బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ శవపరీక్షపై సమగ్రంగా అధ్యయనం చేసిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం తుది ఫలితాన్ని ప్రకటించింది. నటుడిది ఆత్మహత్యే అని తేల్చింది. అతడికి విషం ఇచ్చి, గొంతు నులిమి చంపడం వంటివి జరగలేదని తెలిపింది. దీంతో సుశాంత్ మృతికి సంబంధించి వచ్చిన అనేక అనుమానాలపై స్పష్టత వచ్చింది. కానీ ఈ కేసు న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉండటం వల్ల మరిన్ని వివరాలను బయటపెట్టేందుకు మెడికల్ బోర్డు నిరాకరించింది.
"సుశాంత్‌ది ఆత్మహత్యే. ఉరికి సంబంధించినవి తప్ప అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు."
-సుధీర్ గుప్తా, ఎయిమ్స్ ఫోరెన్సిక్ హెడ్
అంతకుముందు సుశాంత్ మృతదేహంలో ఎలాంటి విష పదార్ధాలు లేవని , ఆయన మృతికి ఉరి వేసుకోవడమే కారణమని ఎయిమ్స్ వర్గాలు ధృవీకరించాయి. దీంతో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడేలా ఎవరైనా ప్రేరేపించారా లేదా అన్న కోణంలో సీబీఐ దర్యాప్తు చేయనుంది.
ప్రస్తుతం ఈ కేసు విషయంలో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్‌తో సంబంధాలున్నాయన్న అనుమానంతో వీరిని ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు.
ఇదీ చూడండి 200 కిలోమీటర్లు నడిచొచ్చిన అభిమానం