ETV Bharat / sitara

'ప్రాణం పోయినా సరే.. న్యాయమే గెలవాలి' - అల్లరి నరేష్ నాంది

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నాంది'. తాజాగా ఈ సినిమా నుంచి 'బ్రీత్ ఆఫ్ నాంది' పేరుతో విడుదలైన ఓ వీడియో ఆకట్టుకుంటోంది.

Allari Naresh 'Breathe of Naandi' gets huge praise
'ప్రాణం పోయినా సరే.. న్యాయమే గెలవాలి'
author img

By

Published : Nov 6, 2020, 8:53 PM IST

"15 లక్షల మంది ప్రాణ త్యాగం చేసుకుంటే కానీ మన దేశానికి స్వాతంత్య్రం రాలేదు. 1300 మందికిపైగా బలిదానం చేసుకుంటే కానీ ఓ కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. ప్రాణం పోకుండా న్యాయం గెలిచిన సందర్భం చరిత్రలోనే లేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి" అని నినదిస్తున్న ఓ యువకుడి కథే 'నాంది'. అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమిది. విజయ్‌ కనకమేడల దర్శకుడు. తాజాగా 'బ్రీత్‌ ఆఫ్‌ నాంది' పేరుతో ఓ వీడియో విడుదలైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పైన ప్రస్తావించిన సంభాషణలు నరేష్‌ పలికినవే. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించి, సినిమాపై అంచనాలు పెంచుతోందీ టీజర్‌. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని పాత్రను ప్రేక్షకుల ముందుకు త్వరలోనే తీసుకురాబోతున్నాడు నరేష్‌. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్, ప్రియదర్శి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, హరీశ్‌ ఉత్తమన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.