ETV Bharat / sitara

బాలయ్య-బోయపాటి చిత్రంలో అల్లరి నరేశ్!

author img

By

Published : Sep 15, 2020, 7:15 PM IST

'మహర్షి' సినిమాలో మహేశ్​ స్నేహితుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు అల్లరి నరేశ్. ఇప్పుడు ఇతడు బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడట.

Allari Naresh to play crucial role in Balayya-Boyapati film
బాలయ్య-బోయపాటి చిత్రంలో అల్లరి నరేశ్!

'మహర్షి' చిత్రంలో మహేశ్ బాబుకు స్నేహితుడిగా ఓ చక్కటి పాత్రలో కనిపించి మెప్పించాడు అల్లరి నరేశ్. ఇప్పుడతడు మరో క్రేజీ ఛాన్స్‌ కొట్టేసినట్లు చిత్ర సీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 'సింహా', 'లెజెండ్‌' వంటి హిట్‌ల తర్వాత వీళ్ల కలయికలో వస్తోన్న మూడో చిత్రమిది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అల్లరి నరేశ్‌ను సంప్రదిస్తోన్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు సహాయకుడిగా కనిపించబోయే ఈ పాత్ర ఆద్యంతం వినోదాత్మకంగా ఉండబోతుందని, అందుకే ఈ పాత్రకు నరేశ్ సరిగ్గా సరిపోతాడని చిత్రబృందం భావించినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే బోయపాటి అతడికి ఆ పాత్ర గురించి తెలియజేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అల్లరి నరేశ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.