ETV Bharat / sitara

ఆ పెళ్లిలో అవమానం జరిగింది.. ఏడ్చేశా: షకీలా - షకీలా వార్తలు

ఆలీ వ్యాఖ్యాతగా 'ఈటీవీ'లో ప్రసారమవుతున్న 'ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి తాజాగా షకీలా, అనురాధ విచ్చేశారు. తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

alitho saradaga special chat show with Anuradha and Shakeela
ఆ పెళ్లిలో అవమానం జరిగింది.. ఏడ్చేశా: షకీలా
author img

By

Published : Jan 28, 2021, 5:56 PM IST

తమ అందచందాలతో.. స్పైసీ డ్యాన్సులతో నిన్నటితరం కుర్రకారు మతులు పోగొట్టిన అందాల నటీమణులు వీరు. మన్మథుడిని సైతం తమ సోగ కళ్లతో కట్టిపడేయగల వయ్యారి భామలు. వారే అనూరాధ, షకీలా! అందంతో పాటు మంచి మనసున్న వీరి జీవితాల్లోని సంతోషాలను, కష్టనష్టాలను పంచుకోవడానికి 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేశారు. మరి ఆ సంగతులేంటో చూద్దామా!

మీ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ఎలా ఉంది?

అనూరాధ: అలా మెల్లిగా సాగిపోతూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఉదయనిధి స్టాలిన్‌తో తమిళంలో ఓ సినిమా చేశాను. ఖుష్బూ ప్రొడక్షన్‌లో ఓ సీరియల్‌ చేస్తున్నాను. వివిధ రకాల పాత్రలు వస్తున్నాయి.

సిల్క్‌ స్మిత హవా నడుస్తున్న కాలంలో కెరీర్‌ ప్రారంభించారు. ఎలా అనిపించేది?

అనూరాధ: అవును. అప్పట్లో సిల్క్‌ స్మిత హవా బాగా ఉండేది. అయితే ఆమె కంటే ఎక్కువ సినిమాల్లో నేనే నటించా. మొత్తం 5 భాషల్లో కలిపి 700 చిత్రాల్లో నటించా.

మీ కుటుంబం గురించి?

అనూరాధ: అమ్మ, నాన్న ఇద్దరూ చిత్రపరిశ్రమలోనే ఉండేవారు. అమ్మ హెయిర్‌ డ్రెస్సర్‌గా, నాన్న కొరియోగ్రాఫర్‌గా పనిచేసేవారు. అమ్మ సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు. నాన్న మహారాష్ట్రకు చెందినవారు. కానీ, స్థిరపడింది మాత్రం చెన్నైలోనే. నాకో తమ్ముడు. అమెరికాలో స్థిరపడ్డాడు. వారానికొకసారి ఫోన్‌లో మాట్లాడుకుంటాం. ఇక నా కూతురు అభినయశ్రీ ఇండస్ట్రీలోని వ్యక్తే. ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తూ, కొరియోగ్రఫీ కూడా చేస్తోంది.

షకీలా: మా తల్లిగారిది నెల్లూరు, తండ్రిది చెన్నై. మొత్తం మేం ఏడుగురు సంతానం. నేను ఐదో దాన్ని.

సులోచన.. అనూరాధగా ఎలా మారింది?

అనూరాధ: మలయాళంలో 'ఇనియవళ్‌ ఒరంగటి' అనే చిత్రం చేస్తున్నప్పుడు దర్శకుడు కె.సి.జార్జ్‌ నా పేరును మార్చారు. ఆ మూవీలో హీరోయిన్‌గా చేశా. అప్పట్లో సులక్షణ అనే మరో హీరోయిన్‌ ఉండేది. మా పేర్లలో పెద్దగా తేడా లేదని గ్రహించిన ఆయన అనూరాధగా పేరు మార్చారు. 32 చిత్రాల్లో హీరోయిన్‌గా నటించాను. కానీ, పెద్దగా పేరు రాలేదు. ఆ సమయంలోనే ఒక మలయాళ చిత్రంలో హోటల్‌లో డ్యాన్స్‌ వేసే హీరోయిన్‌గా నటించాను. అది పెద్ద హిట్టయ్యింది. దీంతో డ్యాన్స్‌మాస్టర్‌ రఘుగారు తమిళంలోనూ నన్నే చేయమన్నారు. మా అమ్మ, నేనూ.. హీరోయిన్‌ పాత్రలు మాత్రమే చేస్తామని వారికి చెప్పాం. ఆయన దానికి సమాధానంగా 'సినీ పరిశ్రమలోకి వచ్చాక.. నేను ఈ క్యారెక్టర్లు మాత్రమే చేస్తానని పట్టు పట్టకూడదు' అంటూ మంచిగా వివరించారు. ఆ టైమ్‌లో సిల్క్‌ టాప్‌లో ఉండేది. అయినా డ్యాన్సర్‌గా నేను చాలా పెద్ద సక్సెస్‌ చూశాను.

సుమారు 15 కేజీల బరువు తగ్గినట్లున్నారు? మీ ప్లాన్స్‌ ఏంటి?

షకీలా: ప్లాన్లంటూ ఏమీలేవు. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్లటమే.

ఇద్దరూ కలిసి ఏవైనా చిత్రాల్లో నటించారా?

ఇద్దరూ: ఓ తమిళ చిత్రంలో నటించాం.

ఇంతకు ముందే మీకు పరిచయం ఉందా?

అనూరాధ: తను చెల్లెల్లాంటిది. ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే తను మాత్రం చెయ్యదు. నేనే ఫోన్‌ చేసి తిడుతూ ఉంటా. ఒక ఫోన్‌ కాలైనా చెయ్యవా అంటూ కోప్పడతా! వెంటనే 'నేను చేస్తా అక్క' అంటుంది. కానీ మళ్లీ చేయదు. మధ్యలో షకీలా అందుకుని.. మర్చిపోవడం కాదు! అక్క బిజీగా ఉంటారు అందుకే.. (నవ్వులు)

ఎన్ని భాషల్లో నటించారు?

షకీలా: ఒకట్రెండు మినహా దాదాపు అన్ని భాషల్లో నటించాను. మొత్తం కలిపి 400 చిత్రాల దాకా చేశా.

మీ పోస్టర్స్‌ చూసి బయట ఇబ్బంది పడిన రోజులున్నాయా?

షకీలా: అస్సలు ఇబ్బంది పడలేదు. చాలా సంతోషమేసేది. కెరీర్‌ ప్రారంభంలో చిత్రాలు చేస్తున్నపుడు, పోస్టర్‌పై నా బొమ్మ నేనే గుర్తుపట్టలేనంత చిన్నగా ఉండేది. స్టార్‌డమ్‌ వచ్చాక కేవలం నా ఫొటో మాత్రమే పోస్టర్‌పై ఉండేది. చాలా ఆనందపడేదాన్ని. అస్సలెప్పుడూ బాధపడలేదు!

ఈ వయసులో కూడా వీడియోగేమ్‌ ఆడతారట?

షకీలా: అవును! ఆ విషయం అనూరాధ అక్కకు కూడా తెలుసు. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోం. వారి గురించి చర్చించుకోం. నాకేదైనా అనారోగ్యం వస్తే అనూ అక్క ఏ సమయంలోనైనా మా ఇంటికొచ్చి, నన్ను జాగ్రత్తగా చూసుకునేది. ఒకానొక టైంలో నేను ఏది తిన్నా కారంగా అనిపించేది. క్యాన్సరేమోనని భయపడ్డా. అక్క దగ్గర ఏడ్చాను కూడా. అప్పుడు అక్క వెంటనే నా దగ్గరకొచ్చి 'నీకు ఒంట్లో సరిపడా రక్తం లేదు. వెంటనే వైద్యం చేయిద్దాం' అంటూ నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ చేయించింది. అనూ అక్క నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకునేది. ఇప్పుడూ ఆ అనుబంధం కొనసాగుతోంది.

సొంత సోదరి కొడుకు పెళ్లికి వెళ్లి అవమాన పడ్డారట?

షకీలా: అవును. మా అక్క నా దగ్గరకొచ్చి స్వయంగా పెళ్లికి పిలిచింది. ఆమె కొడుకు చదువుకయ్యే ఖర్చంతా నేనే భరించా. కానీ, ఆ రోజు పెళ్లికి వెళ్తే తీవ్ర అవమానం జరిగింది. అప్పుడు పెళ్లిలో మా బంధువులంతా ఉన్నారు. గిఫ్ట్‌ ఇచ్చి వారికి శుభాకాంక్షలు చెప్పి వచ్చేద్దామని స్టేజ్‌ పైకి వెళ్లాను. సరిగ్గా ఆ సమయంలో పెళ్లికూతురు స్టేజ్‌మీద లేకుండా కిందకు వెళ్లింది. బహుశా టాయిలెట్‌కు వెళ్లిందేమోననుకున్నా. మళ్లీ కాసేపయ్యాక పెళ్లికూతురు వస్తే స్టేజ్‌వైపు వెళ్లా. ఇంతలో మా అక్క నాకు అడ్డంగా నిలబడింది. నేను ఎలాగో ఆ గిఫ్ట్‌ను అతడికి అందిస్తే ఎడమచేత్తో తీసుకుని వెనక్కు పడేశాడు. నేనక్కడే ఏడ్చేశాను. వెంటనే బయటకొచ్చేశాను. వాళ్లు నన్ను కలవడానికి ఇష్టపడటం లేదని ఆ తర్వాత నాకు అర్థమైంది. ఏమో నా వృత్తి పట్ల తప్పుగా భావించారేమో! తర్వాత మా అక్క ఫోన్‌ చేసి క్షమించమని అడిగింది. అందరి ముందు అవమానించి.. ఫోన్‌లో క్షమించమని అడిగింది. అక్క ముగ్గురు పిల్లల చదువులకు అయిన ఖర్చంతా నేనే భరించా. మా పెదనాన్న ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన డబ్బంతా నేనే ఇచ్చా. ఆయన కూడా అక్కడే ఉన్నాడు. కానీ, నాకు అవమానం జరుగుతుంటే స్పందించలేదు. మొన్నీమధ్య మా అక్క కొడుకు భార్య నాకు ఫోన్‌ చేసింది. 'ఆంటీ మా ఆయన ఎక్కడున్నాడో తెలుసా?' అని అడిగింది. 'నాకెలా తెలుస్తుందమ్మా మీ ఆయన గురించి, అప్పుడే మీ గురించి ఆలోచించడం మానేశా' అన్నాను. అప్పుడామె 'క్షమించండి ఆంటీ.. అప్పుడు మీకు చేసిన అవమానానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆయన నన్ను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. మీరు కల్పించుకుని మా ఇద్దరిని కలపండి' అంటూ వాపోయింది. ఇవన్నీ చూశాక నేను చెప్పేది ఒకటే.. ఈ రోజుల్లో మనం ఏదైనా పాపం చేస్తే వెంటనే అది మనకు తగులుతుంది. అందుకే ఎవ్వరినీ తెలిసి అవమానించకండి.

మీరేవైనా కష్టాలు పడ్డారా?

అనూరాధ: నా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. అమ్మ ఉన్నంతకాలం ఆమె నాకు రక్షణగా ఉండేది. ఆవిడ పోయాక అనేక ఇబ్బందులకు ఎదురొడ్డి నిలిచాను. మానసికంగా దృఢమయ్యాను.

అభినయశ్రీకి వివాహం అయ్యిందా? మీ కుమారుడు ఏం చేస్తున్నాడు?

అనూరాధ: లేదు. వచ్చే ఏడాది చేద్దామని అనుకుంటున్నాం. మా అబ్బాయి ప్రస్తుతం సత్యం గ్రూప్స్‌లో జాబ్‌ చేస్తున్నాడు.

ఒక చిన్న డైలాగ్‌ చెప్పడానికి 16 టేక్‌లు తీసుకున్నారట?

అనూరాధ: అవును. ఒక తమిళ చిత్రంలో ‘రండి.. రండి.. కూర్చోండి’ అనే డైలాగ్‌ చెప్పడానికి 16 టేక్‌లు తీసుకున్నా. ఆ చిత్రానికి జయశంకర్‌ గారు దర్శకులు. అప్పట్లో నేను డైలాగ్స్‌ చదువుకుని ఎలాంటి మాడ్యులేషన్‌ లేకుండా చెప్పేసేదాన్ని. ఆ ఒక్క సీన్‌కు సెట్లో వాళ్లంతా తిట్టారు. (ఆలీ అందుకుని.. అలాంటి అనూరాధ ఎంతో నేర్చుకుని 700 చిత్రాలు చేయడం ఎంతో స్ఫూర్తిమంతం)

మీకు బాగా పేరు తీసుకొచ్చిన ఐటమ్‌ సాంగ్‌ ఏది?

అనూరాధ: ఎన్నో పాటలు నాకు బాగా పేరు తీసుకొచ్చాయి. చిరంజీవిగారితో కలిసి ‘మగమహారాజు’లో నటించాను. ఆ చిత్రం నాకు బాగా గుర్తింపును ఇచ్చింది. శోభన్‌బాబుగారితో కూడా నటించాను. రోజూ మూడు షిప్టుల్లో, మూడు భాషల్లో నటిస్తూ ఉండేదాన్ని. 1986లో మొత్తం అయిదు భాషల్లో కలిపి 87 సినిమాల్లో నటించా. పగలు రెండు పాటల్లో నటించేదాన్ని. మలయాళం సినిమాలు రాత్రిపూట షూట్‌ చేసేవారు. వాళ్లు రాత్రి 9 గంటలకు ప్రారంభిస్తే.. ఉదయం ఆరుకల్లా ఒక సాంగ్‌ను షూట్‌ చేసేసేవారు. అప్పట్లో రెండురోజుల్లో 160 షాట్లు చిత్రీకరించేవారు. ఇప్పుడు అంతా మారిపోయింది. రోజుకు కేవలం 6 షాట్లు తీయడమే గొప్పగా భావిస్తున్నారు. ఆ 87 చిత్రాల్లో పాటలతో పాటు, కామెడీ పాత్రలు, వ్యాంప్‌ క్యారెక్టర్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా నటించా.

తెల్లగా కనిపించడానికి ఏదో మేకప్‌ ట్రిక్‌ చేసేవారట?

అనూరాధ: నేను, సిల్క్‌ నల్లగా ఉండేవాళ్లం. జయమాలిని, జ్యోతి లక్ష్మి మాత్రం తెల్లగా ఉండేవాళ్లు. అయినా, వారు ఎక్కువగా మేకప్‌ వేసుకునేవాళ్లు. అందువల్ల వాళ్ల పక్కన నిలబడితే చాలా డల్‌గా కనిపించేవాళ్లం. అందుకే తెల్లగా కనిపించేందుకు మా అమ్మగారు హెయిర్‌ డ్రెస్సర్‌ కనుక మేకప్‌లో ట్రిక్‌ చేసేవారు. జయమాలిని, జ్యోతిలక్ష్మి మేకప్‌లో ఒంటిపై పాన్‌కేక్‌ వేసేవాళ్లు. మేం మాత్రం గ్రీస్‌ టిక్‌ అనే ఒక ఆయిల్‌ లాంటి పదార్థాన్ని ఒంటిపై రాసుకునే వాళ్లం. ఆపై పాన్‌కేక్‌ వేసేవాళ్లం. ఆ తర్వాత పౌడర్‌ దట్టంగా వేసేవాళ్లం. ఫేస్‌కు మాత్రం రెగ్యులర్‌ మేకప్‌ వేసుకునే వాళ్లం. పొద్దున్నే లేవగానే షూట్‌కు రెడీ అయ్యేముందు ఈ తతంగమంతా నడిచేది. నాకు మేకప్‌ ఆర్టిస్ట్‌లుగా పనిచేసిన వారివల్లే సక్సెస్‌ సాధించగలిగాను. వారికెప్పుడూ నేను రుణపడి ఉంటా. నేను నలుపు అన్న విషయం మా కుటుంబ సభ్యులకు తప్ప ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. (నవ్వులు)

మీ డ్యాన్సర్ల మధ్య పోటీ ఉండేదా? ప్రేమాభిమానం ఉండేదా?

అనూరాధ: ప్రేమాభిమానాలే ఎక్కువ. జ్యోతిలక్ష్మి, జయమాలినిగారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. సిల్క్‌ అయితే మొదట్లో రెండున్నరేళ్ల పాటు నాతో మాట్లాడలేదు. నేను, సిల్క్‌తో కలిసి ‘బోళా శంకరుడు’ చేశా. అప్పుడు కూడా మాట్లాడేది కాదు. ఇద్దరం కలిసి డ్యాన్స్‌ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. ‘నేను బాగానే చేస్తున్నాను, తనకే రావట్లేదు’ అంటూ సిల్క్‌ అనేది. పాపం శివశంకర్‌ మాస్టర్‌ ‘అమ్మా.. అమ్మా’ అంటూ బతిమలాడుకుంటూ ఉండేవారు. ఆవిడ తత్వం అంతే. అంతా ఆమెకు పొగరనుకుంటారు. కానీ, సిల్క్‌ ఎంతో మంచి వ్యక్తి. ఒకసారి ఆమె సొంత సినిమాలో నేను నటించాల్సి ఉంది. తన మేనేజర్‌ని పిలిచి.. ‘అనూ రెగ్యులర్‌గా ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటారో అంతే ఇవ్వండి. ఏ హోటల్‌లో రూమ్‌ కావాలంటారో అక్కడే బుక్‌ చేయండి. ఎక్కడా ఆమెకు అసౌకర్యం కలగనివ్వొద్దు’ అని అన్నారట. మాతో పాటు ఆ చిత్రంలో శాంతి శ్రీహరి కూడా నటించారు. షూటింగ్‌లో భాగంగా నటుడు భీమరాజు నన్ను ఎత్తి కిందపడేశారు. దాంతో నా కాలికి గాయమైంది. వెంటనే సిల్క్‌ అక్కడకు వచ్చి నా కాలికి స్ప్రే కొట్టి సపర్యలు చేశారు. భీమరాజును బాగా తిట్టారు. ‘మేమంతా లేడీ ఆర్టిస్టులం. కాళ్లూ చేతులు బాగుంటేనే ఎంతో కొంత సంపాదించుకుంటాం. ఆమె ఇప్పుడు ఎంతో బిజీ ఆర్టిస్టు.. మీరు అలా కాళ్లూ చేతులు విరగ్గొడితే ఎలా’ అంటూ ఆయనపై విరుచుకుపడింది. అప్పటి నుంచి మేమిద్దరం చాలా ఆప్యాయంగా ఉండేవాళ్లం.

ఒక డ్యాన్స్ ‌మాస్టర్‌ మిమ్మల్ని పేడ తొక్కినట్టు మూమెంట్‌ చేస్తున్నావ్‌ అన్నారట?

అనూరాధ: అవును. అప్పుడు హీరోయిన్‌గా తెలుగులో మొదటి చిత్రం చేస్తున్నాను. తమిళంలో బాగా హిట్టైన ఒక చిత్రాన్ని ‘పంచ కల్యాణి’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. చంద్రమోహన్‌గారు హీరో. ఆయన స్పీడ్‌గా ఆడేస్తున్నారు. నేనేమో కాలు కదపలేకపోతున్నాను. టెన్షన్‌ వచ్చేసింది. అదంతా చూసిన డ్యాన్స్‌ మాస్టర్‌ ‘ఎవరండీ హీరోయిన్‌గా ఈ అమ్మాయిని పెట్టింది. డ్యాన్స్‌ చేయమంటే పేడ తొక్కినట్టు చేస్తోంది’ అన్నారు. ఆ తర్వాత వాళ్లే ఒక సినిమాలో పాటకు డ్యాన్స్‌ చేసేందుకు తీసుకున్నారు. ఆ పాట చాలా వేగంగా ఉంటుంది. అనూ అయితేనే కరెక్ట్‌ అని వాళ్లు అన్నారట. ఆ ఇద్దరు డ్యాన్స్‌ మాస్టర్లే ఇప్పుడు నాకు ఎంతో ఆత్మీయులు.

మలయాళంలో మీ మొదటి సినిమా ఏది?

షకీలా: మలయాళంలో ‘హలో గుడ్‌మార్నింగ్‌’ నా మొదటి సినిమా. అప్పట్లో నాకు మలయాళం వచ్చేది కాదు. షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆ సినిమా డైరెక్టర్‌ నన్ను తీవ్రంగా తిట్టేవారు. దాంతో మలయాళం సినిమాలు చెయ్యనని నాన్నతో చెప్పా. కొంతకాలానికి నాన్న చనిపోయారు. ఆ బాధలో ఉన్నప్పుడే ‘కిన్నెర తంభి’ చిత్రం ఆఫర్‌ వచ్చింది. అందులో వాళ్లు నాకు 35 ఏళ్ల వయసున్న మహిళ పాత్ర ఇచ్చారు. కానీ, అప్పుడు నా వయసు 22 ఏళ్లు. ఆ సమయంలో నేను ఒకరితో ప్రేమలో ఉన్నా. అతను నన్ను స్లిమ్‌గా మారమని చెబుతూ ఉండేవాడు. అందుకోసం నాకు డ్యాన్స్‌ క్లాస్‌లు కూడా ఏర్పాటు చేశాడు. (మధ్యలో ఆలీ కల్పించుకుని ఎవరా వ్యక్తి? అని అడిగారు) అతను ఇప్పుడు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు. ఈ కారణాలన్నింటితో నేను మొదట ఒప్పుకోవద్దనుకున్నా. కానీ, మా అమ్మ నాతో ‘ఇంకా ఎన్నాళ్లు ఇలాగే ఉంటావు. ఇదే కొనసాగితే మనకు తినడానికి అన్నం కూడా దొరకదు. ఆలోచించు’ అంటూ కోప్పడింది. ఆ కోపంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నా. అది సూపర్‌హిట్‌గా నిలిచి నా కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్‌ సాధించింది.

చైనా, శ్రీలంక, నేపాల్‌లో కూడా మీకు అభిమానులున్నారటగా..?

షకీలా: అవును. నా చిత్రాలన్నీ అక్కడ డబ్‌ అయ్యేవి. వారు కూడా నన్ను ఎంతో ఆరాధించేవారు.

ఆర్థికంగా అంతా బాగానే ఉందా?

షకీలా: నేను సంపాదించుకున్న దాంట్లోనే తింటున్నా. బ్యాంక్‌ బ్యాలెన్స్‌లు.. గట్రా ఏమీ లేవు. జీవితంలో పెద్దగా కోరికలు కూడా ఏమీ లేవు. ఉన్నంతకాలం ఇలా హ్యాపీగా గడిపేస్తా.

పెళ్లి చేసుకోకపోవడానికి ఏదైనా కారణముందా?

షకీలా: నా జీవితంలో ఒకసారి పెళ్లి తప్పిపోయింది. అసలు నాకు పెళ్లి మీద నమ్మకం లేదు. నేను ఎవ్వరితోనూ బంధానికి ఒప్పుకోను. ఎందుకంటే నేను గతంలో ఒక వ్యక్తిని ప్రేమించాను. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అతను తాగుతున్నాడని ఆరునెలలు దూరంగా పెట్టాను. అంతే! అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. నాకప్పుడు అనిపించింది.. ‘ఇద్దరం పదేళ్లు ప్రేమలో ఉన్నాం.. ఒక్క ఆరునెలలు దూరం పెడితే ఇలా చేశాడా? నిజంగా ప్రేమ ఎక్కడుంది? ఇలాంటి వాళ్ల కోసం నేనెందుకు ఏడవాలి?’ అనిపించింది.

అనూరాధ: ఏదైనా బంధం కొనసాగాలంటే ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. నా వైవాహిక జీవితంలో నేను సర్దుకుపోయాను కాబట్టి సతీష్‌తో (అనురాధ భర్త) నా బంధం బలంగా ఉంది. ఆయన మరణించాక ఎన్ని కష్టాలొచ్చినా పిల్లలను చూసుకుంటూ ఆనందంగా ఉన్నా. నాలో సర్దుకుపోయే గుణం ఉంది కాబట్టి.. నేను ఈ మార్గంలో ఉన్నా. కానీ, ఈమెకు వచ్చేవాళ్లే సర్దుకుపోవాలి. తను రాజీ పడదు. ఒక రకంగా ఆమె ఆలోచనే కూడా కరెక్ట్‌ కావొచ్చు.

షకీలా: ఎందుకంటే 15 ఏళ్ల వయసు నుంచి నా సంపాదనతోనే బతుకుతున్నా. ఎవ్వరూ నాకు ఏమీ చెయ్యలేదు. మరి అలాంటప్పుడు నేనెందుకు సర్దుకుపోవాలి. ఆ వచ్చేవాళ్లు నా సంపాదన తింటూ, నా ఆస్తిని అనుభవిస్తూ ఉంటే.. వాళ్లకెందుకు నేను సరెండర్‌ అవ్వాలి. అయినా ఇప్పుడు నా వయసు 43 సంవత్సరాలు. కొన్నాళ్లు పాటు సినిమాల్లో నటిస్తాను. ఆ తర్వాత అనూ అక్క దగ్గరకు వెళ్లిపోతా. అక్కడే ఉండిపోతాను.

మీ పెళ్లి తేదీ కూడా ఫిక్స్‌ అయ్యాక ఎందుకు క్యాన్సిల్‌ అయ్యింది?

షకీలా: నాకు ఏ సంవత్సరమో సరిగా గుర్తులేదు. కానీ, ఆ రోజు ఏప్రిల్‌ 11వ తేదీ. పెళ్లి తతంగానికి అంతా రెడీ చేశాం. పెళ్లి సమయానికి కూడా అతను తాగుతూనే ఉన్నాడు. అంతకు ముందు కూడా అలాగే ఉండేవాడు. అయినా, నాకూ ఒక జీవితం కావాలి.. తోడు కావాలని భరించాను. పెళ్లి టైమ్‌లో కూడా అలాగే చేస్తుంటే నేనది మంచి పద్ధతి కాదని చెప్పబోయా. దాంతో అతను ‘అసలు నిన్నెవడు పెళ్లిచేసుకుంటాడు’ అని అన్నాడు. దాంతో నాకు పీకలదాకా కోపమొచ్చింది. పక్కనే ఉన్న హ్యాంగర్‌ తీసుకుని చితకబాదా. దెబ్బకు అతని చర్మం కూడా ఊడిపోయింది. కిందకు తీసుకెళ్లి, కారులో పడేశా. డ్రైవర్‌కు అడ్రస్‌ చెప్పి ‘వీణ్ని అక్కడ పడెయ్‌’ అన్నాను. ఆ తర్వాత అతని తల్లి నాకు ఫోన్‌ చేసింది. వాళ్లబ్బాయిని పెళ్లి చేసుకోమని బతిమలాడింది. నాకొక బంగ్లా రాసిస్తానని చెప్పింది. నేను సమాధానంగా ‘ఇంత జరిగాక కూడా పెళ్లి చేసుకుంటే నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నట్టే. అయినా బంగ్లా రాసిస్తే ఏం చేసుకోను.. నడిమధ్యలో ఉరేసుకుని చావాలా?’ అంటూ చెడామడా కడిగేశా. అయినా ఇప్పటికీ అతని ఫ్యామిలీ మెంబర్స్‌ నాతో ఫోన్లో మాట్లాడతారు. అతని భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడుతుంది.

‘మహానటి’ ‘డర్టీ పిక్చర్‌’ సినిమాల క్లైమాక్స్‌ సీన్లు చూశాక ఏమనిపించింది?

షకీలా: ‘మహానటి’లో కొన్ని సీన్లు మా జీవితాలకు దగ్గరగా ఉన్నాయి. కానీ, ‘డర్టీ పిక్చర్‌’లో మాదిరి మాత్రం జరగలేదు. ముందుగా ‘డర్టీ పిక్చర్‌’ గురించి చెప్పాలంటే అక్కను క్షమాపణ అడుగుతున్నాను (అనూరాధను చూస్తూ). నాకూ సిల్క్‌ స్మిత అక్క అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఒక సినిమాలో మేమిద్దరం కలిసి నటించే క్రమంలో ఆవిడ నన్ను కొట్టింది. అందుకే అనూరాధ అక్క దగ్గర సిల్క్‌ ప్రస్తావన తీసుకురాను. అయినా సిల్క్‌ నా సీనియర్. ఆమెను ఎప్పుడూ గౌరవిస్తాను. ఎందుకంటే ఆవిడ చిత్రంలోనే నేను చెల్లెలు పాత్రలో తెరకు పరిచయం అయ్యాను. అప్పుడు వచ్చిన ‘డర్టీ పిక్చర్‌’లోనూ, ఇప్పుడు వచ్చిన నా బయోపిక్‌ ‘షకీలా’ చిత్రంలో ఒక పెద్ద తప్పు జరిగింది. సిల్క్‌ అక్కకు, నాకూ మధ్య పోటీ ఉన్నట్టు చిత్రీకరించారు. అస్సలు అప్పుడు అలాంటి వాతావరణం లేనేలేదు. ఆవిడ టైమ్‌లో పోటీగా అనూరాధ అక్క ఉండేది. వాళ్లంతా ఒకే బ్యాచ్‌వాళ్లు. ఆ రెండు చిత్రాల మేకర్స్‌ అస్సలు నిజం తెలుసుకోకుండా బయోగ్రఫీ చిత్రాలంటూ అవాస్తవాలు చూపించారు. ‘మహానటి’ చిత్రంలో మాదిరిగానే నా ఒంటి మీద ఉండే ఏవైనా ఆభరణాలను పక్కవాళ్లు బాగున్నాయంటే బహుమతిగా ఇచ్చేసేదాన్ని. అయితే నేను సినిమాలు మాత్రం తీయలేదు.

అభినయశ్రీకి ఏవైనా లవ్‌లెటర్లు వచ్చేవా?

అనూరాధ: ఇప్పటికి వస్తూ ఉంటాయి. తను ఎక్కడైనా నా ఫోన్‌ నెంబరునే తన ఫోన్‌ నెంబర్‌గా ఇస్తుంది. కొంతమంది ఫోన్‌ చేసి ‘మిమ్మల్ని ప్రేమిస్తున్నాం’ అంటూ మాట్లాడుతుంటారు. నేను అభినయశ్రీలా మాట్లాడుతూ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చేదాన్ని. తను నటిగా బాగా బిజీగా ఉన్నప్పుడు రోజుకు 30 కాల్స్‌ దాకా వచ్చేవి. ఇప్పటికీ అలానే ఉంది.

వ్యాంప్‌ పాత్రలు చేసేవాళ్లు.. నిజ జీవితాల్లో కూడా అలానే ఉంటారా?

అనూరాధ: అలా ఏ మాత్రం ఉండరు. నా వరకు నేను ఎన్ని గ్లామర్‌ పాత్రలు చేసినా, ఇంటికొచ్చేటప్పటికి భార్యగా, తల్లిగా నా బాధ్యత నేను నిర్వర్తించేదాన్ని. ఎన్నో గ్లామరస్ పాత్రల్లో నటించా. హీరోతో సమానంగా నాకూ కటౌట్లు పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. మా వైవాహిక బంధంలో తొమ్మిదేళ్ల పాటు నా భర్తతో గడిపా. ఒక ప్రమాదం కారణంగా ఆయన మంచానికి పరిమితమయ్యారు. అప్పటి నుంచి ఆయనతో కలిపి నాకు ముగ్గురు పిల్లలు. పదకొండేళ్లపాటు ఆయనకు మంచంపైనే ఎన్నో సేవలు చేశా. ఆ తర్వాత కొన్నాళ్లకు హార్ట్‌ఎటాక్‌ వచ్చి చనిపోయారు. నా బిడ్డ చనిపోయినంత వేదన పడ్డా. సినిమాల్లో ఇప్పుడు వ్యాంప్‌ క్యారెక్టరు చేయమన్నా నేను చేస్తా. ఎందుకంటే నటన నా వృత్తి. కానీ, నిజ జీవితంలో కుటుంబ మహిళగా నా ధర్మాన్ని పాటించాను. సీనియర్‌ నటి లక్ష్మిగారు ఒక మాట అన్నారు. ‘మా సినిమా వాళ్లలో అనూరాధ గురించి గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రమాదంలో గాయపడిన భర్తను ఎంతో అపురూపంగా చూసుకుంది’ అంటూ అందరితో చెప్పేవారు (ఒకింత భావోద్వేగానికి గురయ్యారు). అలా అటు సినిమా, ఇటు జీవితాన్ని బ్యాలెన్స్‌గా తీసుకెళ్లేదాన్ని. షకీలాకు కూడా మంచి తోడు దొరికితే జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతుంది.

షకీలా: వ్యాంప్‌ పాత్రలు పోషించినంత మాత్రాన అలా ఉంటారని కాదు. మేకప్‌ తీసేశాక మేమూ మామూలు మనుషుల్లానే ఉంటాం. షూటింగ్‌లో మంచి నీళ్లు కావాల్సివస్తే బాయ్‌ని ‘బాబు కొంచెం నీళ్లు తెచ్చిపెట్టమ్మా’ అనే అంటాం. బయట మనం ఉండే విధానాన్ని బట్టే జనాలు ప్రవర్తిస్తారు. మనం పద్ధతిగా ఉంటే ఎవ్వరూ మన జోలికి రారు.

జీవితం చివరి దశలో మీకు తోడుండే ఆ నలుగురు ఉన్నారా?

షకీలా: నలుగురు కాదు నా వెనుక నలభైవేల మంది ఉన్నారు. కృపామ్మ అనే ఒక ట్రాన్స్‌జెండర్‌ నాకు అమ్మలా ఉంటారు. ఆమెకు తెలిసిన మరో అయిదువేల మంది ట్రాన్స్‌జెండర్లు నన్ను ‘అమ్మా’ అని పిలుస్తారు. వాళ్లు చాలు కదా! అయినా మనం చనిపోయాక రెండు రోజులు తలుపు తీయకుండా ఉంటే మూడోరోజు దుర్వాసన వస్తుంది. కార్పొరేషన్‌ సిబ్బంది, పోలీసులు వచ్చి అవసరమైన పనులన్నీ చేసి మన శవాన్ని సాగనంపుతారు. ఆ మాత్రం దానికి పాడె మోయడానికి నలుగురు కావాలి అనుకుంటూ ఉన్నదంతా పోగొట్టుకుంటున్నాం. ఇప్పటిదాకా అలానే అనుకుని ఎంతో మందికి ఎన్నో దానాలు చేశా. ఇప్పుడు అలా అనుకోవడంలేదు. మానసికంగా పరిణతి చెందాను.

లాక్‌డౌన్‌ టైమ్‌లో ఓ డైరెక్టర్‌ మీకు కాల్‌చేసి యోగక్షేమాలు అడిగారట కదా?

షకీలా: అవును! డైరెక్టర్‌ తేజాగారు నాకు కాల్‌ చేసి ‘ఏమ్మా బాగానే ఉన్నావా? డబ్బులుకేమైనా ఇబ్బంది పడితే చెప్పు పంపుతాను’ అంటూ మాట్లాడారు. అప్పుడు నేను బాగా ఏడ్చేశాను. సార్‌ నా గురించి అంతలా పట్టించుకున్నారు. ఎందుకంటే నా తమ్ముడు సలీమ్‌ లాక్‌డౌన్‌ టైమ్‌లో ఏ రోజూ ఫోన్‌ చేసి పలకరించలేదు. తేజాగారు లాంటి పెద్ద డైరెక్టర్‌ నాకు ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడగటమంటే మామూలు విషయం కాదు. ఆయనకు బాగా ఇష్టమైన వాళ్లలో కొంతమందికే అలా కాల్‌ చేసి మాట్లాడారట. నిజంగా నాకు చాలా సంతోషమేసింది. ఇంకా లాక్‌డౌన్‌ టైమ్‌లో నన్ను బాగా చూసుకుంది కూడా అనూ అక్కే. నేనేమీ తినలేదని తెలుసుకుని.. ఇంట్లో అందరికీ ఆసుపత్రికి వెళుతున్నానని అబద్ధం చెప్పి నాకు చికెన్‌ వండి తీసుకొచ్చింది.

డ్యాన్సర్‌గా మంచి సక్సెస్‌ చూస్తున్న టైమ్‌లో ఏడేళ్ల బాబుకు తల్లి పాత్రలో నటించారట కదా?

అనూరాధ: నా కెరీర్‌ అప్పుడు మంచి పీక్‌ స్టేజ్‌లో ఉంది. ఆ సమయంలో తల్లిపాత్రలో నటించాలంటూ టి.కృష్ణగారు సంప్రదించారు. మా అమ్మ అందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన వచ్చి మళ్లీ అడిగారు. ఎప్పుడూ ఒత్తైన జుట్టు, గడ్డంతో ఉండే కృష్ణగారు మొత్తం జుట్టంతా తీసేసి వచ్చారు. అప్పుడు ఆయన మా అమ్మతో ‘అమ్మా.. నాకిప్పుడు క్యాన్సర్‌, నా చివరి చిత్రంగా ఈ ‘రేపటి పౌరులు’ తీయాలనుకుంటున్నా. అన్ని పాత్రలకు ఎంచుకున్న నటులు సరిగ్గా సరిపోయారు. అనూని అడిగిన తల్లి పాత్రకు జయమాలినిని తీసుకోవచ్చు. కానీ, అనూ అయితేనే ఆ ఎమోషన్‌ పండించగలదని నా నమ్మకం. దయచేసి ఒప్పుకోండి’ అని అడిగారు. దాంతో మా అమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పేసుకుంది. ఆ చిత్రంలో నాతో కోర్టు సీను తీసేటప్పుడు కృష్ణగారు ఆసుపత్రిలో ఉన్నారు. దీంతో ముత్యాల సుబ్బయ్యగారు దర్శకత్వం చేయాల్సి వచ్చింది. అయినా, కృష్ణగారు ఆస్పత్రి నుంచి సెలైన్‌ బాటిల్‌తోనే వచ్చి నేను ఆ సీన్‌లో డైలాగ్స్‌ ఎలా చెప్పాలో వివరించారు. నిజంగా ఆయనకు కృతజ్ఞతలు. ఆ రోజు ఆ పాత్రలో నటించకపోయినట్లైతే నేను ఎంతో మిస్ అయ్యేదాన్ని. ప్రేక్షకుల నుంచి ఆ పాత్రకు అంత మంచి స్పందన లభించింది.

మీకు కష్టం వస్తే ఎవరితో పంచుకుంటారు?

అనూరాధ: నాకు కష్టం వచ్చినా, బాధ కలిగినా మా ఆడపడుచు భానుతో షేర్‌ చేసుకుంటాను. నా భర్త సతీష్‌కు తను చెల్లెలు. ఆ తర్వాత నా కూతురు అభితో. ఎక్కువగా వీళ్లిద్దరితోనే నా కష్టాలు పంచుకుంటాను. అంతకుముందు అమ్మతో ఎక్కువగా చెప్పుకునేదాన్ని. నా భర్తకు ప్రమాదం జరిగినపుడు కూడా నా కష్టాలకు అమ్మ బాసటగా నిలిచేది. అంతటి అనుబంధం ఉన్న అమ్మ చనిపోయినపుడు బాధతో నాకు ఏడుపు కూడా రాలేదు. మమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకురావడానికి అమ్మ ఎన్ని కష్టాలు పడిందో అప్పుడు అర్థమైంది. ఇప్పుడు అమ్మలాగే నేనూ నా పిల్లలకు బాసటగా నిలుస్తున్నా. అందుకే అభి ఎప్పుడూ అంటూ ఉంటుంది ‘మా అమ్మే నాకు ధైర్యమని’.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.