ETV Bharat / sitara

కరోనా తర్వాత కెమెరా ముందుకొచ్చిన తొలి నటుడు

author img

By

Published : May 26, 2020, 2:34 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో కెమెరా ముందుకొచ్చిన తొలి నటుడిగా అక్షయ్​ కుమార్​ నిలిచారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించి లాక్​డౌన్​ తర్వాత నిర్వర్తించాల్సిన బాధ్యతలపై తీసిన ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూనే షూటింగ్​ జరిపామని దర్శకుడు బాల్కీ చెప్పారు.

akshay kumar resume shooting amid Coronavirus scare
కరోనా తర్వాత కెమెరా ముందుకొచ్చిన తొలి నటుడు

బాలీవుడ్ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ షూటింగ్ పాల్గొన్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో చిత్రీకరణలో పాల్గొన్న తొలి నటుడిగా నిలిచారు. ఈయన ప్రధానపాత్రలో లాక్​డౌన్​ తర్వాత నిర్వర్తించాల్సిన బాధ్యతలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ యాడ్​ను రూపొందించారు. ప్రముఖ దర్శకుడు బాల్కీ పర్యవేక్షణలో దీనిని చిత్రీకరించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కోసం దీన్ని షూట్​ చేస్తున్నామని దర్శకుడు వెల్లడించారు. ఇందు​లో పాల్గొన్న కొద్దిమంది సిబ్బందికి మాస్క్​లు ధరించి, తగిన ఆరోగ్య భద్రతలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.

akshay kumar resume shooting amid Coronavirus scare
చిత్రీకరణ సెట్​లో అక్షయ్​ కుమార్​

"లాక్​డౌన్​ తర్వాత మనలో ప్రతి ఒక్కరు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై అక్షయ్​ కుమార్​తో ఓ యాడ్​ను​ రూపొందించాం. ఇది కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటన. తగిన ఆరోగ్య భద్రతలతో చిత్రీకరణ జరిపాం. భౌతిక దూరం, పరిశుభ్రమైన సెట్​, క్రిమిసంహారక స్క్రీన్​, ముఖానికి మాస్క్​లతో అధికారుల ఆదేశాలను పాటిస్తూ షూటింగ్​ చేశాం"

- బాల్కీ, ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు

చిత్రీకరణ బృందం

ఎక్కువ భద్రతతో తక్కువ మందితో చిత్రీకరణ చేసేందుకు నిర్మాత అనిల్​ నాయుడు సహకరించారని బాల్కీ తెలిపారు. దీనికి పోలీసుల నుంచి అనుమతి తీసుకుని.. విలువైన సందేశాన్ని ప్రజలకు చేరే ప్రయత్నాన్ని చేశామని వెల్లడించారు. దర్శకుడు బాల్కీ ఇప్పటికే అక్షయ్​ కుమార్​ నటించిన 'పాడ్​మ్యాన్​', 'మిషన్​ మంగళ్​' చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇదీ చూడండి... ఐశ్వర్యను హీరోయిన్​గా పనికిరావని అన్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.