ETV Bharat / sitara

బాలీవుడ్​ సింగం అజయ్​ దేవ్​గణ్​ బర్త్​డే స్పెషల్​ - కాళీ చరణ్​

అవుట్‌ డోర్‌ షూటింగ్‌లకు ప్రైవేట్‌ జెట్‌లో వెళ్లే హీరోగా అజయ్‌ దేవ్‌గణ్​కి హిందీ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన పేరుంది. వ్యక్తిగత వేడుకలకు, కుటుంబ సమేతంగా హాజరయ్యే వివిధ కార్యక్రమాలకు, పర్యటనలకు తన ప్రైవేట్‌ జెట్‌ని వినియోగించడం అతనికి ఎప్పటినుంచో అలవాటు. అంతలా...తన హోదాని చాటుకున్న హీరో అజయ్​ దేవగణ్​. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్​ఆర్​ఆర్​ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న బాలీవుడ్ సింగంపై ప్రత్యేక కథనం.

Ajay devgan Birthday special story on his movie career
అవుట్​డోర్​ షూటింగ్​లకు ప్రైవేట్​ జెట్​ వాడే హీరో
author img

By

Published : Apr 2, 2020, 7:31 AM IST

Updated : Apr 2, 2020, 5:25 PM IST

విశాల్‌ దేవ్‌గణ్​...ఈ పేరుతో బాలీవుడ్‌ హీరో ఎవరైనా ఉన్నారా? అనడిగితే కాస్త తికమక పడొచ్చు. కానీ, అజయ్‌ దేవ్‌గణ్​ అనగానే టుక్కున అతడి రూపం కళ్లలో మెదలడంతో పాటు అతను నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులు ఇట్టే గుర్తొస్తాయి. ఒకటా రెండా? 1985లో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి దక్షిణాది డైరెక్టర్‌ బాపు దర్శకత్వంలో 'కాళీ చరణ్​' సినిమా చేసిన అజయ్‌ దేవ్‌గణ్​ పూర్తి స్థాయి కథానాయకుడిగా 1991లో 'ఫూల్‌ అర్‌ కాంటే' సినిమా ద్వారా ట్రాక్‌ లోకి వచ్చాడు.

అప్పటినుంచి ఇప్పటి వరకూ విరామం లేకుండా నటిస్తూ హీరోగా తన స్టామినా చాటుకుంటూనే ఉన్నాడు. వెండితెర పైనే కాకుండా కొన్ని టెలివిజన్‌ షోలలోనూ సందడి చేశాడు. కొన్ని చిత్రాలకు దర్శకుడిగా.. మరికొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. తనకంటూ క్రేజ్, ఇమేజ్‌ తెచ్చుకున్నాడు.

Ajay devgan Birthday special story on his movie career
అజయ్‌ దేవ్‌గణ్​

శతచిత్ర కధానాయకుడు

అజయ్‌ దేవ్‌గణ్​ శత చిత్ర కథానాయకుడు. సుదీర్ఘంగా సాగిన సినీ యానంలో అతను అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలిం ఫేర్‌ అవార్డులతో పాటు 2016లో భారత ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. 1991లో మొదటి సినిమా 'ఫూల్‌ అర్‌ కాంటే'తోనే బెస్ట్‌ మేల్‌ డెబ్యూ ఆర్టిస్ట్‌గా ఫిలింఫేర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా వరించి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ విజయాల మజిలీలు ఎన్నింటినో దాటాడు. 1992లో 'జిగర్‌', 1993లో 'సంగ్రామ్', 1994లో 'విజయ్‌ పద్‌', అదే సంవత్సరం 'దిల్‌ వాలే', 'సుహాగ్‌', 1995లో 'నాజియాజిర్‌', 1996లో 'దిల్‌ జలే', 1997లో 'ఇష్క్‌', 1998లో మహేష్‌ భట్‌ సినిమా 'జకం' చిత్రాల్లో నటించాడు.

'జకం' చిత్రానికి ఉత్తమ నటుడిగా మొట్టమొదటిసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. రొమాంటిక్‌ డ్రామాల స్పెషలిస్ట్‌ అయిన సంజయ్‌ లీలా భన్సాలీ చిత్రం 'హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌' ద్వారా అజయ్‌ దేవ్‌గణ్​ అందుకున్న ఖ్యాతి అంతా ఇంతా కాదు. ఆ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులంతా అతడి గురించే మాట్లాడుకున్నారు. ఈ చిత్రంలో వనరాజ్‌ పాత్రలో కనిపించిన అజయ్‌ దేవ్‌గణ్​ తను పెళ్లి చేసుకున్న భార్యని ఆమె లవర్‌తో కలిపేందుకు ప్రయత్నించడం...ఆ ప్రయత్నంలో నటుడిగా అతడు పండించిన భావోద్వేగాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

2000 సంవత్సరం ప్రారంభంలో అజయ్‌ దేవ్‌గన్‌ నటించిన రాంగోపాల్‌ వర్మ సినిమా 'కంపెనీ'లో గ్యాంగ్‌ స్టర్‌ పాత్ర విమర్శకుల ప్రశంసలనూ అందుకుంది. ఈ చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటుడిగా అజయ్‌ దేవ్​గణ్​ ఫిలింఫేర్‌ క్రిటిక్స్‌ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 2003లో 'దివాన్ జీ' అనే చిత్రంలో నటనకుగాను ఉత్తమ విలన్‌ అవార్డు అందుకున్నాడు. 'ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌' చిత్రం ద్వారా అతడు రెండోసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. ఓ పక్క క్లిష్టమైన పాత్రల్లో నటిస్తూ.. మరో పక్క కమర్షియల్‌ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు.

2004లో 'రైన్‌ కోట్‌', 'గంగా జల్‌', 'యువ' చిత్రాల ద్వారా విజయాల్ని అందుకున్నాడు. 2005లో 'అపహరణ్‌', 2006లో 'ఓంకార', 'గోల్‌ మాల్‌', 'ఫ్యాన్‌ అన్‌ లిమిటెడ్‌', 2007లో 'క్యాష్‌', 2008లో 'హల్లా బోల్‌', 'గోల్‌ మాల్‌ రిటర్న్స్​', 2009లో 'ఆల్‌ ది బెస్ట్‌ ఫన్‌ బిగిన్స్‌', 2010లో 'వన్స్‌ అపాన్ ఏ టైమ్ ఇన్‌ ముంబయి', 'గోల్‌ మాల్‌ త్రీ', 'రాజ్‌ నీతి', 2011లో 'సింగం', 2012లో 'బోల్‌ బచ్చన్‌', 'సన్నాఫ్‌ సర్ధార్‌', 2014లో 'సింగం రిటర్న్స్', 2015లో 'దృశ్యం', 2016లో 'శివాయ్', 2017లో 'బాద్షా', 'గోల్‌ మాల్‌ ఎగైన్‌', 2018లో 'రైడ్‌', 'హెలికాఫ్టర్‌ ఈలా', 'సింబా', 2019లో 'దే దే ప్యారే దే', 2020లో 'తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌' లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కుస్తున్న 'ఆర్ఆర్ఆర్​' చిత్రంతో పాటు 'మైదాన్​'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

బుల్లితెరపై..

బుల్లితెరపై అజయ్‌ దేవ్‌గణ్​ వివిధ పాత్రలు పోషించాడు. 2002 నుంచి 2004 వరకూ దేవి శీర్షికతో ఓ కార్యక్రమానికి నిర్మాతగా వ్యవహరించాడు. 2008లో 'రాక్‌ అండ్‌ ఎన్‌ రోల్‌ ఫామిలీ' కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2012లో 'రామ్‌ లీల అజయ్‌ దేవ్‌ గన్‌ కీ సాత్‌' అనే కార్యక్రమానికి ప్రజెంటర్‌గా పనిచేశాడు. 2018లో 'స్వామి రాందేవ్‌...ఏక్‌ సంఘర్ష్​' కార్యక్రమానికి నిర్మాతగా ఉన్నాడు. అలాగే అజయ్‌ దేవ్‌గణ్​ ఫిలిమ్స్‌ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పి అభిరుచిగల చిత్రాలను నిర్మించాడు.

కుటుంబ నేపథ్యం

1969 ఏప్రిల్‌ 2న జన్మించిన అజయ్‌ దేవ్‌గణ్​ పంజాబీ. దేశ రాజధాని ఢిల్లీలో పుట్టి పెరిగినా మూలాలు మాత్రం అమృత్‌సర్‌లో ఉన్నాయి. తల్లిదండ్రులు సినీ నేపథ్యాన్ని కలిగిన వారే కావడం విశేషం. అజయ్‌ దేవ్‌గణ్​ తండ్రి వీరు దేవగణ్​ యాక్షన్‌ ఫిలిం డైరెక్టర్‌గా, స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. తల్లి వీణ దేవగణ్​ నిర్మాత. సోదరుడు అనిల్‌ దేవగణ్​ స్క్రీన్​ రైటర్, ఫిలిం మేకర్‌. ముంబయి జుహులోని సిల్వర్‌ బీచ్‌ కాలేజ్‌లో అజయ్‌ దేవ్‌గణ్​ పట్టభద్రుడయ్యాడు.

అజయ్‌ దేవ్‌గణ్​ కుటుంబం

అజయ్‌ దేవ్‌గణ్​ భార్య కాజోల్‌ హీరోయిన్​. 'గూండా రాజ్‌' సినిమా నిర్మాణ సమయంలో వీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అప్పట్లో సరైన జంట కాదంటూ మీడియా కోడై కూసినా... అజయ్‌ దేవ్‌గణ్​, కాజోల్‌ 1999 ఫిబ్రవరి 24న పెళ్లి చేసుకుని మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనిపించుకున్నారు. ఈ జంటకి ఇద్దరు పిల్లలు. 2002లో కూతురు న్యాస పుట్టింది. 2010లో కుమారుడు యుగ్‌ పుట్టాడు. ఇప్పటికీ అలుపెరుగకుండా సృజనశీలిగా కొనసాగుతున్న అజయ్‌ దేవ్‌గణ్​ మరిన్ని మంచి చిత్రాల్లో నటించి మరింత పేరు తెచ్చుకోవాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి.. 'పెళ్లి చూపులు' దర్శకుడితో యంగ్​టైగర్!​

Last Updated : Apr 2, 2020, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.