ETV Bharat / sitara

దీపిక పేరుతో కిన్వా వ్యాపారం చేశా: నవీన్​ పొలిశెట్టి - నవీన్​ పొలిశెట్టి

'ఆలీతో సరదాగా' టాక్​ షోకు హాజరైన యువ నటుడు నవీన్ పొలిశెట్టి తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

naveen polishetty
నవీన్​ పొలిశెట్టి
author img

By

Published : Mar 24, 2021, 9:14 PM IST

తొలి చిత్రం 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ'లో కామెడీ డిటెక్టివ్‌గా అందర్నీ మెప్పించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్‌ పొలిశెట్టి. ఇప్పుడు జాతిరత్నంగా థియేటర్లలో వినోదం పంచుతున్నాడు. షార్ట్‌ఫిలింతో నాగ్‌అశ్విన్‌ని మెప్పించి, డైరెక్టర్‌గా అవకాశం కొట్టేశాడు అనుదీప్. 'జాతిరత్నాలు' చిత్రంతో ప్రేక్షకుల మనసులనూ దోచుకున్నాడు. తాజాగా ఈ ఇద్దరు 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి తమ సినిమా అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నవీన్‌ పొలిశెట్టి కామెడీ ఫ్యామీలీ నుంచి వచ్చాడా?

నవీన్‌: చాలామంది అదే అడుగుతున్నారు. కానీ లేదండి నేను ప్రేక్షకుల ఫ్యామిలీ నుంచి వచ్చాను. నవీన్‌ పొలిశెట్టి జీవితంలో చాలా అనుభవాలు ఎదుర్కొన్నాడు. అందువల్లే ఈ హ్యూమర్‌ వచ్చుండొచ్చని నా అనుమానం.

మీ ఫ్యామిలీలో సెటైర్‌లు వేసే అలవాటు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా?

నవీన్‌: ఫస్ట్‌ నేనే అనుకుంటున్నా. అయితే మా నాన్నలో అలాంటి నైజం ఉంది. ఎక్కడికైనా వెళ్లిన చోట ఎవరైనా బాధలోగానీ, ఒత్తిడిలోగానీ ఉన్నారని తెలిస్తే ఆయన ముందు ఏదో ఒక జోక్‌ వేసేస్తాడు. ఆ పరిస్థితిని కాస్త మార్చి అందరినీ నవ్వించేస్తాడు. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నలో అది గమనించేవాడిని. నాకు కూడా రూమ్‌లో ఎవరైనా టెన్షన్‌గా ఉన్నారని తెలిస్తే నేనూ ప్రెజర్‌ ఫీల్‌ అవుతాను. వాళ్లని ఎలాగైనా నవ్వించి ఆ ఒత్తిడి తగ్గించాలని చూస్తాను. బహుశా మా నాన్న నుంచి ఆ అలవాటు వచ్చినట్టుంది.

ఎన్నో సినిమా ఇది?

నవీన్‌: ఇది నా రెండో సినిమా. మొదటిది ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ. తెలుగు ప్రేక్షకులు దాన్ని హిట్‌ చేశారు. జాతిరత్నాలు అనే సినిమా గత వేసవిలో రిలీజ్‌ అవ్వాల్సింది. కానీ లాక్‌డౌన్‌ వల్ల సంవత్సరం వాయిదా పడింది. ఆ సమయంలో ఎన్నో టెన్షన్లు పడ్డాం. సినిమా బాగా వచ్చింది. అదే సమయంలో ఓటీటీ నుంచి చాలా ఆఫర్స్‌ వచ్చాయి. ఈ లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. ఓటీటీ వాళ్లు నెలనెలా ఆఫర్‌ పెంచుతూ పోతున్నారు. అయినా మా నిర్మాతలు నాగ్‌ అశ్విన్, ప్రియాంక దత్‌ రిస్క్‌ తీసుకున్నారు. రెండున్నర గంటల పాటు నవ్వించే సినిమా థియేటర్‌లోనే విడుదల చేయాలని, ఆ అనుభూతిని ఆడియన్స్‌ని పంచాలని అనుకున్నారు. అయినా అది రిస్కీ నిర్ణయమే. ఎందుకంటే థియోటర్స్‌ తెరుచుకున్నాక ప్రేక్షకులు వస్తారో లేదో కూడా తెలీదు. గత మూడు నెలల నుంచి అందరం టెన్షన్‌లోనే ఉన్నాం. కానీ ఎప్పుడైతే టీజర్, ట్రైలర్, పాట ట్రెండింగ్‌ అయ్యాయో అప్పుడు మాకు పూర్తి ధైర్యం వచ్చింది. ఫస్ట్‌ డే సినిమా రిలీజ్‌ అయ్యేదాకా సినిమాని ఎవరికీ చూపించను కూడా లేదు. రిలీజ్‌ అయ్యాక ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. విపరీతంగా నవ్వుకుంటున్నారు. నేను దేవీ థియేటర్‌కి వెళ్లి తిరిగి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అంతమంది జనం ఉన్నారు థియేటర్‌లో!

నవీన్‌ పొలిశెట్టి పుట్టింది ఎక్కడ?

నవీన్‌: నేను పుట్టింది.. పెరిగింది హైదరాబాద్‌లోనే. 'మేం ఎయిర్‌పోర్ట్‌లో కూర్చుని పేపర్‌ చదువుకుంటుంటే నిర్మాత చూసి అరే నీకు యాక్టింగ్‌ అంటే ఇంట్రెస్టేనా అని ఛాన్స్‌ ఇస్తే యాక్టర్‌ అయ్యాను అని' చాలామంది అంటుంటారు. మనకు అలాంటిదేం లేదు. చిన్నప్పుడు నుంచి నాటకాలు, డ్రామాల్లో పాల్గొనేవాడిని. దేని మీద క్లారిటీ లేకపోయినా సినిమాల్లో యాక్టర్‌ అవ్వాలని మాత్రం ఫుల్‌ క్లారిటీ అయితే ఉండేది.

రిజర్వ్‌ బ్యాంక్‌లో ఎంప్లాయ్‌ అవ్వాలని అనుకున్నారట?

నవీన్‌: మా అమ్మ బ్యాంకులో పని చేసేది. ఆమెతోపాటు నేను బ్యాంకుకి వెళ్లేవాన్ని. అప్పుడు పెద్దయ్యాక నువ్వు ఏమవుతావని అడిగితే... 'నేనూ నీలాగే క్యాషియర్‌ అవుతాన'ని చెప్పేవాడిని. అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేది. నాకు డబ్బులు లెక్క పెట్టడం అంటే చాలా ఇష్టం.

మీ లాగా క్యాష్‌ లెక్క పెట్టే యాక్టర్‌ ఒకరు ఉన్నారు తెలుసా?

నవీన్‌: కోటగారు లెక్కపెట్టినంత క్యాష్‌ లెక్క పెడితే నేను కూడా హ్యాపీ. ప్రస్తుతానికైతే ప్రేక్షకులు ఎంత ఇస్తున్నారు అని చూస్తున్నాను.

మీ ఇంట్లో మీరు ఎంత మంది?

నవీన్‌: మేం ముగ్గురం. మా పెదనాన్న చిన్నాన్న పిల్లలు అందరూ ఐఐటీ క్లియర్‌ చేశారు. మా ఇంట్లో ఇంటర్‌ దాటిందంటే ఎవడైనా ఐఐటియన్‌ అయిపోతాడని అనుకుంటారు. నా కర్మ కాలి నాకు చదువు రావడంతో 'చదువు బాగా చదువుతున్నావ్‌ నీకెందుకురా ఈ సినిమాలు మంచి జాబ్‌ కొట్టి హ్యాపీగా సెటిలై పోకుండా' అని మా పేరెంట్స్‌ అనేవాళ్లు. కనీసం చదువు రాకుండా ఉండుంటే వీడు దేనికీ పనికిరాడు కనీసం సినిమాలైన ట్రై చేయనిలే అని అనుకునే వాళ్లు.

మదర్‌ బ్యాంక్‌ ఎంప్లాయ్‌ మరి ఫాదర్‌?

నవీన్‌: మా నాన్న హైదరాబాద్‌లోనే ఫార్మాసుటికల్‌ బిజినెస్‌ చేసేవాళ్లు. ఒకానొక సమయంలో బిజినెస్‌ సరిగా జరగక ఇబ్బందుల్లో ఉన్నారు. అదే సమయంలోనే నేను సినిమాల గురించి చెప్పాను. అప్పుడు ఆయన 'బాగా చదువుకునే వీడేంట్రా ఇప్పుడు సినిమాలు అదీ ఇది అంటున్నాడు. అందరూ బాగా చదువుకుంటున్నారు. వీడు అలా ఉండొచ్చు కదా!' అని అనుకున్నారు. అప్పుడు నేను ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్‌ చేస్తున్నాను.

మీ కీన్వా వ్యాపారం ఎలా ఉంది? అసలు కీన్వా అంటే ఏమిటి?

నవీన్‌: (నవ్వులు..) నేను బాంబేలో ఉన్నప్పుడు ఒక ఆర్టికల్‌ చదివాను. సెలబ్రిటీలందరూ రైస్‌ తింటే పొట్ట వస్తుందని ఈ కీన్వా తింటుంటారు. ఆడిషన్స్‌కి ఎవరూ డబ్బులు ఇవ్వరు కదా! నా రెంట్‌కీ, ఖర్చులకు డబ్బుల కోసం ఏం చేద్దామా అనుకున్న సమయంలో నాకు ఒక కీన్వా కంపెనీ ఆయన తగిలాడు. 'రెస్టారెంట్లలో కీన్వా అమ్మి పెడతావా నీకు టెన్‌ పర్సెంట్‌ ఇస్తాను' అని అన్నాడు. దీన్ని ఎలా అమ్మాలా అని అనుకుంటున్నా సమయంలో అప్పుడే ఒక ఆర్టికల్‌ చదువుతుంటే దీపికా పదుకొణె కీన్వా తింటుందని కనిపించింది. ప్రచారానికి ఇది సరిపోతుందని ఆ ఆర్టికల్‌ తీసుకుని పెద్ద రెస్టారెంట్లకు వెళ్లేవాన్ని. 'కీన్వా బర్గర్‌' అని ఆర్డర్‌ చేసేవాన్ని. బేరర్‌ లేదంటే మీకు కీన్వా తెలీదా, ఇప్పుడు సెలబ్రెటీలందరూ అదే తింటున్నారు అంటూ ఒక అరగంట వాడికి క్లాస్‌ పీకి వెళ్లేవాణ్ని. తరువాత మా కంపెనీ ఎంప్లాయిని పంపేవాడిని. కీన్వా పేరు వినగానే నేను పీకిన క్లాస్‌ గుర్తుండి ఆ రెస్టారెంట్‌ వాళ్లు ఆర్డర్‌ ఇచ్చేవాళ్లు. అలా బాంబేలో ఇరవై నుంచి ఇరవై ఐదు రెస్టారెంట్లకు కీన్వా సప్లై చేశాం. కడుపు కోసం ఇలా ఎన్నో పాట్లు. ఈ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ అనుభవమే ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలో డైలాగ్‌గా బాగా ఉపయోగపడింది. ఇలా కీన్వాలు అమ్మడం, డబ్బున్నోళ్ల బర్త్‌డే పార్టీల్లో హోస్ట్‌గా ఎన్నో పనులు చేశాను. బాంబేలాంటి సిటీలో బతకాలంటే ఇవన్నీ తప్పవు.

హైదరాబాద్‌ నుంచి ముంబయి వెళ్లడానికి కారణం ఏంటి?

నవీన్‌: ఇంజనీరింగ్‌ తరువాత లండన్‌లో జాబ్‌ వదిలేసి వచ్చాను. వచ్చి నాటకాలు చేస్తున్న సమయంలో బాంబేలో ఉండే ఓ థియేటర్‌ కంపెనీతో కలిశాను. దానివల్ల బాంబే వెళ్లాను. ఒకటిన్నర సంవత్సరం పాటు నాటకాలు వేశాక అందులో ప్రేక్షకుల ఆదరణ గానీ, డబ్బుగానీ కనిపించలేదు. అప్పట్నుంచి యూట్యూబ్‌లో లఘుచిత్రాలు చేయడం మొదలుపెట్టాను.

ఒక హిందీ సినిమాకి యాక్టర్‌ని అనుకొని మొయిల్‌ చేస్తే.. అది మీకు వచ్చిందట! మీరు వెళ్తే వాళ్లు మిమ్మల్ని గుర్తుపట్టలేదట.... ?

నవీన్‌: నేను నెల్లూరులో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ షూట్‌లో ఉన్నా. అప్పటికే నేను యూట్యూబ్‌లో ఐదారేళ్లు హిందీలో వీడియోలు చేశాను. బాంబేలో ముఖేష్‌ చాబ్రా అని ఆడిషన్‌ కాస్ట్‌ డైరెక్టర్‌ ఉన్నాడు. ఆయన ఆఫీస్‌లో నాది రికార్డు. ఆ ఆఫీస్‌లో 56 రిజెక్టడ్‌ ఆడిషన్స్‌ ఉన్నాయి నావి. అన్నేళ్లుగా ఆడిషన్స్‌ ఇచ్చే సరికి ఆయనకు నా పేరు గుర్తుండిపోయింది. దంగల్‌ డైరెక్టర్‌ ‘చిచోరే’ సినిమాలో ఒక లీడ్‌ క్యారెక్టర్‌ కోసం.. మళయాలీ యాక్టర్‌ నివిన్‌పౌలి ఆడిషన్‌ కోసం ఈయనకు ఫోన్‌ చేశారు. పొరపాటున ఈయన కన్ఫ్యూజ్‌ అయి నాకు కాల్‌ చేశారు. నేను ఆడిషన్‌ చేసి పంపాను. ఆయన నా ఆడిషన్‌ చూసి షాక్‌ అయి వాళ్ల మధ్య జరిగిన మిస్‌ కమ్యూనికేషన్‌ క్లియర్‌ చేసుకున్నారు. నాలుగు నెలల తర్వాత యూట్యూబ్‌లో వైరల్‌ అయిన నా వీడియో చూసి ఆయన మళ్లీ నాకు కాల్‌ చేసి ‘చిచోరే’లో అవకాశం ఇచ్చారు. పేరు కన్ఫ్యూజన్‌ వల్ల హిందీ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు హిందీలో సినిమా అవకాశాలు ఇంకా వస్తున్నాయి.

జాతిరత్నాలు’ సినిమాలో ముందు నుంచే మీ ముగ్గుర్నీ అనుకున్నారా?

నవీన్‌: అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే నాకు నాగ్‌అశ్విన్‌తో పరిచయం ఉంది. ముందు నుంచే నా హిందీ వీడియోలు చూసి ‘మనం ఏదో ఒక సినిమా చేద్దాం’ అంటుండేవాడు. నాగ్‌ అనుదీప్‌ను నా దగ్గరకు పంపాడు. మేం కథను డెవలప్‌ చేశాక... మిగతా ఇద్దరు ఎవరా? అని అనుకుంటుండగా ప్రియదర్శి, రాహుల్‌ అయితే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు ప్రేక్షకుల నుంచి స్పందన చూస్తుంటే ఆ నిర్ణయం కరెక్టే అనిపిస్తోంది. ఇలాంటి ఫ్రెండ్స్‌ ఎవ్వరికీ ఉండకూడదు అన్న రీతిలో వచ్చింది మా కాంబినేషన్‌. ( నవ్వులు...)

‘ఆత్రేయ’ హిట్‌ తర్వాత అవకాశాలు వచ్చాయా?

నవీన్‌: వచ్చాయి. హీరో కొత్తోడు. ఎవ్వరికీ తెలీదు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏవీ లేవు. అయినా సినిమా హిట్‌ అయ్యింది. కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ‘ఏజెంట్‌ ఆత్రేయ’ ద్వారా తెలిసింది. కానీ అలాంటి కథలు దొరకడం కష్టం. అనుదీప్‌ చెప్పిన కథ అలాంటి కథే అనిపించింది. ‘ఏజెంట్‌’ తర్వాత ఏ సినిమా అనౌన్స్‌ చేయట్లేదనే ఒత్తిడి ఉండేది. కానీ టైం తీసుకునే కథలు ఎంచుకోవాలనుకున్నాను. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన వల్ల నేను చేసింది కరెక్టేనేమో అనిపిస్తోంది. సమయం తీసుకున్నా ప్రేక్షకుల్ని నిరాశపరచకుంటే చాలు.

‘ఏజెంట్‌’ సినిమా అలా ఆలోచించే ఒప్పుకున్నారా?

నవీన్‌: ‘ఏజెంట్’ కథ వినగానే క్యారెక్టర్‌లో ఉన్న హ్యూమర్‌కి నేను అట్రాక్ట్‌ అయ్యాను. ఎనిమిది నెలలు స్క్రీన్‌ప్లే మీద వర్క్‌చేశాక ప్రొడ్యూసర్‌కి నెరేట్‌ చేశాము. ఆయన వెంటనే ఒప్పేకున్నారు. ఆ కథ అలా జరిగింది.

‘ఏజెంట్‌’ సినిమా నెల్లూరులోనే ఎందుకు చేయాల్సి వచ్చింది?

నవీన్‌: సెకెండ్‌ ఆఫ్‌ కథ నెల్లూరులోనే నడుస్తుంది. ఆ కథను చెప్పే సమయంలో హిందీలో చేయమని చాలామంది సలహా ఇచ్చారు. కానీ ప్రాంతీయత పోకూడదనే ఉద్దేశంతో నెల్లూరులోనే ఆ సినిమా చేశాం. అప్పట్నుంచి అందరూ నన్ను నెల్లూరు అబ్బాయనుకుంటున్నారు. ‘జాతిరత్నాలు’ కూడా నెల్లూరులో బాగా ఆడుతోంది. దీన్నిబట్టి చూస్తే నేను సగం నెల్లూరు అబ్బాయిని కూడా.

ఉదిత్‌ నారాయణ అంటే మీకు చాలా ఇష్టం అంట కదా?

నవీన్‌: ఆయన నాకు నిజంగానే ఫేవరెట్‌ సింగర్‌ అండి. కానీ అందరూ చేస్తున్న ప్రచారం వల్ల నాకు ఆయన ఫోన్‌ చేసి తిడతారేమో అని భయం వేస్తోంది. నేను ఆయన పాటలు చాలా విన్నాను. దిల్‌ సేలో ఆయన ఒక పాట పాడారు. ఆయన కెరీర్‌లో మోస్ట్‌ శాడ్‌ సాంగ్‌ అదే. ఆయన ఎంత శాడ్‌ సాంగ్‌ ఇచ్చినా హాయిగా పాడతారు. నిజ జీవితంలో కూడా ఆయన ఎప్పుడూ నవ్వుతూ హాయిగానే ఉంటారు. నేను ఆయన మేనరిజం చాలా షోల్లో చేశాను.

స్కూల్లో ఫ్రెండ్స్‌ని బాగా ఏడిపించేవారంట కదా?

నవీన్‌: మా ఫ్రెండ్స్‌ అందరూ కూడా జాతిరత్నాలే. బాయ్స్‌ స్కూల్లో చదవడం మూలాన మమ్మల్ని మేము ఏడిపించుకోవడమే ఉండేది. కానీ ఇంటర్‌ స్కూల్‌ కాంపిటీషన్స్‌లో బాగా పర్ఫార్మ్‌ చేస్తే గర్ల్స్‌ స్కూల్‌కి వెళ్లే అవకాశం వచ్చేది. నాటకాల్లో రాణించేందుకు అప్పుడు నాకు అదే మోటివేషన్‌.

విజయ్‌ దేవరకొండ మీరు మంచి స్నేహితులా?

నవీన్‌: అవును. హైదరాబాద్‌లో థియేటర్‌లో కలిసి చేశాం. ఆడిషన్స్‌ కూడా కలిసి చేసేవాళ్లం. మొన్ననే సినిమా చూసి చాలా నచ్చిందని చెప్పాడు. మేము కలిస్తే జీవితం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం.

టీజర్‌ లాంచ్‌ ప్రభాస్‌గారితో చేయించారు కదా?

నవీన్‌: టీజర్‌ కాదు ట్రైలర్‌ లాంచ్‌ సార్‌. అయితే ఇప్పుడు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయిపోయామనుకోండి ( నవ్వులు...). మాది ఇప్పుడు డీప్‌ లెవల్‌ ఫ్రెండ్షిప్‌. చాలామంది జలస్‌ పడుతుంటారు. అలాంటి వాళ్లు ఉంటేనేగా (నవ్వులు..). ఆయన టైం ఇచ్చారని అలా వీడియో ప్లాన్‌ చేశాం. నేను ఆయన్ని ఫస్ట్‌టైం కలిసింది అప్పుడే. పది పదిహేను నిమిషాలు సమయం ఇస్తారనుకున్నాం. కానీ ఆయన రెండు గంటలకు పైనే మాకు సమయం ఇచ్చారు. దాంతో క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. నిన్న ఆయన స్విగ్గీలో ఆర్డర్‌ పెడితే నాకు ఓటీపీ వచ్చింది అంతలా క్లోజ్‌ అయిపోయాం ( నవ్వులు..)

ఇప్పుడు హిందీలో చేస్తున్నారా?

నవీన్‌: అవునండీ ఒక సినిమా చేస్తున్నాను. కానీ నిర్మాతలు ఇంకా ప్రకటించలేదు. తెలుగులో ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి. ముందు అవి పూర్తి చెయ్యాలి.

మీరు ఎంతమంది?

నవీన్‌: మేం ముగ్గురం. అందర్లో నేనే పెద్దోడిని. అందుకే నేను సెటిల్‌ అవ్వలేదనే ప్రెజర్‌ నాకు ఎక్కువ ఉండేది. నేను స్ట్రగుల్‌ అయ్యే సమయంలో వాళ్లు యూఎస్‌లో డెవలప్‌ అయ్యారు. ఇప్పుడు వాళ్లు అక్కడే సెటిల్‌ అయ్యారు.

అమెరికా ట్రావెల్‌ చేసేటప్పుడు లవ్‌స్టోరీ చెప్పావు వాళ్లతో కొనసాగుతున్నారా?

నవీన్‌: (నవ్వులు...) నాది ఆడియన్స్‌కి నాకు ఉన్న లవ్‌స్టోరినే. ఈ సినిమా హిట్‌ అయ్యాక మళ్లీ చూసుకోవాలి. లవ్‌ ఎలా ఉందో. ఆ అమ్మాయి పేరు చిట్టీ. ఆ పేరు ఇన్‌స్పిరేషన్‌తోనే ఈ సినిమాలో ఆ పేరు పెట్టాం. ( నవ్వులు...)

మీ క్రష్‌ ఎవరు?

నవీన్‌: నాకు రోజుకొకరు మారుతుంటారండి. నేను ఈజీగా ప్రేమలో పడిపోతాను. మనలాంటి అమాయకులు ఏంటంటే ఆలీ గారు.. ఎవరైనా ఏమైనా అంటే గుడ్డిగా నమ్మేస్తుంటారు. నేను చాలా ఏళ్ల నుంచి కత్రినాకైఫ్‌ని నమ్ముతున్నాను. (నవ్వులు..) కాబట్టి కత్రినాకైఫ్‌ నా క్రష్‌ అనుకోండి. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నేను ఛానల్‌ చూసుకుని క్రష్‌ చెబుతుంటాను. (నవ్వులు...)

ఈ సినిమాకు బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌?

నవీన్‌: మహేష్‌బాబుగారు ‘సెన్సేషనల్‌ యాక్టింగ్‌ బ్లూ మై మైండ్‌’ అన్నారు. ఆయన ట్వీట్‌ కూడా చేశారు. నాకు చాలా ఆనందమేసింది. ‘వన్‌ ఆఫ్‌ ద స్టన్నింగ్‌ పర్ఫార్మెన్స్‌’ అని అల్లు అర్జున్‌గారు ట్వీట్‌ చేశారు. ‘ఏజెంట్’ టైమ్‌లో కూడా ఆయన పిలిచి మాట్లాడారు. ఆ సినిమా చాలా నచ్చిందని చెప్పారు. తరువాత బ్రహ్మానందం గారు అరగంట దాకా మాట్లాడి యాక్టింగ్‌ బాగా చేశానని చెప్పారు. చాలా గ్యాప్‌ తరువాత ఆయన ‘జాతిరత్నాలు’లో చేశారు. ఆడియన్స్‌ కూడా ఆయన ఉన్న కోర్టు సన్నివేశాలు వచ్చినప్పుడు చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు.

సినిమా తరువాత ఆడియన్స్‌ మిమ్మల్ని కోతిరత్నాలు అంటున్నారంట?

నవీన్‌: ఈ సినిమా కథ విన్న తర్వాత మాకు పెళ్లిసంబంధాలు రావని మేము ఫిక్స్‌ అయిపోయాం ( నవ్వులు...). ప్రతి గ్రూప్‌లో ఎవడో ఒకడు జాతిరత్నం ఉండాడు. వాడు వస్తే ‘వద్దురా బాబూ వీడు ఆడుకుంటాడు’ అని అనుకుంటుంటారు. ఇందులో పాత్రలన్నీ అలాంటివే. జోగిపేటలో మేం షూట్‌ చేసినప్పుడు కూడా అక్కడి ప్రజల్ని కొన్ని సీన్‌లలో వాడుకున్నాం. వాళ్ల క్యారెక్టర్లు చాలా రియల్‌గా ఉంటాయి.

నాగ్‌ అశ్విన్‌ డైరెక్టర్‌ను నమ్మి ప్రొడ్యూస్‌ చేశారా లేదా కథను నమ్మి ప్రొడ్యూస్‌ చేశారా?

నవీన్‌: అనుదీప్‌ చేసిన షార్ట్‌ఫిల్మ్‌ నాగ్‌అశ్విన్‌కి చాలా నచ్చింది. అప్పట్నుంచే వాళ్లు కలిసి ట్రావెల్‌ చేశారు. ఆ జర్నీలోనే ఈ జాతిరత్నాలు కథ పుట్టింది. ఈ కథ ఓ స్టేజ్‌కి వచ్చాక నాగ్‌ అశ్విన్‌ నాకు కాల్‌ చేసి అనుదీప్‌ను పరిచయం చేశారు.

ఇండస్ట్రీలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌?

నవీన్‌: ప్రభాస్‌గారు ( నవ్వులు..). నేను విజయ్‌ ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్‌ చేశాం కాబట్టి విజయ్‌. చిచోరేలో నా సహనటులు. ట్వీట్‌ చేశాక మహేష్‌బాబుగారు. నిన్న ఆయన కూడా స్విగ్గీలో ఆర్డర్‌ చేస్తే నాకు ఓటీపీ వచ్చింది. (నవ్వులు..)

ఇంత హ్యూమర్‌ మీకు ఎలా వచ్చింది?

అనుదీప్‌: ఏమోనండి ఆడియన్స్‌ని మెప్పించాలని రాస్తూ రాస్తూ అలా వచ్చింది. నేను ఇంతకు ముందు విరించి వర్మ చేసిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను.

మీ ఫేవరెట్‌ డైరెక్టర్‌ ఎవరు?

అనుదీప్‌: హిందీలో రాజ్‌కుమార్‌ సంతోషి, తెలుగులో కె.విశ్వనాథ్‌ గారంటే ఇష్టం. గమనిస్తే కె.విశ్వనాథ్‌గారి సినిమాల్లో కూడా కామెడీ కోణం ఉంటుంది. భవిష్యత్తులో మంచి ఎమోషనల్‌ సినిమాలు కూడా చేయాలనుంది.

సినిమాకు స్పందన ఎలా ఉంది?

అనుదీప్‌: ప్రేక్షకులే కాకుండా పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లు సైతం ఫోన్‌ చేసి బాగుందని అంటున్నారు. ఈ మధ్యలో ఇంతగా నవ్వుకోలేదని చాలామంది అన్నారు. ఈ సినిమాలో మా ఉద్దేశమే నవ్వించడం. చాలా ఆనందంగా ఉంది.

మీరెందుకు షూగానీ చెప్పులుగానీ వేసుకోరు?

అనుదీప్‌: నేనూ నవీన్‌ కలిసి చిన్న ప్రయోగం చేస్తున్నాం. ఎర్త్‌ నుంచి శక్తి వస్తుంది కదండి అది డైరెక్ట్‌గా తీసుకోవడానికని అలా చేస్తున్నాం. ఒక రోజు నేను వేసుకోను. ఒకరోజు నవీన్‌ వేసుకోడు. (నవ్వులు...)

మీరు చేసిన ఫస్ట్‌ షార్ట్‌ ఫిలిం ఏది?

అనుదీప్‌: మిస్డ్‌కాల్‌. ఆ షార్ట్‌ ఫిలిం చూసి నాగ్‌ అశ్విన్‌ చాలా రోజుల తర్వాత ఫోన్‌చేసి సినిమా చేద్దాం అన్నాడు.

నెక్స్ట్‌ ఏం చేయబోతున్నారు?

అనుదీప్‌: నవీన్‌తో ఒక మంచి లవ్‌స్టోరీ చేద్దామనుకుంటున్నా. ఈ సినిమా తర్వాత నవీన్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను. షూట్‌ చేస్తున్నప్పుడు లైట్‌మెన్‌ల దగ్గర నుంచి అందరూ పనులాపి చూసేవాళ్లు. నేను నవీన్‌ యాక్టింగ్‌కి లవ్‌లో పడిపోయాను. స్క్రిప్ట్‌ రాస్తున్నాను. చూడాలి అన్నీ కుదిరితే అవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.