ETV Bharat / sitara

'ఫ్లాప్​లతో డిప్రెషన్​లోకి వెళ్లా.. చిరు అండతోనే మళ్లీ ఇలా'

Alitho Saradaga Actors Srikanth and Poorna: వరుస ఫ్లాప్​లతో ఒకానొక సందర్భంలో డిప్రెషన్​లోకి వెళ్లిపోయి సినీఇండస్ట్రీకి దూరంగా ఉండాలని తాను నిశ్చయించుకున్నట్లు తెలిపారు శ్రీకాంత్​. కానీ ఆ తర్వాత చిరంజీవి చెప్పిన కొన్ని మాటలు తనలో స్ఫూర్తి నింపాయని చెప్పారు.

ఆలీతో సరదాగా శ్రీకాంత్​ పూర్ణ, ALITHO SARADAGA ACTORS SRIKANTH AND PURNA
ఆలీతో సరదాగా శ్రీకాంత్​ పూర్ణ
author img

By

Published : Dec 15, 2021, 12:44 PM IST

Alitho Saradaga Actors Srikanth and Poorna: కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా.. ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్‌. ఈ మధ్య బాలయ్య 'అఖండ' సినిమాలో కరడుగట్టిన విలన్‌ పాత్రను పోషించి ప్రేక్షకుల్ని భయపెట్టేశారు. మరోవైపు కేరళ 'సీమటపాకాయ్‌' పూర్ణ.. హీరోయిన్‌గా, సహాయనటిగా విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీరిద్దరూ కలిసి ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వారు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

ఆలీ: ఫ్యామిలీమ్యాన్‌.. మంచి భర్త, అన్న, కొడుకు, బాబాయ్‌.. ఇలా అన్ని పాత్రల్లో శ్రీకాంత్‌ను చూశాం. కానీ.. ‘అఖండ’ చిత్రంలో వరదరాజులు పాత్రలో మిమ్మల్ని ఊహించలేదు.

పూర్ణ: నేను కూడా శ్రీకాంత్‌ గారి నుంచి అలాంటి పాత్ర ఊహించలేదు. భావనతో ఆయన సినిమా (మహాత్మ) చేసినప్పుడు చాలా అందంగా కనిపించారు. 'అఖండ' షూటింగ్‌ తొలి రోజు అలాంటి శ్రీకాంత్‌ కోసం నేను ఎదురుచూస్తుంటే చిరాకుపుట్టించే ముఖంతో ఒకరు వచ్చారు. ఆ తర్వాత తెలిసింది ఆయనే శ్రీకాంత్‌ గారు అని. ఆ పాత్ర కోసం ఆయన అంతలా మారిపోవడం గొప్ప విషయం.

శ్రీకాంత్‌ మీరు ఎన్ని సినిమాల్లో నటించారు?

శ్రీకాంత్‌: 140 సినిమాలు.

పూర్ణ: నాకు 'అఖండ'లో అవకాశం 'ఈటీవీ' ద్వారానే వచ్చింది. నా నంబర్‌ తెలియకపోతే ఈటీవీ ద్వారా కనుక్కున్నారు. అందుకే 'ఈటీవీ'కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. పదేళ్ల కిందటే నేను బోయపాటి శ్రీను గారితో సినిమా చేయాల్సింది. కానీ కుదర్లేదు. దీంతో 'అఖండ'లో ఒక కీలక పాత్ర ఉంది చేస్తారా?' అని బోయపాటి అడిగారు. 'మీతో, బాలకృష్ణ గారితో పనిచేయడం నా అదృష్టం. ఎంత ముఖ్యమైన పాత్ర అయితే తప్ప నన్ను పిలవరు. తప్పకుండా చేస్తా' అని చెప్పా. పద్మావతి పాత్ర ఏడిస్తే.. ప్రేక్షకులు కూడా బాధపడాలి. అలాంటి బలమైన పాత్రను పోషించినందుకు సంతోషంగా ఉంది.

మీరు ఎన్ని సినిమాలు చేశారు?

పూర్ణ: అన్ని భాషల్లో కలిపి 35. తొలిసారి 2004లో ఫ్రెండ్‌ పాత్రలో నటించా. రోలర్‌స్కేటింగ్‌ భరతనాట్యంలో నేను గోల్డ్‌ మెడలిస్ట్‌ని. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్‌ అంటే పిచ్చి. మా అమ్మకు నన్ను సినిమాల్లో చూడాలని కోరిక. కానీ, ముస్లిం అమ్మాయిని కాబట్టి.. చాలా ఆంక్షలున్నాయి. అలాంటిది క్లాసికల్‌ డాన్స్‌ నేర్చుకోవడం చాలా కొత్తగా ఉండేది. 8వ తరగతి చదువుతున్న సమయంలో మలయాళ దర్శకుడు కమల్‌ సినిమాలో ఫ్రెండ్‌ పాత్ర చేశాను. షూటింగ్‌ సమయంలో నన్ను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నటించొద్దు అనుకున్నాను. అయితే, మా అమ్మ నన్ను వారించింది. కెరీర్‌ మొదట్లో అందరికీ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని, ఈ సినిమా వరకు ప్రయత్నించి చూద్దామని చెప్పింది. ఆ సినిమా తర్వాత విరామం తీసుకొని చదువుపై దృష్టి పెట్టా.

ఆ తర్వాత నటుడు దిలీప్‌కు సోదరి పాత్ర చేశాను. అప్పుడే ఇకపై ఫ్రెండ్‌, సోదరి పాత్రలు చేయకూడదని నటి గోపిక సూచించారు. దీంతో హీరోయిన్‌గా నటించాలని నిర్ణయించుకున్నా. అలా 2008లో తిరుమురుగన్‌ దర్శకత్వంలో వచ్చిన 'మునియండి విలంగైల్‌ మూన్రమండు' చిత్రంలో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించా. అందులో భరత్‌ హీరో. అయితే, అప్పుడప్పుడు సినిమాలు మానేద్దామని ప్రయత్నిస్తుంటా. కానీ, అది అవ్వట్లేదు. ఐదేళ్ల కిందట నాకు డ్యాన్స్‌తోపాటు సినిమా కూడా ముఖ్యమని అనిపించింది. అందుకే సినిమాలు చేస్తున్నా.

రెండున్నరేళ్ల కిందట నా షోకి వచ్చారు. ఆ సమయంలో బాలకృష్ణ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారా అని అడిగితే. 'లేదు.. అదంతా పుకారు' అన్నారు. ఇప్పుడు అదే నిజమైంది కదా?

శ్రీకాంత్‌: అప్పుడు అది పుకారే. బోయపాటితో 'సరైనోడు'లో నటించా. అందులో నాది చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న బాబాయ్‌ పాత్ర. రెగ్యులర్‌గా చేసే పాత్రలాగే ఉందని అందరూ అనుకున్నారు. దీంతో 'మిమ్మల్ని విలన్‌ చేస్తాను. చిన్న చిన్న సినిమాలు చేయొద్దు'అని బోయపాటి నాతో చెప్పారు. ఆ తర్వాత నేను సినిమాల్లో హీరోగా.. వెబ్‌సిరీస్‌లు చేసుకుంటూ ఉన్నా. ఓరోజు బోయపాటి నన్ను రమ్మన్నారు. వెళ్లి కలిస్తే బాలకృష్ణ గారి సినిమాలో వరదరాజు పాత్ర గురించి చెప్పారు. నేను అది ఊహించలేదు. బాలకృష్ణ గారి చిత్రంలో విలన్‌ అంటే భారీ అంచనాలే ఉంటాయి. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలియదు. చేస్తానని చెప్పినా లోపల కొంత భయం. ఓ సందర్భంలో ఈ పాత్ర ప్రేక్షకులకు నచ్చకపోతే నా కెరీర్‌ అంతమైపోతుందేమోనని ఆలోచించా. పాత్ర చేయొద్దని అనుకున్నాను. కానీ, బోయపాటి గారు విలన్‌ లుక్ ఎలా ఉంటుందో ఫొటో చూపించారు. దాని ప్రకారం గెటప్‌ వేసుకున్న తర్వాత నాకు నమ్మకం కలిగింది.

ఇంట్లోవాళ్లు సినిమా చూశారా?

శ్రీకాంత్‌: చూసి చాలా భయపడ్డారు. ఏదైనా భిన్నమైన గెటప్‌ ఉంటే దాంతోనే ఇంటికి వెళ్లిపోతా. ఇంట్లో వాళ్లు చూసి ఎవరో వచ్చారనుకుంటారు. సినిమా చూశాక అద్భుతంగా ఉందన్నారు. బాలకృష్ణ గారి నటన గురించి చెప్పక్కర్లేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సెకెండ్‌ హాఫ్‌లో ఆ రేప్‌ సీన్‌ చూసి ఏమన్నారు?

శ్రీకాంత్‌: నేను అది అడగలేదు. కానీ, ఆర్టిస్ట్‌ అన్నాక అన్నీ చేయాలి. ఆ సీన్‌ చేసేటప్పుడు కొంత కంగారుపడ్డా. కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. కానీ, నాకున్న ఫ్యామిలీమ్యాన్‌ ఇమేజ్‌కు ఇలాంటి ఇబ్బందికర సీన్లు ఉంటే బాగోదని తీసేశారు. తర్వాత సింపుల్‌గా షూట్‌ చేశారు. ఎందుకంటే ఆ పాత్ర అలా తప్పక చేయాల్సిందే. అదేం పెద్ద ఇబ్బందిపడే విధంగా లేదు.

మీరు హీరోగా ఉన్నప్పుడు చాలా మంది విలన్లను కొట్టారు కదా? ఇప్పుడు తెలిసిందా.. ఒక విలన్‌ బాధ ఎంత ఉంటుందో?

శ్రీకాంత్‌: నేనూ మొదట విలన్‌నే కదా..! మొదట దెబ్బలు తినే వచ్చాను. తర్వాత కొట్టాను. ఇప్పుడు మళ్లీ దెబ్బలు తింటున్నా. నాకు ఆ సమస్య లేదు.

ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది?

శ్రీకాంత్‌: హీరోగా చేసినప్పుడు కూడా అన్ని ఫోన్లు రాలేదు. 'వరదరాజులు గారు.. గుడ్‌ మార్నింగ్‌' అంటూ ఫోన్లు వస్తున్నాయి. శ్రీకాంత్‌ను మర్చిపోయి నన్ను వరదరాజులుని చేస్తారేమో.. సాధారణంగా కనిపించే నేను.. ఆ పాత్ర చేసేసరికి ఇప్పటికీ నేనేనా అనిపిస్తుంటుంది.

చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌, బాలకృష్ణతో కలిసి నటించారు. బాలయ్యగారితో పనిచేస్తున్నప్పుడు ఎలా ఉంది?

శ్రీకాంత్‌: మొదట్లో నేను విలన్‌ పాత్రలు చేస్తున్నప్పుడు వెంకటేశ్‌, నాగార్జున గారితో సినిమాలు చేశాను. హీరోగా చేస్తూనే చిరంజీవితో చేశాను. రామ్‌చరణ్‌, బన్నీతోనూ నటించా. హీరోగా చేస్తూనే మంచి పాత్ర అడిగితే చేస్తున్నాను. అలాగే బాలకృష్ణ గారి 'శ్రీరామరాజ్యం'లో లక్ష్మణుడి పాత్ర చేశా. అది మంచి పాత్రే. నా స్వభావానికి దగ్గరగా ఉండేది. కానీ, 'అఖండ'లో బాలకృష్ణ పక్కన నాది రావణాసురుడి పాత్ర.

బాలకృష్ణ గారితో నేను ‘శ్రీరామరాజ్యం’ చేశాను కాబట్టి మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. ఆయన సెట్లో చాలా సరదాగా ఉంటారు. సెట్‌లోకి రాగానే ఆయన గురించి.. పాత రోజుల గురించి చెబుతుంటారు. రోజంతా ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. సీన్స్‌ చేసేటప్పుడు మామధ్య పోటీతత్వం ఉండేది. నాగార్జున, వెంకటేశ్‌ గారితో చేసేటప్పుడు స్నేహపూర్వక.. చిరంజీవి, బాలకృష్ణ గారితో గౌరవప్రదమైన వాతావరణం ఉంటుంది.

పూర్ణ.. మీరు స్కూల్‌లో కిటికీ పక్కన కూర్చుంటే మీకు సైట్‌ కొట్టారంట.. ఆ అబ్బాయి ఎవరు?

పూర్ణ: ఇప్పుడు చెప్పి.. ఆ కుటుంబాన్ని ఇబ్బందిపెట్టడం బాగోదు. నేను గర్ల్స్‌ స్కూల్‌లో చదువుకున్నాను.. మా స్కూల్‌కి అరకిలోమీటర్‌ దూరంలో బాయ్స్‌ స్కూల్‌ ఉంది. మా స్కూల్‌లో ఉన్న అమ్మాయిలకు ఆ స్కూల్‌కి చెందిన బాయ్‌ఫ్రెండ్స్‌ ఉండేవారు. నాకూ ఉండాలి కదా! నేను 8వ తరగతి ఉన్నప్పుడు నాకు +1 చదువుకునే బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. దీంతో నేను కిటికీ పక్కన కూర్చుంటే.. అతడు దూరంగా నిలబడి ఒకరినొకరం చూసుకునేవాళ్లం. స్పెషల్‌ క్లాస్‌ పేరుతో స్కూల్‌ బస్సులో వెళ్లకుండా బస్టాండ్‌లో మాట్లాడుకునేవాళ్లం.

పూర్ణ అద్భుతమైన డాన్సర్‌. తెలుగు బాగా మాట్లాడతారు.. మంచి నటి. కానీ, రావాల్సినంత గుర్తింపు ఎందుకు రాలేదు?

పూర్ణ: బహుశా.. నేను సినిమాలపై అంతగా దృష్టి పెట్టలేదేమో. నాకు డాన్స్‌ అంటే పిచ్చి. స్టేజ్‌పై డాన్స్‌ వేస్తున్నా అంటే నా వేషధారణపై ఐదు రోజుల ముందు నుంచే దృష్టి పెడతా. డాన్స్‌పై చూపినంత అంకితభావం.. సినిమాలపై చూపించలేదు. ఆ పాత్ర కావాలి.. ఈ సినిమా చేయాలి.. టాప్‌లో ఉండాలని అనుకోలేదు. చేసే పాత్ర నాకు సౌకర్యంగా ఉంటే చాలు. కాస్త ఇబ్బంది పడ్డా సినిమా మొత్తం మూడ్‌ఆఫ్‌లోనే ఉంటా. చిత్రబృందాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అందుకే, చాలా సినిమాలను నిరాకరించాను. నాకు నచ్చిన సినిమాలు చేస్తూ సంతోషంగా ఉన్నా.

తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు?

పూర్ణ: మా తండ్రి వ్యాపారవేత్త. రొయ్యలు ఎగుమతి చేస్తుంటారు. అమ్మ గృహిణి. నేను ఇక్కడ కూర్చోవడానికి మా అమ్మే కారణం. మూడున్నరేళ్ల వయసులో నేను చేసిన తొలి ప్రదర్శన నుంచి ఇప్పటివరకు నా వెంటే ఉన్నారు. అదే పెద్ద ఉద్యోగం. పెద్ద అక్క దుబాయ్‌లో, రెండో అక్క ముంబయిలో ఉన్నారు. అన్న సౌదీలో, చెల్లి కొచ్చిలో ఉన్నారు.

భవిష్యత్తులో మీ అబ్బాయి రోషన్‌ను హీరోగా.. మిమ్మల్ని విలన్‌గా పెడితే చేస్తారా?

శ్రీకాంత్‌: వాడు ఒప్పుకొంటే చేస్తా. అయితే, మంచి పాత్ర. ప్రేక్షకులను మెప్పించేదిలా ఉండాలి. దానికి సమయం పడుతుంది. ఇప్పుడు వరదరాజులు తర్వాత ఎలాంటి పాత్రలు వస్తాయో అని ఆలోచిస్తున్నాను.

ఏదో ఒక సినిమాలో పదేపదే డాన్స్‌ మూమెంట్స్‌ చేయిస్తే మీకు కోపం వచ్చి సెట్‌లో నుంచి వెళ్లిపోయారట. ఏ సినిమా అది?

శ్రీకాంత్‌: పరిశ్రమలో తొలిసారి గొడవపడింది అప్పుడే. పెద్ద దర్శకుడు ఉన్నాడు. డాన్స్‌ మాస్టర్‌ ఓ సింగిల్‌ మూమెంట్‌ను పెట్టారు. నేను, రాశి ప్రాక్టిస్‌ చేసి షూట్‌ చేశాం. దర్శకుడు వచ్చి 'ఇది కాదు.. వేరే చేయించు' అన్నారు. డాన్స్‌ మాస్టర్‌ వేరే మూమెంట్‌ పెట్టారు. దర్శకుడికి నచ్చలేదని నాలుగైదు సార్లు మార్చారు. దీంతో చిరాకొచ్చి.. 'దర్శకుడినే చేసుకోమనండి. నాకొద్దు' అని వెళ్లిపోయా. ఆ తర్వాత నిర్మాతలు వచ్చి ప్రాధేయపడ్డారు. దీంతో దర్శకుడు సెట్‌లోకి వస్తే నేను ఉండను అన్నాను. అలా పాట పూర్తయ్యే వరకు ఆయన రాలేదు. డాన్స్‌మాస్టర్‌, మేమే పాట పూర్తి చేశాం.

'శ్రీకాంత్‌ మీరు ఇక విలన్‌గా చేయొద్దు. హీరోగా ఒక సినిమా చేద్దువుగానీ' అని బాలకృష్ణ గారు ఒక కథ సిద్ధం చేశారట?

శ్రీకాంత్‌: 'అఖండ' సెట్‌లోనే బాలకృష్ణ గారు నాతో మాట్లాడుతూ 'ఈ సినిమా తర్వాత విలన్‌ పాత్రలు భయకరంగా వచ్చేస్తాయి. ఏవి పడితే అవి చేయొద్దు. హీరోగా కొన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్లు. నా దగ్గర మంచి కథ ఉంది' అన్నారు. పాత కాలం నాటి ఓ ఇంగ్లిష్‌ సినిమా గురించి చెప్పారు. 'అది మీకు బాగా సూటవుతుంది. నేను క్యాసెట్‌ ఇస్తాను. సినిమా చూసి కృష్ణవంశీకి చూపించు. ఆయన ఒక్కరే చేయగలరు' అని అన్నారు. నేను సరే పంపించండి అన్నాను. ఆయన ఆర్టిస్టులకు మంచి సూచనలు ఇస్తారు.

బాలకృష్ణగారితో తొలిసారిగా నటించారు కదా? ఆ అనుభవం ఎలా ఉంది?

పూర్ణ: ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఉదయం బాలకృష్ణగారి ఎనర్జీ ఎలా ఉంటుందో సాయంత్రం వరకు అదే ఎనర్జీతో ఉంటారు. ఒక్కరోజు కూడా నీరసంగా కనిపించలేదు.

శ్రీకాంత్‌: మేం కలిసి 15 రోజులు షూట్‌లో పాల్గొన్నాం. సెట్‌లో మొత్తం దుమ్ములెగుస్తుంది. కళ్లనేమో పెద్దవి చేసి చూడాలి. నాకు లెన్స్‌ వల్ల ఇబ్బంది. మేము నీరసపడిపోతున్నాం గానీ.. ఆయన మాత్రం పక్కకి జరగట్లేదు. సీన్‌ పూర్తయ్యే వరకు కూర్చోరు. ఆయన కూర్చోవట్లేదని మేం కూర్చోం. ఆయనెప్పుడు కూర్చుంటారా అని చూస్తుండేవాళ్లం.

పూర్ణ: బాలకృష్ణగారికి గొడుగు కూడా ఉండదు. ఆయనకు అదంటే అసలు నచ్చదు.

శ్రీకాంత్‌: బాలకృష్ణ గారితో పెట్టుకుంటే కష్టమని కాస్త పక్కకెళ్లి గొడుగు పెట్టుకోవడం.. ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు చేసి పక్కకెళ్లి కూర్చోవడం చేసేవాళ్లం.

పూర్ణ: అప్పుడప్పుడు మనం నీరసించిపోతే బాలకృష్ణగారి ఫొటో చూడాలి. చాలా మందితో కలిసి పనిచేశాను. కానీ, ఇంత విధేయత ఉండి.. జ్ఞానాన్ని పంచే నటుడిని నేను చూడలేదు. నటుడంటే ఇలా ఉండాలి. డైలాగు ఇలా మార్చుదాం.. అలా చెబుతామని దర్శకుడికి చెప్పే నటులను చూశాను. కానీ, దర్శకుడు ఏం చెప్పినా బాలకృష్ణ గారు 'అలాగే అండి' అనడం నేను చాలాసార్లు విన్నా.

నేను ఒక హారర్‌ సినిమా చూస్తే ఆ రాత్రి భయమేస్తది. ఆ తర్వాత రోజు మర్చిపోతాను. కానీ, పూర్ణ ఒకే ఒక్క హారర్‌ సినిమా చూసి రెండు నెలలు నిద్రపోలేదట..

శ్రీకాంత్‌: ఏ సినిమా?

పూర్ణ: 'అవును' సినిమా.

ఆలీ: అందులో ఆమెనే హీరోయిన్‌. తను నటించిన సినిమా చూసి తనే రెండు నెలలు నిద్రపోలేదు.

పూర్ణ: ఆ సినిమా తర్వాత నా పేరు ఘోస్ట్‌ క్వీన్‌ అయిపోయింది. కేరళలో ఇంటర్వ్యూలు ఇస్తే ఘోస్ట్‌ క్వీన్‌ అనేవారు. 'అవును' సినిమా చేస్తున్నప్పుడు పెద్దగా తెలియలేదు గానీ.. సినిమా చూశాక చాలా భయపడ్డా.

శ్రీకాంత్‌: నాకూ ఓ సంఘటన జరిగింది. నేను ఓ షూటింగ్‌ చేస్తుంటే.. సెట్‌లో ఓ రూమ్‌ ఉంది. పడుకున్నప్పుడు చిన్న చిన్న శబ్దాలు వచ్చేవి. బాత్‌రూమ్‌లో వాటర్‌ వదిలినట్టు.. డోర్‌ కొంచెం తెరిచినట్టు ఉండేది. అయినా, అవేవీ నేను పట్టించుకోలేదు. ఓసారి నాకు కలలో ఏదో నాపై దాడి చేసి, నా గొంతు నొక్కేసినట్టు అనిపించింది. లేవాలని అనుకుంటున్నా లేవలేని పరిస్థితి. మొత్తం మీద చంపేసింది. దాంతో నా ఆత్మ పైనుంచి నా శరీరాన్ని చూస్తోంది. చాలా భయంకరంగా అనిపించింది. అయినా, నాకు ధైర్యం ఎక్కువ కాబట్టి అందులోనే ఉన్నా. ఓ రోజు కృష్ణవంశీ వచ్చి ఆ రూమ్‌లో ఉంటానన్నాడు. వద్దన్నా వినలేదు. దీంతో ఆ రూమ్‌ ఖాళీ చేసి అతడికి ఇచ్చా. మరుసటి రోజు వచ్చి నిన్న నాకేదో అయిందన్నాడు. శబ్దాలు వినిపిస్తున్నాయన్నాడు. నా వందో చిత్రం 'మహాత్మ' షూటింగ్‌లో ఈ ఘటన జరిగింది. కొన్ని విషయాలు విన్నప్పుడు అవి మెదడులో ఎక్కడో ఉండిపోయి కలలా వస్తుంటాయంతే!

ఒకానొక సమయంలో వరుస ఫ్లాపులు ఉంటే.. ఇక అన్నీ సర్దుకొని ఊరెళ్లిపోదామని అనుకున్న మిమ్మల్ని వద్దని వారించిందెవరు?

శ్రీకాంత్‌: 'ఆమె' చిత్రం నుంచి వరుసగా ఎనిమిది నుంచి తొమ్మిది సినిమాలు వరుస హిట్‌లు. ఇళ్లు మారిన తర్వాత ఏడు సినిమాలు ఫ్లాప్‌. చాలా డిప్రెషన్‌లోకి వెళ్లా.. ఫెయిల్యూర్స్‌ని తట్టుకోలేకపోయా. నా వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని భావించి సినిమాలు మానేసి.. వ్యవసాయం చేసుకుందామని ఫిక్సయ్యా. ఆ సమయంలో చిరంజీవి గారితో టచ్‌లో లేను. ఓసారి బ్రహ్మానందం గారు ఆయన వద్దకు వెళ్లినప్పుడు నా గురించి ఆరా తీసి.. నన్ను పిలిపించారు. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో 'ఠాగూర్‌' చిత్రంలో 'కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి..' పాట షూటింగ్‌ జరుగుతోంది. నన్ను లోపలికి తీసుకెళ్లి గంట మాట్లాడారు. ఏమైందని అడిగితే.. విషయం చెప్పా. అప్పుడు ఆయన.. అసలు మనం ఏంటి? ఎలా ఉండాలి? ఆయన జీవితంలో జరిగిన కొన్ని విషయాలు చెప్పి స్ఫూర్తి నింపారు. జయాపజయాలను ఒకేలా చూసినప్పుడు ఇండస్ట్రీలో నిలబడగలమని చెప్పారు. ఆ తర్వాత హిట్‌.. ఫ్లాప్‌ గురించి ఆలోచించలేదు.

అప్పట్లో నేను, పాలేరు పొలంలో పడుకునేవాళ్లం. పైనుంచి విమానం వెళ్తుంటే.. అందులో ఎవరు వెళ్తున్నారో తెలుసా? అని మా పాలేరును అడిగేవాణ్ని. ఎవరు బాబూ అని అడిగితే.. చిరంజీవి అని చెప్పేవాణ్ని. 'వాళ్లంతా మద్రాసులో ఉంటారు.. విమానాల్లోనే తిరుగుతుంటారు. మనకు కనపడరు' అని చెప్పా. అప్పట్లో రామారావు, రజనీకాంత్‌ గారంటే చాలా అభిమానం. ఆ తర్వాత చిరంజీవి డాన్సులు, ఫైట్లు చూసి స్ఫూర్తి పొందాను. నాకు ఇండస్ట్రీకి రావాలన్న కోరిక ఆయన వల్లే కలిగింది.

మా పాప మేధ.. బాస్కెట్‌బాల్‌ జాతీయ స్థాయి క్రీడాకారిణి. ప్రస్తుతానికి అయితే, సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు. వాళ్లకు దేనిపై ఆసక్తి ఉంటే దాన్ని ప్రోత్సహించాలి.. అంతే. తను ఇప్పుడు చదువుకునేందుకు అమెరికా లేదా కెనడాకు వెళ్లబోతోంది.

'సీమటపాకాయ్‌'లో ఓ సీన్‌ వల్ల మీ ఇంట్లో ఒక రోజంతా చర్చ జరిగిందట?

పూర్ణ: కందిచేను.. పాటలో ఓ ముద్దు సీన్‌ ఉంది. ఆ సీన్‌ చూసి మా అన్న పెద్ద గొడవ చేశాడు. 'ఇలాంటి సీన్లు చేసి కుటుంబసభ్యులు ఇబ్బంది పడేలా చేయొద్దు'అని అన్నాడు. సినిమాల్లో ఎక్కువగా నా కళ్లను చూపిస్తుంటారు. నావి మా బామ్మ కళ్లలా ఉంటాయి.

నల్లబడటం కోసం సాధారణంగా మనకు మేకప్‌ వేస్తారు. కానీ, అది సహజంగా ఉండదని మీరు ఓ సినిమా కోసం గొడుగు లేకుండా చాలాకాలం ఎండలో నిలబడేవారట?

పూర్ణ: 'సవరకత్తి' అనే ముష్కిన్‌ సర్‌ సినిమా. అది నా కెరీర్‌లో చాలా మంచి పేరు తీసుకొచ్చిన తమిళ సినిమా. ఇద్దరు పిల్లలున్న ఒక గర్భిణి పాత్ర. కాస్త నల్లగా ఉండాలంటే.. రోజూ బీచ్‌కెళ్లి ఎండలో నిలబడేదాన్ని.

రోషన్‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నప్పుడు మీరిచ్చిన సలహా ఏంటి?

శ్రీకాంత్‌: నటన గురించి ఏం చెప్పలేదు. కేవలం కష్టపడమన్నాను. ఎలా ఉండాలి? ఎవరితో ఎలా ప్రవర్తించాలి? వంటి అంశాలపై చర్చిస్తుంటాం. నన్ను చూసే అన్ని నేర్చుకొని ఉంటాడు. మొదట యాక్టింగ్‌ స్కూల్‌కి వెళ్లాడు. ఆ తర్వాత దర్శకత్వ శాఖలో పనిచేశాడు. సొంత ఆలోచనతోనే ముందుకెళ్తాడు. వాడికి డ్రైవింగ్‌ అంటే పిచ్చి. ఆ విషయంలో జాగ్రత్తలు చెబుతుంటాం.

ఇదీ చూడండి: 'ఈటీవీ వల్లే నాకు 'అఖండ'లో అవకాశం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.