ETV Bharat / sitara

కుటుంబంతో హైదరాబాద్ వచ్చిన ఐష్ - హైదరాబాద్​ చేరిన ఐశ్వర్య-అభిషేక్​

బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ ఆదివారం​ కుటుంబంతో సహా హైదరాబాద్​కు వచ్చారు. లాక్​డౌన్ విధించిన దాదాపు పది నెలల తర్వాత ఐష్​ బయటకు వచ్చారు.

Aishwarya Rai bhachan in Hyd
కుటుంబంతో హైదరాబాద్ వచ్చిన 'ఐష్'
author img

By

Published : Jan 3, 2021, 5:16 PM IST

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్, నటుడు అభిషేక్ బచ్చన్.. తమ కుమార్తె ఆరాధ్యతో కలిసి హైదరాబాద్​లో అడుగుపెట్టారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్​ డౌన్​ సమయం నుంచి ఐష్​ బయటకు రాలేదు. దాదాపు పది నెలల తర్వాత ఈమె కుటుంబంతో సహా బయటకు రావడం అభిమానులకు ఆసక్తికరంగా మారింది.

ఐష్​ హైదరాబాద్​ రాకకు కారణం ఏమిటో ఇంకా తెలియలేదు. కానీ, మణిరత్నం తమిళ సినిమా 'పొన్నియిన్ సెల్వన్' షూటింగ్​ నేపథ్యంలో బాలీవుడ్​ అందాల భామ ఇక్కడికి వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు. 'పొన్నియిన్​ సెల్వన్'​ సినిమాలో ఐష్ డబుల్​ రోల్​ చేయనున్నట్లు సమాచారం. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత అమితాబ్​ బచ్చన్ సహా అభిషేక్​ కుటుంబ సభ్యులు ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. మొదటగా ఐశ్వర్య, ఆరాధ్యలు కరోనాను జయించారు.

ఇదీ చదవండి:హాట్​ లుక్స్​తో హీటెక్కిస్తోన్న మాళవిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.