బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సినీ కళాకారులను, కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు.
సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సింటా)కు రూ.45 లక్షల విరాళం అందించారు. దీని ద్వారా 1500 మందికి తలా రూ.3 వేల చొప్పున సహాయం అందింది. కాగా ఇప్పటికే అక్షయ్ పీఎం కేర్స్ నిధికి రూ.25 కోట్లు, పీపీఈ కిట్లు, మాస్కుల కొనుగోలు కోసం ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.3 కోట్లు అందించారు.
ఇదీ చూడండి... అఘోరా పాత్ర కోసం రెండు గెటప్పులు