ETV Bharat / sitara

పండగ ఏదైనా.. సందడి అక్షయ్‌దే..!

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ప్రతి సీజన్​నూ టార్గెట్​ చేస్తూ బిజీగా ఉన్నాడు బాలీవుడ్  సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఈ ఏడాది పూర్తవ్వబోతుండగా వచ్చే సంవత్సరంలోనూ ప్రతి పండగను రిజర్వ్​ చేసుకున్నాడు. ఆ సినిమాలేంటో చూద్దాం.

అక్షయ్ కుమార్
author img

By

Published : Nov 17, 2019, 6:31 AM IST

ఒకప్పుడు అగ్ర కథానాయకులు ఏడాదికి ఆరేడు సినిమాలు పట్టాలెక్కించే వారని చెప్తే.. అమ్మో అనుకునే వాళ్లం. సూపర్‌స్టార్‌ కృష్ణ అయితే ఒక సంవత్సరంలో ఏకంగా పదికి పైగా చిత్రాలు సెట్స్‌పైకి తీసుకెళ్లిన రికార్డునూ ఖాతాలో వేసుకున్నారు. మరి ప్రస్తుతానికొస్తే ఈస్థాయిలో చిత్రాలను పట్టాలెక్కిస్తున్న వారు కనిపించే పరిస్థితులు లేవు. ఏడాదికి ఓ మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ ముందుకు తీసుకొస్తే గొప్పగా చూసే పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రయత్నాన్ని కూడా యువ హీరోలు చేస్తేనే తప్ప.. స్టార్‌ హీరోల నుంచి ఒక చిత్రమొస్తేనే అద్భుతం అనుకునే స్థితి ఉంది. కానీ, నేటి తరం మొత్తానికీ తన స్పీడుతో సమాధానం చెప్తున్నాడు ఓ బాలీవుడ్‌ సీనియర్‌ హీరో. ఏడాదికి నాలుగు చిత్రాలను థియేటర్లలోకి తీసుకొస్తూ.. మరోవైపు కొత్తగా మరో నాలుగైదు చిత్రాలను పట్టాలెక్కిస్తూ నవతరానికీ సవాల్‌ విసురుతున్నాడు. అతడే బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌. ఈ ఏడాది ఇప్పటికే 'కేసరి', 'మిషన్‌ మంగళ్‌', 'హౌస్‌ఫుల్‌ 4' చిత్రాలతో సందడి చేసిన అక్కీ.. ఇప్పుడు క్రిస్మస్‌ కానుకతోనూ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. తన తాజా చిత్రం 'గుడ్‌న్యూస్‌'ను డిసెంబరు 27న థియేటర్లోకి తీసుకురాబోతున్నాడు. అయితే ఈ జోరు ఈ ఏడాదికి మాత్రమే పరిమితమైంది కాదు.. వచ్చే సంవత్సరంలోనూ ఇదే రీతిలో కొనసాగబోతుంది.

ప్రస్తుతం సినిమాల విషయంలో అక్షయ్‌ చూపిస్తున్న జోరు చూసి సినీప్రియులంతా అతడినొక మూవీ మిషన్‌గా అభివర్ణిస్తున్నారు. ఇదేదో అతిశయోక్తితో చెప్తున్న మాట కాదు. వచ్చే ఏడాది అక్కీ నుంచి రాబోతున్న చిత్రాల జాబితాను పరిశీలిస్తే ప్రతిఒక్కరూ ఇదే మాట చెప్తారు. అక్షయ్‌ వచ్చే ఏడాది ప్రతి పెద్ద పండగనూ తన చిత్రాల కోసం ఇప్పటికే బుక్‌ చేసేసుకున్నాడు. వీటిలో ముందుగా వచ్చేది మాత్రం 'సూర్యవంశీ'. పోలీస్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు రోహిత్‌ శెట్టి నుంచి రాబోతున్న మరో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులోనూ అక్షయ్‌ను పోలీస్‌ అధికారిగానే చూపించబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది సరిగ్గా ఉగాది, శ్రీరామనవమిల పండగ సీజన్‌.

ఈద్‌కు బాంబ్‌లా పేలతాడట..

ఇలా ఉగాది సంబరాలు ముగుస్తాయో లేదో.. ఆ తర్వాత వచ్చే ఈద్‌ సీజన్‌పైనా అక్షయ్‌ ఇప్పటికే గురిపెట్టేశాడు. ఇది బాలీవుడ్‌కు మంచి సెంటిమెంట్‌ సీజన్‌. సాధారణంగా ఈద్‌ అనగానే సల్మాన్‌ ఖానే గుర్తొస్తాడు. ఎందుకంటే ప్రతి రంజాన్‌కూ ఓ కొత్త చిత్రంతో థియేటర్లలోకి వస్తాడు భాయ్​జాన్. ఈసారి కూడా ఇందు కోసం 'రాధే'ను సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఓవైపు ఈద్‌కు సల్మాన్‌ బరిలో ఉన్నా అక్షయ్‌ కూడా సై అంటూ 'లక్ష్మీబాంబ్‌'లా బాక్సాఫీస్‌ ముందుకు రాబోతున్నాడు. దక్షిణాదిలో హిట్‌గా నిలిచిన 'కాంచన 3'కి రీమేక్‌గా రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. అక్షయ్‌కు జోడీగా కియారా అడ్వాణీ కనిపించబోతుంది. ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటికైతే క్లారిటీ రాలేదు కానీ, ఈద్‌కు రావడం పక్కా.

దీపావళికి చరిత్రాత్మక గాథతో..

సల్మాన్‌కు ఈద్‌ ఎంత సెంటిమెంటో.. అక్షయ్‌కు స్వాతంత్య్ర దినోత్సవం అంత సెంటిమెంట్‌. కానీ, ఈ వేడుకలకు ఈసారి కాస్త విరామమిచ్చాడు అక్కీ. దాని తర్వాత వచ్చే పెద్ద పండగ దీపావళిపై కన్నేశాడు. తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో చేస్తున్న పృథ్వీరాజ్‌ బయోపిక్‌ను దీపావళి కానుకగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దీన్ని ప్రముఖ బుల్లితెర దర్శకుడు చంద్రప్రకాష్‌ ద్వివేది తెరకెక్కిస్తున్నాడు. 1178 నుంచి 1192 మధ్య కాలంలో అజ్మీర్, దిల్లీ ప్రాంతాలను పాలించిన మహారాజా పృథ్విరాజ్‌ చౌహాన్‌ జీవితాధారంగా రూపొందిస్తున్నారు. ఇందులో అక్షయ్‌కు జోడీగా మాజీ మిస్‌ వరల్డ్‌ మానుషీ చిల్లర్‌ సందడి చేయబోతుంది.

క్రిస్మస్‌కు బచ్చన్‌లా..

ఈ ఏడాది క్రిస్మస్‌కు 'గుడ్‌న్యూస్‌'తో వస్తున్నట్లే వచ్చే సంవత్సరం ఆఖరి పండక్కీ ఓ కొత్త చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు అక్షయ్‌. ఫర్హాద్‌ సామ్జి దర్శకత్వంలో తెరకెక్కుబోతున్న ఈ చిత్రానికి 'బచ్చన్‌ పాండే' అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. ఆ మధ్య ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌నూ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో అక్షయ్‌ నుదిటిపై విభూతి రేఖలు, మెడలో రుద్రాక్ష మాలలు, మోకాళ్ల పైవరకు నల్లటి పంచె కట్టుకుని చేతిలో నాన్‌ చాక్‌తో సీరియస్‌గా దర్శనమిచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ఇదొక పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్నట్లు అర్థమైంది. వచ్చే ఏడాది నుంచి సెట్స్‌పైకి వెళ్లబోయే ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. ఇందులో అక్షయ్‌కు జోడీగా కృతి సనన్‌ కనిపించనుంది.

2021ని బుక్‌ చేసేశాడు..

అక్షయ్‌ సినిమాల జోరుకు 2020 క్యాలెండరే కాదు.. 2021లోనూ ఇప్పటికే ఓ పండగ బుక్కయిపోయింది. 2021 గణతంత్య్ర దినోత్సవ వేడుకలకు 'బెల్‌బాటమ్‌' చిత్రంతో సినీప్రియుల్ని పలకరించబోతున్నాడు అక్కీ. ఇదొక పీరియాడిక్‌ కథతో రూపొందబోతుంది. 80ల కాలంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నారట. దీనికి రంజిత్‌.ఎమ్‌.తివారి దర్శకత్వం వహించనున్నాడు. 2021 జనవరి 22న థియేటర్లలోకి వస్తుంది.

ఇవీ చూడండి.. 'మహిళలు బలంగా ఉండరని ఎవరన్నారు..'

RESTRICTION SUMMARY: NO ACCESS HONG KONG
SHOTLIST:
TELEVISION BROADCASTS LIMITED HONG KONG – NO ACCESS HONG KONG
Hong Kong – 16 November 2019
1. People's Liberation Army (PLA) soldiers with brooms jogging to Hong Kong Baptist University
2. Various of PLA soldiers clearing the streets
3. SOUNDBITE (Mandarin) (name unknown), PLA Soldier:
"Our aim is for security and peace. Stopping violence and curbing disorder."
4. Various of PLA soldiers clearing bricks with the help of citizens
5. SOUNDBITE (Mandarin) (name unknown), PLA Soldier:
"This (the cleaning process) is all initiated by us."
6. Hong Kong riot police at the scene
7. Firefighters clearing the road
STORYLINE:
Chinese army troops stationed in Hong Kong came out to clear streets on Saturday, which protesters had strewn with debris to slow down any police advances while they had been on the campus.
People's Liberation Army (PLA) soldiers joined the clean-up outside Hong Kong Baptist University, the site of clashes earlier in the week.
Dozens of troops from a nearby barracks, alongside firefighters and citizens, helped street cleaners and pick up paving stones, rocks and other obstacles which had cluttered the street and prevented traffic from flowing.
Hong Kong riot police kept watch from nearby streets.
The soldiers, jogging in formation, carrying brooms and singing in cadence, were a rare sight on the streets of the city.
China maintains a garrison of about 10,000 soldiers, but they can't operationally deploy without a request from the Hong Kong government.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.