బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్.. ప్రస్తుతం 'లక్ష్మిబాంబ్'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దక్షిణాది చిత్రం 'కాంచన'కు రీమేక్ ఇది. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ డైరెక్టర్ ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని, పలువురికి సాయం చేస్తూ ఉంటాడు. ఇదే విషయమై షూటింగ్లో కొన్నిసార్లు అక్షయ్‌కు చెప్పాడు. దీంతో చలించిపోయిన అక్కీ.. ట్రాన్స్జెండర్లకు తన వంతు సాయం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని లారెన్స్.. ఫేస్బుక్ వేదికగా పంచుకున్నాడు.
"హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్. నేను మీకో శుభవార్త చెప్పాలనుకుంటున్నా. మేం నిర్వహిస్తున్న లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కొత్త ప్రాజెక్టులో భాగంగా ట్రాన్స్జెండర్లకు ఆవాసం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. 'లక్ష్మి బాంబ్' షూటింగ్ జరుగుతుండగా, మాటల మధ్యలో ఈ విషయాన్ని అక్షయ్‌కు చెప్పాను. ఇది విన్నవెంటనే, తాను రూ.1.5 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. సాయం చేసేవారు దేవుడి కింద లెక్క. ఇప్పుడు మా దేవుడు అక్షయ్ కుమార్. ఈ విషయంలో సహాయం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు" -రాఘవ లారెన్స్, దర్శక నటుడు
'లక్ష్మిబాంబ్'లో కియారా అడ్వాణీ హీరోయిన్. నిన్నే(ఆదివారం) ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈద్ కానుకగా మేలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.