ETV Bharat / sitara

ప్రియుడి కోసం ఆలియా రూ.32 కోట్ల ఫ్లాట్​! - రణ్​బీర్​ కపూర్​ వార్తలు

ప్రియుడు రణ్​బీర్​కు దగ్గరగా ఉండేందుకు రూ.32 కోట్ల విలువైన ఫ్లాట్​ను ఆలియా కొనుగోలు చేసిందని సమాచారం. ఇటీవల గృహ ప్రవేశం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

Alia buys flat for 32 crore in same apartment complex as Ranbir's: Report
ప్రియుడి కోసమే నివాసాన్ని కొనుగోలు చేసిన అలియా భట్​!
author img

By

Published : Nov 30, 2020, 11:30 AM IST

Updated : Nov 30, 2020, 5:50 PM IST

బాలీవుడ్​ నటి ఆలియా భట్.. దాదాపు రూ.32 కోట్ల విలువైన ఫ్లాట్​ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రూమర్ బాయ్​ఫ్రెండ్​ రణ్​బీర్ కపూర్​ ఉంటున్న కాంప్లెక్స్​లోనే ఈమె ఉండనున్నట్లు తెలుస్తోంది. అతడికి దగ్గరగా ఉండేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రణ్​బీర్ కోసమేనా?

రణ్​బీర్​ ముంబయి పాలీహిల్​ 'వాస్తు' కాంప్లెక్స్​లోని ఏడో అంతస్తులో ఉంటున్నాడు. ఇప్పుడు అలియా అదే భవనం​ ఐదో ఫ్లోర్​లో రూ. 32 కోట్లు విలువైన ఫ్లాట్​ కొనుగోలు చేసినట్లు సమాచారం. అలియా ఇదంతా తన ప్రియుడు కోసమే చేస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

దీపావళి రోజున గృహప్రవేశం

జూహూలో సోదరి షాహీన్ భట్​తో కలిసి ఉంటున్న ఆలియా.. త్వరలో కొత్త ఇంటికి మారనుంది. అంతలో ఆ ఇంటిని అందంగా డెకరేట్​ చేసేందుకు షారుక్ ఖాన్​ భార్య గౌరీఖాన్​ను ఈమె సంప్రదించిందట. అలానే దీపావళి రోజున కుటుంబసభ్యులతో పాటు రణ్​బీర్​​, కరణ్​ జోహార్​ లాంటి సన్నిహితుల సమక్షంలో ఆలియా కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిందట.

'ఆర్​ఆర్ఆర్' పాటు 'బ్రహ్మాస్త్ర'

ఆలియా ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'లో సీత పాత్రలో నటిస్తోంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్​చరణ్​కు జోడీగా నటించనుంది. రణ్​బీర్​ సింగ్​తో కలిసి 'బ్రహ్మాస్త్ర' సినిమా చేస్తోంది. ఈ రెండు వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఇదీ చూడండి: మాజీప్రియుడి ఫొటోను డీపీగా పెట్టుకున్న దీపిక..!

Last Updated : Nov 30, 2020, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.