ETV Bharat / sitara

అందాల 'ఐశ్వర్య' రాశి.. ఈ నీలికళ్ల విశ్వ సుందరి - aishwarya rai bachchan birthday, aishwarya rai turns 46, aishwarya rai birthday on november 1, abhishek aishwarya in rome, aaradhya bachchan, aishwarya rai birthday plans, aishwarya rai bachchan latest, aishwarya abhishek news,

పెద్దయ్యాక డాక్టర్​ అవ్వాలనుకుంది... ఆ తర్వాత ఆర్కిటెక్ట్​గా స్థిరపడాలనుకుంది​.. కాని చివరికి మోడలైంది. అందాల పోటీల్లో మెరుపులా మెరిసి విశ్వ సుందరిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తన నటనతో వెండితెరపైనా కోట్లాది మందిని మెప్పించిన ఆ భామే... ఐశ్వర్యరాయ్​. నేడు 46వ వసంతంలోకి అడుగుపెడుతోంది.

46వ వసంతలోకి... నీలికల్ల విశ్వ సుందరి
author img

By

Published : Nov 1, 2019, 5:46 AM IST

అందం అనే మాటకే సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రపంచ సుందరి. ర్యాంపుపై నడకతో, తన నీలికళ్లతో, సినిమాల్లో నటనతో ఎందరో అభిమానులను ఆకట్టుకున్న వయ్యారి భామ. తనదైన అభినయంతో కోట్లాది మంది కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టేసింది. ఆ అందాల రాశి ఐశ్వర్యరాయ్​ బచ్చన్​ నేడు 46వ వసంతంలోకి అడుగుపెట్టింది.

Aishwarya Rai Bachchan entering into 46th birthday and few details about her
అందాల భామ ఐశ్వర్యరాయ్​

కన్నడ సుందరి...

కర్నాటకలోని మంగుళూరులో 1973 నవంబర్‌ 1న పుట్టింది ఐశ్వర్యరాయ్‌. తులు మాట్లాడే కుటుంబంలో కృష్ణరాజ్‌రాయ్, బృందారాయ్​కి జన్మించిందీ అమ్మడు. ఈమెకు ఆదిత్యరాయ్‌ అనే సోదరుడు ఉన్నాడు. అతను మర్చెంట్​ నేవీలో ఇంజనీర్​. చిన్నతనం నుంచి ముంబయిలోనే పెరిగిన ఈ భామ... చదువుతూనే సంగీతం, సంప్రదాయ నృత్యాన్ని ఐదేళ్లు అభ్యసించింది.

మోడల్​ అవ్వాలని అనుకోలేదు...

చదువులో టాపర్​ అయిన ఈ అమ్మడు... మాతుంగలోని ఆర్య విద్యామందిర్, జైహింద్‌ కాలేజ్, డి.జి.రూపరెల్‌ కళాశాలల్లో విద్యాభ్యాసం చేసింది. మొదట డాక్టర్‌ కావాలనుకొంది. మధ్యలో లక్ష్యం మార్చుకొని ఆర్కిటెక్చర్‌ కావాలని నిర్ణయించుకొంది. ఆ రంగంలో కొన్నాళ్లపాటు పార్ట్‌టైమ్‌ జాబ్‌ కూడా చేసింది. కానీ ఆమె అందం మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించేలా చేసింది. 1991లో ఓ సంస్థ నిర్వహించిన సూపర్‌మోడల్‌ కాంటెస్ట్‌లో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తరువాత పలు సంస్థలకి మోడల్‌గా వ్యవహరించింది.

ఐశ్వర్యరాయ్​

మొదటిసారే ఆమిర్​తో...

1993లో ఆమిర్‌ఖాన్‌తో కలిసి ఓ ప్రకటనలో నటించింది ఐష్​. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో ఆమె పేరు మార్మోగిపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు, కథానాయకులు ఐష్‌ని తమ సినిమాల్లో హీరోయిన్​గా ఎంచుకోవాలని ప్రయత్నించారు. కానీ ఆమె మాత్రం తనకి ఇష్టమైన ఆర్కిటెక్టింగ్‌ రంగంలోకి వెళ్లాలని సినిమా అవకాశాల్ని తిరస్కరించిందట.

మిస్​ ఇండియా నుంచి మిస్​ వరల్డ్​...

1994లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఐష్​... అందులో రన్నరప్​గా నిలిచింది. మరో బాలీవుడ్​ నటి సుస్మితాసేన్‌ విజేతగా నిలిచింది. తర్వాత ఏడాది (1995)లో దక్షిణాఫ్రికాలో జరిగిన విశ్వ సుందరి పోటీల్లో పాల్గొంది. అందులో కిరీటం దక్కించుకొంది.

మిస్​ ఇండియా రన్నరప్​గా

వెండితెరపై అరంగేట్రం...

మణిరత్నం తమిళంలో తీసిన 'ఇరువర్‌'తో తెరంగేట్రం చేసింది. ఆ చిత్రం తెలుగులో 'ఇద్దరు'గా విడుదలైంది. అందులో ఐశ్వర్యారాయ్‌ పుష్పవల్లి, కల్పన పేర్లతో ద్విపాత్రాభినయం చేసింది. అదే ఏడాది 'ఔర్‌ప్యార్‌ హో గయా' చిత్రం ద్వారా హిందీ తెరకు పరిచయమైంది. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. 1998లో శంకర్‌ తీసిన 'జీన్స్‌'లో అవకాశాన్ని అందుకొని... మధుమిత పాత్రలో చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అంతర్జాతీయ గుర్తింపు...

హిందీలో 'హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌' తర్వాత ఐష్‌కి అభిమానులు భారీగా పెరిగారు. ఆ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఆ తరువాత 'తాల్‌','హమ్‌ కిసీ సే కమ్‌ నహీ' లాంటి చిత్రాల్లో నటించి అలరించింది. ఆమెకి అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు రావడానికి 'దేవదాస్‌' ఓ కారణం. అందులో పారూ పాత్రలో మైమరపించింది. ఆ చిత్రం కేన్స్‌ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ఆ తరువాత ఐశ్వర్యారాయ్‌కి అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో అవకాశాలు కూడా లభించాయి. 'బ్రైడ్‌ అండ్‌ ప్రెజిడ్యూస్‌', 'మిసెస్‌ ఆఫ్‌ స్పైసెస్‌','ప్రొవోక్డ్​ట, 'ది లాస్ట లెజియన్‌' తదితర హాలీవుడ్‌ చిత్రాల్లో నటించింది.

ఫోజులిస్తున్న ఐష్​

సల్మాన్‌తో డేటింగ్‌..

వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడుదొడుకులనూ ఎదుర్కొంది. 1999లో సల్మాన్‌ఖాన్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి డేటింగ్‌ చేశారని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే ఇద్దరి మధ్య బంధం ఎంతో కాలం కొనసాగలేదు. 2001లో ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత కొన్నాళ్లకు వివేక్‌ ఒబెరాయ్‌తో ప్రేమలో పడినట్టు వార్తలొచ్చాయి.

సల్మాన్​తో ఐష్​

'ధూమ్‌2' కలిపింది..

అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి 'ధూమ్‌2'లో నటిస్తున్న సమయంలో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. 2007 జనవరి 14న ఐష్​-అభిషేక్​ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు అమితాబ్‌ బచ్చన్‌ ధ్రువీకరించారు. అదే ఏడాది ఏప్రిల్‌ 16న అమితాబ్‌ బచ్చన్‌ సొంతిల్లు ప్రతీక్షలో పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. 2011 నవంబరు 16న ఐశ్వర్యారాయ్‌ ఓ పాపకి జన్మనిచింది. నాలుగు నెలల తరువాత ఆ పాపకి 'ఆరాధ్య' అని పేరు పెట్టారు.

భర్త అభిషేక్​, కూతురు ఆరాద్యతో ఐశ్వర్య

ఆసక్తికర విషయాలు...

  1. కేన్స్‌ చలన చిత్రోత్సవం అవార్డుల జ్యూరీ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన తొలి భారతీయ నటి ఐశ్వర్యారాయ్‌.
  2. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే పెన్సిల్‌కి సంబంధించిన ఓ ప్రకటనలో ఐశ్వర్యారాయ్‌ నటించిందట.
  3. ఐశ్వర్యారాయ్‌ కథానాయిక కాక మునుపే ప్రముఖ కథానాయిక రేఖ గుర్తుపట్టి పలకరించిందట. ప్రకటనల్లో చాలా అందంగా కనిపిస్తున్నావని భుజం తట్టి ప్రోత్సహించిందట.
  4. దుబాయ్‌లో ఒక రోజంతా ట్రాఫిక్​ జామ్‌ కావడానికి ఐశ్వర్యారాయ్‌ కారణమైందట. ఓ ప్రకటనలో నటించడానికని దుబాయ్‌ వెళ్లిందట. ఆ సమయంలో అభిమానులు ఆమెని చూసేందుకు భారీగా రావడం వల్ల అక్కడ రోజంతా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యిందట.
  5. పెళ్లైన తరువాత చాలా తక్కువ చిత్రాల్లో నటించింది. వాటిల్లో 'సర్బజిత్‌', 'ఏ దిల్‌ ముష్కిల్‌ హై', 'ఫన్నేఖాన్‌'. అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటనల్లో మెరుస్తుంది. ఇటీవల 'కేన్స్‌ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌'లో పాల్గొని తన అందచందాలతో సందడి చేసింది.
  6. ఐశ్వర్యారాయ్‌ గర్భవతి అని తెలిసిన సమయంలో బాలీవుడ్‌లో ఓ వివాదం సాగింది. అప్పటికే ఆమె 'హీరోయిన్‌' అనే సినిమాలో నటిచేందుకు సంతకం చేసింది. చిత్రం సెట్స్‌పైకి వెళ్లే సమయంలో ఐశ్వర్యారాయ్‌ ప్రాజెక్టు నుంచి బయటికొచ్చింది. ఆమె ఐదు నెలల గర్భవతినని చెప్పడం వల్ల నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐష్‌ గర్భవతి అన్న విషయాన్ని దాచిపెట్టిందని, సినిమా ఆలస్యానికి కారణమైందని వాళ్లు ఆరోపించారు.
  7. మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్‌ సెల్వన్‌' అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఐశ్వర్యరాయ్, అమితాబ్‌ బచ్చన్, విక్రమ్‌, అనుష్క తదితరులు నటిస్తున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
MARGOTH QUISPE - AP CLIENTS ONLY
Pucallpa - 31 October 2019
1. Traffic on a street and exterior facade of the provincial courthouse and judicial building
2. SOUNDBITE (Spanish) Diana Rios, daughter of slain Amazon environmentalist:
"We have been through this procedure for justice for my father for over five years now and at least we have hope that we will get to the end of the process but accusing the persons who are involved in the crime against my father."
3. Sign outside building reads (Spanish) "Judicial Power, Supreme Court of Justice, Ucayali (province)"
4. SOUNDBITE (Spanish) Diana Rios, daughter of slain Amazon environmentalist:
"Unfortunately between 2014 and 2018 the process was shelved, it was given no importance, but in 2018 and this year, now, as there have been procedures done by our lawyers which are pushing things forward, now yes, it is probable that there will be justice, as there should be."  
5. Rios entering the courthouse building
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
++ARCHIVE: Lima - 3 December 2019
6. Various of a news conference during which indigenous people from Peru and Brazil spoke out about the deaths of members of their community because of illegal logging activities
7. A man representing the indigenous people pointing to a map where the deaths occurred
8. Ashaninca women seated at the conference table during the news conference
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
++ARCHIVE: Pucallpa - 1 December 2014
9. Various of people working on the banks of the Ucayali river with large logs of native hardwood trees felled in lumber operations in the area
STORYLINE:
The daughter of a Peruvian indigenous environmentalist killed just over five years ago said Thursday she is pleased with progress made in the case against his killers.
We have hope that we will get to the end of the process but accusing the persons who are involved in the crime regarding my father," said Diana Rios, daughter of Jorge Rios.
Rios, who campaigned against illegal logging in the Amazon rainforest, was shot dead in September 2014 along with fellow indigenous leaders Edwin Chota, Francisco Pinedo and Leoncio Quinticima.
"It is probable that there will be justice, as there should be," his daughter said as she entered the courthouse in Pucallpa to consult authorities there.   
Authorities in Peru say they have charged five men - two timber executives and three lumberjacks - with killing the indigenous leaders who had resisted a steady onslaught by illegal loggers in their remote Amazon jungle homeland.
It's the first time in Peru's history that filed such charges have been filed, and environmentalists consider the case to be pivotal.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.