ETV Bharat / sitara

Pushpa Team met governor Tamilisai : పుష్ప చిత్రాన్ని వీక్షించాలని గవర్నర్‌ తమిళిసైకి ఆహ్వానం - Pushpa Team met governor Tamilisai

Pushpa Team met governor Tamilisai : గవర్నర్‌ తమిళిసైని నిర్మాత అల్లు అరవింద్, సినీ దర్శకుడు సుకుమార్ ఇవాళ కలిశారు. పుష్ప చిత్రాన్ని వీక్షించాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. సినిమా కోసమే కలిసినట్లు దర్శకుడు సుకుమార్ తెలిపారు.

Allu Aravind, Sukumar met governor, puspa team
పుష్ప చిత్రాన్ని వీక్షించాలని గవర్నర్‌ తమిళిసైకి ఆహ్వానం
author img

By

Published : Dec 29, 2021, 2:03 PM IST

Updated : Dec 29, 2021, 2:55 PM IST

Pushpa Team met governor Tamilisai : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రాన్ని వీక్షించాలని గవర్నర్‌ తమిళిసైని.. సినీనిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్ ఆహ్వానించారు. రాజ్‌భవన్‌ వెళ్లిన అల్లు అరవింద్‌, సుకుమార్‌.. పుష్ప సినిమా కథాంశాన్ని గవర్నర్‌కు వివరించారు. చిత్రాన్ని చూడాలని ఆహ్వానించగా.. సుముఖత తెలిపారని సుకుమార్ వెల్లడించారు.

పుష్పా సినిమా చూడాలని గవర్నర్​ను ఆహ్వానించడానికి వచ్చాం. జనవరి మొదటి వారంలో ఆమె సినిమా చూడబోతున్నారు. కేవలం సినిమా గురించి మాత్రమే వచ్చాం. అంతకుమించి ఏం లేదు.

-సుకుమార్, దర్శకుడు

పుష్ప చిత్రాన్ని వీక్షించాలని గవర్నర్‌ తమిళిసైకి ఆహ్వానం

ఓటీటీ ఎప్పుడంటే?

Pushpa OTT: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమా అమెజాన్​ ప్రైమ్​ వేదికగా ఓటీటీలో రిలీజ్ కానుంది. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

కలెక్షన్లు ఇలా..

Pushpa Movie: తెలుగు సినిమాల కలెక్షన్లను హిందీ సినిమాలు కూడా అందుకోలేకపోతున్నాయని బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యానించారు. అందుకు అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' సినిమానే ఉదాహరణగా చూపించారు. సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ నటించిన 'పుష్ప' చిత్రం.. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. బాలీవుడ్‌లో ఈ చిత్రంతో.. బన్నీకి మరింత క్రేజ్‌ పెరిగింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సినిమాపై, బన్నీపై ప్రశంసలు కురిపించగా.. ఇటీవలే కరణ్‌ జోహార్‌ కూడా కొనియాడారు. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ 'పుష్ప'కి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయని అన్నారు. బన్నీకి బాలీవుడ్‌లో ఆ స్టార్‌డమ్‌ రావడానికి గల కారణాన్ని కూడా కరణ్‌ వివరించారు.

ఇదీ చదవండి: 'పుష్ప' థ్యాంక్స్​ మీట్​.. కన్నీరు పెట్టుకున్న బన్నీ, సుకుమార్​​

Last Updated : Dec 29, 2021, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.