ETV Bharat / sitara

పశువైద్యుడి కథతో అజయ్​ దేవగణ్​ 'గోబర్​'

author img

By

Published : Apr 17, 2021, 9:46 AM IST

బాలీవుడ్​ నటుడు అజయ్​ దేవ్​గణ్​ నిర్మాణంలో 'ది బిగ్​బుల్​' తర్వాత మరో చిత్రం తెరకెక్కనుంది. 1990ల నేపథ్యంతో సాగే కథ సినిమాను రూపొందించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 'గోబర్​' టైటిల్​తో వచ్చే ఏడాది ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలిపింది.

Ajay Devgn, Siddharth Roy Kapur to bankroll satire titled 'Gobar!'
అజయ్​ దేవగణ్​ 'గోబర్​'

ప్రముఖ బాలీవుడ్​ నటుడు అజయ్​దేవ్​గణ్​ నుంచి కొత్త చిత్రం రానుంది. సిద్ధార్థ్​ రాయ్​ కపూర్​ నిర్మించనున్న ఈ సినిమా పేరును 'గోబర్​'గా నిర్ణయించినట్లు ప్రకటించారు. 1990ల నాటి కథతో సాగే చిత్రమిది. స్థానిక ఆస్పత్రిలో జరుగుతున్న అవినీతి, లంచగొండితనానికి వ్యతిరేకంగా పోరాడే ఓ పశువేద్యుడి నేపథ్యంలో కథ నడుస్తుంది.

అజయ్​ దేవ్​గణ్​ మాట్లాడుతూ.. "గోబర్​ కథ అందరికీ బాగా దగ్గరయ్యేలా ఉంటుంది. చాలా వినోదాత్మకంగా సాగుతుంది. థియేటర్​కు వచ్చే ప్రేక్షకులకు వినోదం, విశ్రాంతి కచ్చితంగా దొరుకుతాయి. నవ్వులు పంచడమే కాదు.. కాస్త ఆలోచననూ రేకెత్తిస్తుంది ఈ చిత్రం" అని చెప్పారు. సాబల్​ షెకావత్​ తెరకెక్కించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్​పైకి వెళ్లనుంది.

ఇదీ చూడండి: ప్రభాస్‌ జాబితాలో మరో సినిమా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.