డ్రగ్స్ కేసులో బాలీవుడ్ మొత్తాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శించడం సరికాదని ప్రముఖ కథానాయకుడు అక్షయ్ కుమార్ చెప్పారు. 'బెల్ బాటమ్' షూటింగ్‌ను విదేశాల్లో పూర్తి చేసుకుని, ఇటీవలే ముంబయి వచ్చిన ఈయన.. ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలను చెబుతూ ఓ వీడియోను ట్వీట్ చేశారు.
-
Bahot dino se mann mein kuch baat thi lekin samajh nahi aa raha tha kya kahoon, kisse kahoon. Aaj socha aap logon se share kar loon, so here goes... #DirectDilSe 🙏🏻 pic.twitter.com/nelm9UFLof
— Akshay Kumar (@akshaykumar) October 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bahot dino se mann mein kuch baat thi lekin samajh nahi aa raha tha kya kahoon, kisse kahoon. Aaj socha aap logon se share kar loon, so here goes... #DirectDilSe 🙏🏻 pic.twitter.com/nelm9UFLof
— Akshay Kumar (@akshaykumar) October 3, 2020Bahot dino se mann mein kuch baat thi lekin samajh nahi aa raha tha kya kahoon, kisse kahoon. Aaj socha aap logon se share kar loon, so here goes... #DirectDilSe 🙏🏻 pic.twitter.com/nelm9UFLof
— Akshay Kumar (@akshaykumar) October 3, 2020
"మీడియాతో పాటు ప్రజలందరూ బాలీవుడ్‌ను లక్ష్యంగా పెట్టుకుని, విమర్శించడం సరికాదు. వ్యతిరేకత ఎక్కువైన ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో తెలియడం లేదు. భారతీయ సంస్కృతి సంప్రదాయలు ప్రతిబింబించేలా మేం(బాలీవుడ్) సినిమాలు తీస్తున్నమనే విషయాన్ని మీడియా, నెటిజన్లు గుర్తించాలి" -అక్షయ్ కుమార్, బాలీవుడ్ హీరో
యువనటుడు సుశాంత్ సింగ్ మృతి తర్వాత డ్రగ్స్ ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ విషయంలో బాలీవుడ్‌లోని కొందరు నటీనటులతో పాటు మీడియా, నెటిజన్లు.. ఇండస్ట్రీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
'బెల్ బాటమ్' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో వాణీ కపూర్, హ్యుమా ఖురేషి హీరోయిన్లుగా నటించారు. రంజిత్ తివారీ దర్శకత్వం వహించారు.