ETV Bharat / sitara

'సూపర్​ హీరో' సినిమా కోసం కత్రినా కసరత్తులు - అలీ అబ్బాస్​ జాఫర్​ వార్తలు

బాలీవుడ్​ దర్శకుడు అలీ అబ్బాస్​ జాఫర్​ దర్శకత్వంలో ఓ సూపర్ ​హీరో చిత్రం రూపొందబోతుంది. ఇందులో కత్రినా కైఫ్​ ప్రధానపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కోసం కత్రినా ప్రత్యేక కసరత్తులు మొదలుపెట్టిందని దర్శకుడు వెల్లడించాడు.

Ali Abbas Zafar to Shoot Superhero Film With Katrina Kaif
సూపర్​హీరో సినిమా కోసం కత్రినా కసరత్తులు
author img

By

Published : Sep 30, 2020, 9:29 AM IST

కరోనా లాక్‌డౌన్‌తో స్తంభించిపోయిన చిత్రసీమలో నెమ్మదిగా షూటింగ్​లు షురూ అయ్యాయి. పెద్ద చిత్రాల నుంచి చిన్న చిత్రాల వరకు సెట్స్‌పైకి వెళుతున్నాయి. హీరో హీరోయిన్లు ధైర్యంగా షూటింగుల్లో పాల్గొంటున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నాయిక కత్రినా కైఫ్​ కూడా తన నుంచి రానున్న సూపర్‌ హీరో కథాంశంతో చిత్రం కోసం సిద్ధమవుతోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కించనున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది.

Ali Abbas Zafar to Shoot Superhero Film With Katrina Kaif
కత్రినా కైఫ్​

"అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరిలో మా సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. ఈ సినిమా కోసం కత్రినా ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేక కసరత్తులు మొదలు పెట్టింది. మా సినిమా మొదలుకావడానికి ముందే ఆమె కొన్ని చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. మా బృందం దుబాయ్‌లోనే ఉంది. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నిపుణులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియాకు ప్రయాణం చేసి పనిచేయడం వాళ్లకు కష్టం కాబట్టి మా టీమ్‌ ఇక్కడి ఉండి పనిచేస్తోంది. ఈ కొత్త చిత్రం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ఈ కథ పూర్తిగా కొత్తగా సాగుతుంది."

- అలీ అబ్బాస్​ జాఫర్​, బాలీవుడ్​ దర్శకుడు

కత్రినా- అలీ అబ్బాస్‌ కలయికలో 'బ్రదర్‌ కీ దుల్హన్‌', 'టైగర్‌ జిందా హై', 'భారత్‌' చిత్రాలు తెరకెక్కాయి. కత్రినా కైఫ్​ నటిస్తున్న 'సూర్యవంశీ' చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తికాగా.. 'ఫోన్​భూత్​' షూటింగ్ జరుపుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.