ETV Bharat / sitara

'అల వైకుంఠపురములో' ఆల్బమ్ మరో రికార్డు - అల్లు అర్జున్ వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రంలోని పాటలు మరో రికార్డు సాధించాయి. జియో సావన్ యాప్​లో ఏకంగా 20 కోట్ల 'ప్లే'స్ సాధించాయి.

'అల వైకుంఠపురములో' ఆల్బమ్ మరో రికార్డు
'అల వైకుంఠపురములో' ఆల్బమ్ మరో రికార్డు
author img

By

Published : Aug 8, 2020, 7:13 PM IST

స్టైలిష్​ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్​గా నిలిచింది. ఈ సినిమా పాటలూ యూట్యూబ్​లో రికార్డు స్థాయిలో వీక్షణలు దక్కించుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్ర ఆల్బమ్ మరో ఘనతను సాధించింది.

ఈ సినిమా పాటలు జియో సావన్​లో ఏకంగా 200 మిలియన్ 'ప్లేస్'తో రికార్డు సాధించాయి. ఓ ప్రాంతీయ భాషా సినిమా పాటలకు ఈస్థాయిలో ఆదరణ దక్కడం విశేషం. 200 మిలియన్ 'ప్లే'స్ మామూలు విషయం కాదు. అంటే జియో సావన్​లో ఇప్పటి వరకు 20 కోట్ల సార్లు ఈ సినిమా పాటలు విన్నారని అర్థం.

ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్​గా నిలిచింది. ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.