ETV Bharat / sitara

రణ్​బీర్​తో నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది: ఆలియా భట్

Alia ranbir wedding: ప్రియుడు రణ్​బీర్​తో తనకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ ఆలియా భట్. దీనిపై నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు.

Ranbir Kapoor Alia Bhatt
రణ్​బీర్ ఆలియా భట్
author img

By

Published : Feb 11, 2022, 2:22 PM IST

Alia bhatt husband: బాలీవుడ్‌ నటులు ఆలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. చిన్ననాటి నుంచి స్నేహితులైన వీరిద్దరూ 'బ్రహ్మాస్త్ర' షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డారు. ఈక్రమంలోనే వీరి పెళ్లిపై రెండేళ్ల నుంచి వరుస కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలియాభట్‌.. రణ్‌బీర్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం 'గంగూబాయ్‌ కతియావాడి' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆలియా.. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాలపై స్పందించింది. "షూటింగ్స్‌ నుంచి ఏ మాత్రం ఖాళీ దొరికినా ఏదో ఒక కొత్త పని నేర్చుకోవడానికి ఆసక్తి కరబరుస్తుంటాను. సమయాన్ని వృథా చేయడం నాకు అస్సలు నచ్చదు. కరోనా కారణంగా షూటింగ్స్‌ వాయిదా పడిన సమయంలో మ్యూజిక్‌పై దృష్టిపెట్టాలనుకున్నా. అప్పుడు గిటార్‌ నేర్చుకున్నా. స్క్రీన్‌ రైటింగ్‌లో శిక్షణ తీసుకున్నా" అని ఆలియా చెప్పుకొచ్చింది.

"గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ లేకపోతే ఈపాటికి అయిపోయి ఉండేదని అన్నారు. నిజమేనా?" అని విలేకరి ఆలియాను ప్రశ్నించగా.. "నా దృష్టిలో మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. రణ్‌బీర్‌ చెప్పింది నిజమే. లాక్‌డౌన్‌ కారణంగా అప్పుడు పెళ్లి వాయిదా పడింది. కానీ, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మంచి సమయం వచ్చినప్పుడు తప్పకుండా మా పెళ్లి జరుగుతుంది" అని ఆమె తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.