గ్యాంగ్‌స్టర్ గంగూబాయి కొతేల్‌వాలి జీవిత కథతో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం 'గంగూబాయి కతియావాడి'. టైటిల్ పాత్రలో బాలీవుడ్ నాయిక ఆలియా భట్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాను ఈ ఏడాది జులై 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. దీంతో పాటు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసిన మూవీ టీం.. టీజర్‌ను నేడు విడుదల చేస్తామని తెలిపింది.

'ప్రేమమ్' ఫేం నవిన్ పౌలీ.. అబ్రిడ్ షైన్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రానికి 'మహా వీర్యార్' అనే టైటిల్‌ను ప్రకటించారు. తొలి షెడ్యూల్‌ను రాజస్థాన్‌లో చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను పంచుకుంది చిత్రబృందం.

'అలాంటి సిత్రాలు' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. యశ్పూరి, శ్వేతా పరాషార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సుప్రిత్ సి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

రాజేంద్రప్రసాద్ నటించిన 'క్లైమాక్స్' సినిమాలోని 'లక్ష్మీ వచ్చింది' లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటను రాజేంద్ర ప్రసాద్ ఆలపించారు. పొలిటికల్ సెటైర్ మిస్టరీ థ్రిల్లర్‌గా భవానీ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించిన 'మంబయి సాగా' సినిమా టీజర్ విడుదలైంది. యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇమ్రాన్ హష్మి, సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఆదిపురుష్'ను తెరకెక్కించడం చాలా కష్టం: ఓం రౌత్