టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమయపోయింది. కొన్నాళ్లుగా సరైన కథ, దర్శకుడి కోసం వెతికిన గల్లా ఫ్యామిలీకి దర్శకుడు దొరికాడు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్టర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. 'భలే మంచి రోజు', 'దేవదాస్', 'శమంతకమణి' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీరామ్.

నవంబర్ 10న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాను గల్లా పద్మావతి నిర్మించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా చేస్తోందని టాక్. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించనున్నాడు.
ఇవీ చూడండి.. 'అల వైకుంఠపురములో' మలయాళ ఫస్ట్‌లుక్ ఇదిగో..