ETV Bharat / sitara

'దోస్తానా 2'కు అక్షయ్​ గ్రీన్​సిగ్నల్​ ఇస్తాడా? - కియారా అడ్వాణీ వార్తలు

'దోస్తానా 2' సినిమా నుంచి తప్పుకున్న కార్తిక్​ ఆర్యన్​ స్థానంలో స్టార్​ హీరో అక్షయ్​కుమార్​ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

Akshay Kumar karan johar
అక్షయ్ కుమార్ కరణ్ జోహార్
author img

By

Published : Apr 21, 2021, 5:22 PM IST

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ 2019లో 'దోస్తానా2' నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. కోలిన్‌ డికున్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇందులో జాన్వీ కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌, లక్ష్య లల్వాని నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల కార్తిక్​ నటించట్లేదని ఇటీవల తెలిపింది నిర్మాణ సంస్థ. ఇప్పుడతడి స్థానంలో స్టార్​ హీరో అక్షయ్​కుమార్​ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తుందని సమాచారం. ఇప్పటికే ధర్మ ప్రొడక్షన్స్​ అధినేత కరణ్​ జోహార్​​.. అక్షయ్​ను సంప్రదించి చర్చలు జరిపారని తెలిసింది. మరి దీనికి ఖిలాడి హీరో గ్రీన్​ సిగ్నల్​ ఇస్తాడో లేదో చూడాలి. అక్షయ్​ కన్నా ముందు
విక్కీ కౌషల్​, రాజ్​కుమార్​ రావ్​ను తీసుకోవాలని చిత్రబృందం భావించిందని వినికిడి.

కార్తిక్​ అందుకే ఔట్
2019 నవంబర్లో‌నే 'దోస్తానా 2' సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. అయితే ఈ చిత్రకథకు సంబంధించి హీరో కార్తీక్‌ కొన్ని మార్పులు చేయాలని సూచించాడట. అందుకు నిర్మాత కరణ్‌జోహార్‌ సైతం అంగీకారం తెలిపారట. కానీ కార్తిక్‌ కాల్షీట్స్ సరిగ్గా కేటాయించకపోవడం వల్ల అతని స్థానంలో మరొకరిని తీసుకోనున్నారని భావించి కార్తిక్​ను తప్పించారని తెలిసింది. ప్రస్తుతం కార్తిక్‌ - అనీష్‌ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ చిత్రం "భూల్‌ భులయ్య2"లో నటిస్తున్నాడు. ఇందులో కియారా అడ్వాణీ కథానాయిక.

ఇవీ చదవండి: బాలీవుడ్​ నటుడు అక్షయ్ కుమార్​​కు కరోనా

అక్షయ్ సినిమా వాయిదా- షూటింగ్​లో రకుల్ ప్రీత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.