మొన్న ప్రధాని మోదీ.. నిన్న రజనీకాంత్.. నేడు అక్షయ్ కుమార్.. డిస్కవరీ ఛానెల్లో ప్రసారమయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్'లో పాల్గొన్న, పాల్గొనబోతున్న వారి పేర్లివి. ఇప్పటికే మోదీ, బేర్ గ్రిల్స్ షో ప్రసారం కాగా.. రజనీకాంత్ ఇటీవలే షూటింగ్లో పాల్గొన్నాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు.
కర్ణాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్‌లో ఈరోజు షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ చిత్రీకరణలో బేర్ గ్రిల్స్‌తో పాటు అక్షయ్ కుమార్ పాల్గొననున్నాడు. ఈ షో డిస్కవరీ ఛానెల్లో 'వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్' పేరుతో ప్రసారం కానుంది.
ఇవీ చూడండి.. మోదీ తర్వాత అడవుల్లో సాహస యాత్రకు రజనీ