ETV Bharat / sitara

మీర్జాపుర్ నిర్మాతలకు ఊరట.. అరెస్ట్​ నిలిపివేసిన కోర్టు - మీర్జాపుర్​పై విమర్శలు

మీర్జాపుర్ వెబ్​సిరీస్ నిర్మాతలకు ఊరట లభించింది. తమ ప్రాంతాన్ని తప్పుగా చూపించారని ఓ వ్యక్తి కేసు నమోదు చేయగా దీనిపై విచారించిన అలహాబాదు కోర్టు నిర్మాతల అరెస్టును తాత్కాలికంగా నిలిపివేసింది. మార్చి మొదటి వారానికి విచారణ వాయిదా వేసింది.

Allahabad HC stays arrest of Mirzapur web series' producers
మీర్జాపుర్ నిర్మాతలకు ఊరట
author img

By

Published : Jan 30, 2021, 11:24 AM IST

మీర్జాపుర్ నిర్మాతలకు ఊరట లభించింది. ఈ సిరీస్​లో తమ ప్రాంతాన్ని ఉన్నదాని కంటే విరుద్ధంగా చూపించారని, వెంటనే ఆ సిరీస్​ను నిషేధించాలని విమర్శలు వచ్చాయి. ఓ వ్యక్తి ఇదే విషయమై కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసును విచారించిన అలహాబాద్​ కోర్టు నిర్మాతలు రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్​ల అరెస్టును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విచారణలో పాల్గొనాలని వారికి ఆదేశించింది. విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.

గ్యాంగ్​స్టర్​ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్​ మీర్జాపుర్​ విశేషాదరణ దక్కించుకుంది. కానీ ఈ మధ్యకాలంలో దీనిపై చాలా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అలాగే అశ్లీలత, హింస ఇందులో మితిమీరిపోయిందని పలువురు మండిపడ్డారు. 'బ్యాన్​మీర్జాపూర్' అంటూ సోషల్ మీడియాలో పోస్టులూ పెట్టారు.

ప్రస్తుతం ఈ సిరీస్​కు సంబంధించిన రెండు సీజన్లు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. కల్పిత సంఘటనల ఆధారంగా దీనిని రూపొందించారు. పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్ దర్శకులు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.