర్వాహకులపై కేసు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.