దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ-హీరోయిన్ దీపికా పదుకొణె మధ్య విభేదాలు వచ్చాయా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. తనకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన దర్శకుడికి ఈ ముద్దుగుమ్మ నో చెప్పడమే ఇందుకు కారణమని తెలిసింది.
అసలేం జరిగిందంటే?
భన్సాలీ.. ప్రస్తుతం ఆలియా భట్ ప్రధాన పాత్రలో 'గంగూబాయ్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం దీపికను ఆయన సంప్రదించారట. ఈ అవకాశాన్ని ఆమె తిరస్కరించింది!. ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్ కోసం కూడా అడగగా.. దానికి కూడా నో చెప్పిందట. దీంతో భన్సాలీకి.. ఆమెతో విభేదాలు వచ్చాయని తెలిసింది. ఇక రణ్బీర్ కపూర్, ఆలియా భట్, దీపికతో తాను తెరకెక్కించబోయే 'బైజు బవ్రా' నుంచి ఆమెను తొలగించే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
సంజయ్-దీపిక కాంబోలో తెరకెక్కిన 'రామ్లీలా', 'బాజీరావు మస్తానీ', 'పద్మావత్' చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.
ఇదీ చూడండి : దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం