ETV Bharat / sitara

ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగటివ్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - ఐశ్వర్యా రాయ్ కోనా

కరోనా కారణంగా ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐశ్వర్యా రాయ్, తన కూతురు ఆరాధ్యలకు నెగటివ్​గా తేలింది. ప్రస్తుతం వీరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఐశ్వర్యా, ఆరాధ్యలకు నెగటివ్
ఐశ్వర్యా, ఆరాధ్యలకు నెగటివ్
author img

By

Published : Jul 27, 2020, 4:44 PM IST

Updated : Jul 27, 2020, 4:57 PM IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడింది. కొన్ని రోజులుగా బిగ్​బీ, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగటివ్ రావడం వల్ల వారు డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

  • Thank you all for your continued prayers and good wishes. Indebted forever. 🙏🏽
    Aishwarya and Aaradhya have thankfully tested negative and have been discharged from the hospital. They will now be at home. My father and I remain in hospital under the care of the medical staff.

    — Abhishek Bachchan (@juniorbachchan) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మేము కోలుకోవాలని ఎల్లవేళలా ప్రార్థిస్తోన్న అందరికీ కృతజ్ఞతలు. మీ రుణం తీర్చుకోలేనిది. ఐశ్వర్య, ఆరాధ్యలకు కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. వారు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. నేను, తండ్రి అమితాబ్ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగిస్తున్నాం".

-అభిషేన్ బచ్చన్, నటుడు

కరోనా పాజిటివ్ రావడం వల్ల అమితాబ్, అభిషేక్ మొదట నానావతి ఆస్పత్రికి వెళ్లారు. ఐశ్వర్య, ఆరాధ్య మాత్రం హోం క్వారంటైన్​లో ఉన్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత వీరిద్దరు కూడా హాస్పిటల్​లో జాయిన్ అయ్యారు. వారం రోజులుగా ఐసోలేషన్​లో ఉన్న ఐశ్వర్య, ఆరాధ్య కోలుకుని ఇంటికి చేరుకున్నారు.

Last Updated : Jul 27, 2020, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.