ETV Bharat / sitara

Alia Bhatt: అలియా భట్ హాలీవుడ్​ పయనం - హాలీవుడ్​లో అలియా భట్

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్(Alia Bhatt)​ త్వరలోనే హాలీవుడ్​లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఈ భామ ఓ ప్రముఖ సినీ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

Alia Bhatt
అలియా
author img

By

Published : Jul 9, 2021, 10:20 AM IST

Updated : Jul 9, 2021, 12:02 PM IST

హిందీ చిత్రసీమ అగ్ర కథానాయికల్లో అలియా భట్(Alia Bhatt) ఒకరు. 'స్టూడెంట్ ఆఫ్​ ది ఇయర్' చిత్రంతో బాలీవుడ్​లో అడుగుపెట్టి 'హైవే', 'ఉడ్తా పంజాబ్', 'గల్లీ బాయ్', 'రాజీ' ఇలా మంచి విజయాలను తన ఖాతాలో వేసుకొంది. మరోవైపు చిత్ర నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టి రెడ్ చిల్లీస్ ఎంటర్​టైన్​మెంట్స్​తో కలిసి 'డార్లింగ్స్'(Darlings)​ చిత్రాన్ని నిర్మిస్తోంది. చేతినిండా ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న ఈ నాయిక మనసు ఇప్పుడు హాలీవుడ్​పై పడినట్టు తెలుస్తోంది.

Alia Bhatt
'ఆర్​ఆర్​ఆర్​'లో అలియా భట్

ప్రముఖ హాలీవుడ్​ ఏజెన్సీ విలియమ్ మోరిస్ ఎండీవర్ (డబ్ల్యూఎమ్​ఈ) అలియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. బెన్ అఫ్లెక్, జెస్సికా ఆల్బా, క్రిస్టియన్​బాలే, మ్యాట్ డామన్, జెన్నీఫర్ గ్రార్నెర్, ఫ్రిదా పింటో లాంటి నటులందరూ ఈ సంస్థ నుంచి వచ్చినవారే కావడం విశేషం. మరి ఏ సినిమా ద్వారా అలియాభట్ హాలీవుడ్​లోకి అడుగుపెడుతుందో చూడాలి. ప్రస్తుతం ఆమె రాజమౌళి 'ఆర్​ఆర్​ఆర్​'తో(RRR movie) పాటు 'బ్రహ్మాస్త్ర'(Brahmāstra), 'రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి: యూత్ హార్ట్​బీట్ పెంచేస్తోందీ భామ

Last Updated : Jul 9, 2021, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.