సంక్రాంతి కానుకగా వచ్చిన అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమా.. టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. బన్నీ కెరీర్లో అత్యుత్తమ ఓపెనింగ్ వసూళ్లతో పాటు అనేక రికార్డులను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ విశేషాదరణ దక్కించుకుందీ చిత్రం.
యూఎస్‌లో ఈ సినిమా.. అధికారికంగా నాన్ 'బాహుబలి' రికార్డును సొంతం చేసుకుంది. 3.52 మిలియన్ డాలర్ల వసూళ్లతో, రామ్ చరణ్ 'రంగస్థలం' కలెక్షన్లను దాటేసింది. అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో 'బాహుబలి' సిరీస్ తర్వాతి స్థానంలో నిలిచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే హీరోయిన్. తమన్ సంగీతమందించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇదీ చదవండి: అందుకే సినిమాలకు తాత్కాలిక విరామం: అనుష్క శర్మ