ETV Bharat / sitara

అక్షయ్​ అభిమానులతో గొడవలు పడొద్దు: అజయ్ - అజయ్​ దేవగణ్​ సమాచారం

రోహిత్​శెట్టి తెరకెక్కించిన 'సూర్యవంశీ' సినిమా ప్రచారచిత్రాన్ని సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా మాట్లాడిన అజయ్​దేవగణ్.. అక్షయ్​ అభిమానులతో గొడవలు లేకుండా స్నేహభావంతో మెలగాలని తన ఫ్యాన్స్​కు విజ్ఞప్తి చేశాడు.

Ajay-Akshay request fans to stop fighting, say they have each others back
అక్షయ్​ అభిమానులతో గొడవలు పడొద్దు: అజయ్​ దేవగణ్​
author img

By

Published : Mar 2, 2020, 9:56 PM IST

Updated : Mar 3, 2020, 5:17 AM IST

అక్షయ్​కుమార్ అభిమానులతో గొడవలు పడొద్దని అజయ్ ​దేవగణ్​ తన అభిమానులకు సూచించాడు. ఈ హీరోలిద్దరూ నటించిన 'సూర్యవంశీ' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ముందస్తు విజ్ఞప్తి చేశాడు.​ సోమవారం ముంబయిలో జరిగిన ఈ సినిమా ప్రచారచిత్రం విడుదల కార్యక్రమంలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు అజయ్​​.

"మేమిద్దరం బాగానే ఉన్నాం. కాబట్టి ఫ్యాన్స్​ గొడవలు పడొద్దు. ఈ విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. అక్షయ్​, నేను కలిసి ఈ సినిమాకు చాలా కష్టపడ్డాం. తెరపై ఆ అనుభూతి మీరూ పొందుతారు. మా ఇద్దరి అభిమానులు కలిసి వెళ్లి సినిమాను ఆస్వాదించండి.

- అజయ్​ దేవగణ్​, కథానాయకుడు

అక్షయ్, అజయ్ కలిసి నటించిన 'ఫూల్​ ఔర్​ కాంటే' రోజులను గుర్తు చేసుకున్నారు వీరిద్దరు. ఈ సినిమాతో అజయ్​ హీరోగా, అక్షయ్​ కుమార్​ కామిక్​రోల్​లో వెండితెరకు పరిచయమయ్యారు.

Ajay-Akshay request fans to stop fighting, say they have each others back
'సూర్యవంశీ' సినిమా ట్రైలర్​ విడుదల కార్యక్రమంలో చిత్రబృందం

ఇప్పటికే అజయ్ దేవగణ్​తో​ 'సింగం', రణ్​వీర్​ కపూర్​తో 'సింబా' చిత్రాలు తెరకెక్కించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు రోహిత్​శెట్టి. ఈ సూపర్​కాప్​ సిరీస్​లో తెరకెక్కించిన మూడో సినిమా 'సూర్యవంశీ'. అక్షయ్​ సరసన కత్రినాకైఫ్​ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ మూవీలో అజయ్​ దేవగణ్​, రణ్​వీర్​ కపూర్​లు.. వారు పోషించిన సూపర్​కాప్​ పాత్రల్లోనే తెరపై కనువిందు చేయనున్నారు. మార్చి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందీ చిత్రం.

ఇదీ చూడండి.. పవర్​ స్టారూ.. ట్రెండింగ్​లో హుషారు

Last Updated : Mar 3, 2020, 5:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.