ETV Bharat / sitara

పవన్ చిత్రంలో గిరిజన యువతిగా ఐశ్వర్య! - ఐశ్వర్యా రాజేశ్ తాజా వార్తలు

పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ ఎవరనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.

Aishwarya Rajesh to play lead role in Pawan-Krish Film
పవన్ చిత్రంలో గిరిజన యువతిగా ఐశ్వర్య!
author img

By

Published : Jan 4, 2021, 3:56 PM IST

పవర్​స్టార్ పవన్‌ కల్యాణ్‌ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తుందా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇటీవలే 'వకీల్‌సాబ్‌' చిత్రీకరణ పూర్తి చేశారు పవన్‌. ఇది సెట్స్‌పై ఉండగానే క్రిష్‌తో ఓ చిత్రం ప్రకటించారు. కొద్ది భాగం షూటింగ్‌ జరుపుకొన్న ఈ చిత్రంలో నటించే కథానాయికపై ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ చిత్రబృందం అధికారిక ప్రకటన ఇవ్వకపోవడం వల్ల మరోసారి ఈ అంశం ప్రచారంలోకి వచ్చింది.

ఈ పీరియాడికల్‌ డ్రామా చిత్రంలో నాయిక పాత్ర గిరిజన యువతి నేపథ్యంలో సాగుతుందట. అందానికంటే అభినయానికి ప్రాధాన్యం ఎక్కువ ఉండటం వలస్ల ఐశ్వర్య అయితే న్యాయం చేయగలదని చిత్రబృందం భావించిందని వినికిడి. దీంతోపాటు పవన్‌ 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' రీమేక్‌లోనూ ఐశ్వర్యనే నాయిక అని సమాచారం. మరి ఈ రెండింటిలో ఐశ్వర్యకు ఏది దక్కుతుందో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.