ETV Bharat / sitara

'అఖండ' కొత్త అప్డేట్​.. 'సీటీమార్'​ మేకింగ్​ వీడియో - లాల్​ సింగ్​ చద్ధా షూటింగ్​ పూర్తి

కొత్త సినిమా అప్డేట్స్(cinema updates news)​ వచ్చాయి. ఇందులో బాలకృష్ణ, విజయ్​ సేతుపతి, ఆమిర్​ ఖాన్​, గోపిచంద్​ చిత్ర వివరాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం...

akhanda
అఖండ
author img

By

Published : Sep 17, 2021, 5:23 PM IST

బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'అఖండ'(balakrishna akhanda poster) శరవేగంగా ముస్తాబవుతోంది. ఇప్పుడీ సినిమాలోని ఓ గీతాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. 'అడిగా అడిగా' లిరికల్​ వీడియో సాంగ్​ను​ సెప్టెంబరు 18న(శనివారం) సాయంత్రం 5.33గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది. దసరాకు ఈ సినిమా సందడి చేసే అవకాశాలు ఉన్నాయి. పవర్‌పుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి(boyapati balakrishna movies) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో సందడి చేయనున్నారు. ప్రగ్యాజైశ్వాల్​ కథానాయిక. పూర్ణ, శ్రీకాంత్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

akhanda
అఖండ

సాంగ్​ రిలీజ్​కు రెడీ​

విజయ్​సేతుపతి, నయనతార, సమంత కలిసి నటిస్తున్న సినిమా 'కాతువాకులా రెండు కాదల్‌'(kaathuvaakula rendu kaadhal release date). ఈ చిత్రంలో ఓ గీతాన్ని సెప్టెంబరు 18(శనివారం) మధ్యాహ్నం 2.22 గంటలకు రిలీజ్​ చేయనున్నారు. ఈ మూవీకి విఘ్నేశ్​ శివన్​ దర్శకత్వం వహించగా.. అనిరుధ్​ స్వరాలు సమకూరుస్తున్నారు.

vijaysethupati
కాతువాకులా రెండు కాదల్‌

మేకింగ్​ వీడియో

గోపిచంద్​, తమన్నా జంటగా నటించిన సినిమా 'సీటీమార్'(seetimaarr gopichand)​. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన మేకింగ్​ వీడియోను విడుదల చేసింది మూవీటీమ్. దాన్ని మీరూ చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

షూటింగ్​ పూర్తి

ఆమీర్​ ఖాన్​, కరీనాకపూర్​ జంటగా నటిస్తున్న సినిమా 'లాల్​ సింగ్​ చద్ధా'(lal singh chadha aamir khan). ఇటీవల కరీన తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ఇప్పుడీ సినిమా షూటింగ్​ మొత్తం పూర్తైనట్లు తెలిపింది చిత్రబృందం. ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్స్​ పనులు జరుగుతున్నాయని వెల్లడించింది. ఈ సినిమాకు అద్వైత్​ చందన్​ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్​కు(డిసెంబరు 25) థియేటర్లలో సందడి చేయనుందీ చిత్రం.

lal singh chaddha
లాల్​ సింగ్​ చద్ధా

షూటింగ్​ షురూ..

కరోనా వల్ల వాయిదా పడిన 'ఎఫ్3'(f3 venkatesh movie) షూటింగ్ పునఃప్రారంభమైంది. ఈ విషయాన్ని ట్వీట్​ చేసింది మూవీ టీమ్​. అనిల్​రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిల్​రాజు నిర్మిస్తుండగా వెంకటేశ్​, వరుణ్​ తేజ్,​ తమన్నా, మెహరీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

F3
ఎఫ్​ 3

ఇదీ చూడండి: 'భీమ్లానాయక్'​ నుంచి లేటెస్ట్​ అప్డేట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.