ETV Bharat / sitara

సెట్ నుంచి పారిపోదాం అనుకున్నా: ఆకాశ్ - ఆకాశ్ పూరి ప్రభాస్

ఆకాశ్ పూరీ హీరోగా అనిల్ పాదురి తెరకెక్కించిన చిత్రం 'రొమాంటిక్'(akash puri romantic movie). ఈ సినిమా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించిన ఆకాశ్.. సినిమా గురించి పలు విషయాలు వెల్లడించాడు.

Akash Puri
ఆకాశ్
author img

By

Published : Oct 27, 2021, 5:31 AM IST

Updated : Oct 27, 2021, 12:54 PM IST

"నా విజయాలను చూసి మా నాన్న కాలర్‌ ఎగరేసుకుని తిరగాలి" అంటున్నాడు యువ కథానాయకుడు ఆకాశ్‌ పూరీ(akash puri romantic movie). బాల నటుడిగా వెండితెరకు పరిచయమైన ఆకాశ్‌.. కథానాయకుడిగా వరుస చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా అనిల్‌ పాదురి దర్శకత్వంలో ఆకాశ్‌ నటించిన చిత్రం 'రొమాంటిక్‌'(akash puri romantic movie). పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్‌ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు (akash puri romantic movie release date). ఈ సందర్భంగా ఆకాశ్‌ పూరీ విలేకరులతో మాట్లాడాడు.

పూరీ జగన్నాథ్‌ పనిపోయిందన్నారు!

"మా నాన్న సక్సెస్‌ను నేను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నానో.. నా సక్సెస్‌ను కూడా ఆయన అంతే ఎంజాయ్ చేయాలి. ఆ విజయం ఈ సినిమాతో వస్తుందా? వేరే ఏ సినిమాతోనైనా వస్తుందా? అని కాదు. నేను సక్సెస్ కొట్టాలి.. మా నాన్న కాలర్ ఎగరేయాలి.. ఎంజాయ్ చేయాలి. రొమాంటిక్ పట్ల నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను. పూరి పనైపోయిందని చాలా మంది అన్నారు. నా పని కూడా అయిపోయిందని అన్నారు.. ఆ మాటలు వింటూ ఉండే వాడిని. కానీ 'ఇస్మార్ట్ శంకర్‌'తో అంతా వెనక్కి వచ్చింది"

romantic
రొమాంటిక్

ఇద్దరం షాకయ్యాం!

"అనిల్ గారు నాన్న దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. ఆయన సీజీ డిపార్ట్‌మెంట్‌ చూసుకునే వారు. ఆయన దర్శకత్వం చేస్తారని, అందులో నేను హీరోగా నటిస్తానని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఓ రోజు నాన్న గారు సడెన్‌గా పిలిచి ఈ సినిమాకు ఆకాశ్‌ హీరో.. నువ్వు దర్శకుడివి అని అనిల్‌తో అన్నారు. ఇద్దరం షాకయ్యాం. 'మెహబూబా' విడుదలైన ఆరు నెలలకు ఈ ప్రాజెక్ట్ మొదలైంది. 'ఇస్మార్ట్ శంకర్', 'రొమాంటిక్' ఒకే సమయంలో జరిగాయి. ఇస్మార్ట్ పెద్ద హిట్ అవ్వడం వల్ల 'రొమాంటిక్' ఇంకా బాగా తీయాలని అనుకున్నాం. అప్పుడు రమ్యకృష్ణ గారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆమె రావడం వల్ల సినిమా స్థాయి మారిపోయింది. అలా సినిమాను పూర్తి చేసే సమయానికి లాక్​డౌన్ వచ్చింది. మొత్తానికి అలా ఆలస్యమైంది"

ఓటీటీకి ఇచ్చేస్తారేమోనని భయమేసింది!

"కరోనా కారణంగా పలు సినిమాలు ఓటీటీ బాటపట్టాయి. 'రొమాంటిక్‌' కూడా అలానే అవుతుందేమోనని భయపడ్డా. ఎందుకంటే ఇది అందరితో కలిసి థియేటర్లో కూర్చుని చూసే సినిమా. 'క్రాక్', 'ఉప్పెన', 'లవ్‌స్టోరీ' తదితర చిత్రాలు థియేటర్‌లకు ఊపిరిపోశాయి. 'రొమాంటిక్'లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌, భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయి. ఇది కేవలం యూత్ సినిమా మాత్రమే కాదు. ఫ్యామిలీ అంతా చూసే సినిమా"

romantic
రొమాంటిక్

రమ్యకృష్ణతో చేయడం పెద్ద సవాల్‌

"చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు అనే పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. వాస్కోడిగామా అనే పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోతుంది. మా నాన్న ఈ సినిమా లైన్‌ను ఎప్పుడో రాసుకున్నారు. ఈ కథలోకే నేను వచ్చాను. రొమాంటిక్ కథను నాకు ఇచ్చారు. చిన్నప్పటి నుంచి హీరోలందరూ మా నాన్న డైలాగ్స్ చెబుతుంటే ఆనందపడేవాడిని. నేను ఇప్పుడు ఆయన డైలాగ్స్ చెబుతుంటే సంతోషంగా ఉంది. సినిమా చూసి నాన్న గారితో పాటు అందరూ ఎమోషనల్ అయ్యాం. చాలా బాగా వచ్చింది రమ్యకృష్ణ గారితో పని చేయడమే పెద్ద ఛాలెంజింగ్. ఆమెతో పని చేయడం నా అదృష్ణం, గౌరవంగా భావిస్తున్నా. ఆమెకు నాకు వచ్చే సీన్లు పోటాపోటీగా ఉంటాయి. 'ఏం చేయమంటే అది చేస్తా. దూకమంటే దూకుతాను.. కానీ ఈ రొమాన్స్ కాస్త తగ్గించు నాన్నా' అని అన్నాను. 'సినిమానే రొమాంటిక్.. అందులో రొమాన్స్ తగ్గించమంటావ్ ఏంట్రా' అని అన్నారు. సెట్‌లో ఎన్నో సార్లు భయమేసింది. పారిపోదామా? అని అనిపించింది. స్క్రీన్ మీద రొమాన్స్ చేయడం చాలా కష్టం"

ప్రభాస్‌ స్వయంగా ఫోన్‌ చేశారు

"ప్రభాస్ గారికి నేనంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తెలుసు. రొమాంటిక్ ప్రమోషన్స్ కోసం మేం ఎవ్వరం కూడా ప్రభాస్ గారికి ఫోన్ చేయలేదు. ఆయనే ఫోన్ చేసి అడిగారు. అంత పెద్ద స్టార్‌ను మనం ఫోన్ చేసి అడుగుదామా? వద్దా? అని అనుకుంటుంటే ఆయనే ఫోన్ చేసి అడిగారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్‌లో ఒక రోజు మొత్తం మాకు ఇచ్చారు. ఆయనతో ఉన్న ఆ ఒక్క రోజును ఎప్పటికీ మర్చిపోలేను"

నాన్నకు డబ్బులిచ్చి కథ తీసుకుంటా!

"ఓ పదేళ్ల తరువాత అయినా సరే దర్శకత్వం చేస్తా. కథ రాయడం నాకు రాదు. మా నాన్నకు రెమ్యూనరేషన్ ఇచ్చి కథ తీసుకుంటా. డైరెక్షన్ మాత్రం చేస్తా. సినిమా ప్రపంచం తప్ప మరొకటి తెలియదు. హీరోగా కాకపోతే అసిస్టెంట్ డైరెక్టర్‌ అయ్యుండే వాడిని. కానీ సినిమా ఇండస్ట్రీలోనే ఏదో ఒకటి చేస్తుండేవాడిని. నాకు రజనీకాంత్, చిరంజీవి దేవుళ్లతో సమానం. వారిద్దరూ చాలా ఇష్టం. వారి సినిమాలు ఎక్కువగా చూస్తాను. చోర్ బజార్ సినిమా చాలా బాగా వస్తోంది. చాలా హ్యాపీగా ఉన్నాం. బచ్చన్ సాబ్ అనే పాత్రలో కనిపిస్తా. కెరీర్ ప్రారంభంలోనే ఇంత మంచి పాత్రలు దక్కడం ఆనందంగా ఉంది. కమర్షియల్‌పరంగా చాలాపెద్దగా ఉంటుంది. అది యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. దాదాపు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది విడుదల చేస్తాం."

ఇవీ చూడండి: దివ్యాంగ అభిమాని పాదయాత్ర.. చలించిన చిరంజీవి

Last Updated : Oct 27, 2021, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.