'అల వైకుంఠపురములో' మ్యూజిక్ కన్సర్ట్.. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సోమవారం జరగనుంది. 54 మంది ప్రముఖ గాయనీగాయకులు.. తన పాటలతో అలరించనున్నారు. సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం ఇప్పటికే పంచుకుంది.
ఇందులో సంగీత దర్శకుడు తమన్, బిగ్‌బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, సిద్ శ్రీరామ్, అర్మాన్ మాలిక్, అనురాగ్ కులకర్ణి, శివమణి, ప్రియ సిస్టర్స్, లేడీ కస్, రాహుల్ నంబియర్, ఎమ్జే 5 తదితరులు సందడి చేయనున్నారు. ఇది 'బిగ్గెస్ట్ ఎవర్ మ్యూజిక్ కన్సర్ట్' అంటూ ఇప్పటికే భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు.
ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు జనవరి 12న రానుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించింది.
ఇది చదవండి: సంక్రాంతి కోసం మహేశ్- బన్నీల మధ్య కుదిరిన రాజీ