ETV Bharat / sitara

మెగా డైరెక్టర్​తో బ్యాచిలర్​ బాబు నెక్ట్స్​ సినిమా? - akkineni akhil news

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ తన తర్వాతి చిత్రం ప్రముఖ దర్శకుడు సురేందర్​ రెడ్డితో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఖిల్​ కథకు కూడా ఓకే చెప్పేశాడట. ఇక సినిమా పట్టాలెక్కడమే ఉంది. ప్రస్తుతం కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు అఖిల్​.

akhil latest news
బ్యాచిలర్​ బాబు నెక్ట్స్​ సినిమా ఏంటి..?
author img

By

Published : Aug 13, 2020, 3:57 PM IST

సినిమా విజయం సాధిస్తే వచ్చే ఆనందమే వేరు. అటు హీరోకు, ఇటు అభిమానులకు అదో కిక్‌. అయితే అలాంటి కిక్‌ను అనుభవించాలని చూస్తున్న హీరోల్లో అఖిల్‌ ఒకడు. 'అఖిల్‌'తో మొదలైన ప్రయాణంలో ఇప్పటివరకు సరైన విజయం దక్కలేదు. దీంతో సినిమా కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అలా ఎంచుకున్నదే 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'. ఇప్పుడు అంతే ఆలోచించి మరో సినిమాకు ఓకే చెప్పేశాడట అక్కినేని చిన్నోడు.

'సైరా'తో భారీ విజయం అందుకున్న సురేందర్‌ రెడ్డితో అఖిల్‌ తర్వాతి సినిమా ఉండబోతోందనేది టాలీవుడ్‌ వర్గాల సమాచారం. స్టైలిష్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్‌ రెడ్డి 'సైరా' తర్వాత ఇంకా కొత్త సినిమా ప్రారంభించలేదు. ఆ హీరో, ఈ హీరో అంటూ రకరకాల పేర్లు వినిపించినా ఏదీ సినిమా రూపం దాల్చలేదు. ఇప్పుడు అఖిల్‌కు ఓ కథ చెప్పారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ సినిమా విషయంలో ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం అఖిల్‌ బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'లో నటిస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ ఇటీవల విడుదలైంది. పూజా హెగ్డే, అఖిల్‌ రొమాంటిక్‌గా ఉన్న ఆ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.