నటి కంగనా రనౌత్ తనపై చేసిన ఆరోపణల విషయమై ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ కోర్టును ఆశ్రయించారు. గురువారం అందుకు సంబంధించిన వాంగ్మూలాన్ని ఇచ్చారు. తన న్యాయవాది ద్వారా ఆ వాంగ్మూలాన్ని కోర్టు ముందుంచారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన నటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కంగన గత నెలలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పేరు ప్రస్తావించిందని, తన కీర్తికి భంగం కలిగించిందని జావేద్ అక్తర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. కంగన చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని జావేద్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వాదనలను విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను డిసెంబరు 19కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: కంగనపై పరువునష్టం దావా వేసిన జావేద్