ETV Bharat / sitara

చరణ్-తారక్​ల గురువుగా అజయ్​ దేవగణ్! - స్వాతంత్ర్య సమరయోధుడిగా అజయ్​ దేవగణ్

'ఆర్ఆర్ఆర్'లో హీరోలిద్దరికి గురువుగా నటిస్తున్న అజయ్ దేవగణ్.. స్వాతంత్ర్య సమరయోధుడిగానూ కనిపించనున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది జనవరి 8న థియేటర్లలోకి రానుంది.

స్వాతంత్ర్య సమరయోధుడిగా అజయ్​ దేవగణ్
అజయ్ దేవగణ్ రాజమౌళి
author img

By

Published : Jun 24, 2020, 5:32 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'(రౌద్రం రణం రుధిరం). రామ్​చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ వీరికి గురువు పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ బాలీవుడ్​ నటుడు స్వాతంత్ర్య సమరయోధుడిగానూ కనువిందు చేయనున్నారు.

Ajay Devgn set to mentor Ram Charan, Jr NTR
చరణ్-తారక్​లతో అజయ్ దేవగణ్

ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'కు సంబంధించి 75 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్​డౌన్​కు ముందు రామోజీ ఫిల్మ్​సిటీలో వేసిన 1900ల నాటి సెట్​లో అజయ్​పై 10 రోజులపాటు షూటింగ్ చేశారు. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తిరిగి పనిమొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తుండగా, డీవీవీ దానయ్య సుమారు రూ.350 కోట్లతో నిర్మిస్తున్నారు. వచ్చే జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది 'ఆర్ఆర్ఆర్'.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.