ETV Bharat / sitara

నివేదా స్థానంలో ఐశ్వర్యా రాజేష్​! - ramya krishan latest news

మెగా మేనల్లుడు సాయిధరమ్​ తేజ్​ కథానాయకుడిగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో తాజాగా నటి ఐశ్వర్యా రాజేష్​కు అవకాశం దక్కింది. ఈ చిత్రంలో తొలుత నివేదా పేతురాజ్​ను తీసుకున్నా ఆమె డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్ల సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

aishwarya rajesh-to-pair-with-sai dharam tej
నివేదా స్థానంలో ఐశ్వర్యా రాజేష్​!
author img

By

Published : Oct 31, 2020, 5:14 PM IST

Updated : Oct 31, 2020, 6:00 PM IST

మెగా మేనల్లుడు సాయిధరమ్​ తేజ్ కొత్త చిత్రంలో ఐశ్వర్యా రాజేష్​ను కథానాయికగా తీసుకున్నారు. తొలుత ఈ సినిమాలో నివేదా పేతురాజ్​ని ఎంపిక చేసినా ఆమె ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో షూటింగ్‌ జరుపుకొంటోందీ సినిమా.

ముఖ్యమంత్రిగా రమ్యకృష్ణ ?

దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి 'రిపబ్లిక్​' అనే పేరును ఖరారు చేసినట్లు సినీవర్గాలు చెప్పుకొంటున్నాయి. 2004లో ఏలూరులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, రాజకీయ నేపథ్యంలో ఆసక్తికర కథనంతో రాబోతుందని సమాచారం. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనుందట. ఇక హీరో‌ తేజ్‌ వైద్యుడి పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది.

Last Updated : Oct 31, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.